టొయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో లిమిటెడ్ ఎడిషన్
ప్రస్తుతం పండుగ సీజన్‌లో కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎమ్) అందిస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ 'టొయోటా ఫార్చ్యూనర్'లో ఓ లిమిటెడ్ ఎడిషన్‌ను విపణిలోకి విడుదల చేసింది. గడచిన సంవత్సరంలో పండుగ సీజన్‌లో టొయోటా అందించిన 'ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో' లిమిటెడ్ ఎడిషన్‌ను తాజాగా మరోసారి మార్కెట్లో విడుదల చేసింది.
టొయోటా రేసింగ్ డెవలప్‌మెంట్ (టిఆర్‌డి) సహకారంతో కంపెనీ ఈ మోడల్‌ను అప్‌గ్రేడ్ చేసింది. మరింత స్పోర్టీ లుక్ అండ్ ఫీల్ కలిగిన ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని కోరుకునే వారి కోసం టొయోటా ఈ మోడల్‌ను ఆఫర్ చేస్తోంది. డిసెంబర్ నెలాఖరు వరకు కేవలం 400 యూనిట్ల టొయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో ఎస్‌యూవీలను మాత్రమే విక్రయించనున్నారు. ఈ లిమిటెడ్ ఎడిషన్ ఎస్‌యూవీకు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో లిమిటెడ్ ఎడిషన్ ఎస్‌యూవీలో డ్యూయెల్ టోన్ బంపర్స్ స్పాయిల్స్ (ఫ్రంట్ అండ్ రియర్), రియర్ రూఫ్ స్పాయిలర్, టిఆర్‌డి లోగోతో కూడిన ఫ్రంట్ గ్రిల్, సైడ్స్ స్పోర్టీ గ్రాఫిక్స్, వెనుక వైపు టిఆర్‌డి లోగో వంటి మార్పులు చేర్పులను గమనించవచ్చు.

ఇంటీరియర్లలో మార్పులకు సంబంధించిన సమాచారం లేదు. స్టాండర్డ్ వెర్షన్‌లోని ప్రీమియం ఇంటీరియర్ ఫీచర్లనే ఇందులోను ఆఫర్ చేసే అవకాశాలున్నాయి.

ఇకపోతే, ఇందులో ఇంజన్ పరంగా కూడా ఎలాంటి మార్పులు చేర్పులు లేవు. ఇదివరకటి 3.0 లీటర్, ఫోర్-సిలిండర్ డీజిల్ ఇంజన్‌నే ఇందులో ఉపయోగించారు. ఇది గరిష్టంగా 169 బిహెచ్‌పిల శక్తిని, 343 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది, ఈ ఇంజన్ ద్వారా వచ్చే శక్తి నాలుగు చక్రాలకు పంపిణీ అవుతుంది (ఆల్-వీల్ డ్రైవ్).

భారత మార్కెట్లో టొయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో లిమిటెడ్ ఎడిషన్ ధర రూ.24.26 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.


Click it and Unblock the Notifications








