సరికొత్త హంగులతో రూపొందించిన 2013 టొయోటా ఇన్నోవా విడుదల

By Ravi

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ భారత మార్కెట్లో ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్ ఇన్నోవా ఎమ్‌పివిని విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. కంపెనీ ఇప్పుడు చడీచప్పుడు లేకుండా సైలెంట్‌గా తమ సరికొత్త ఇన్నావాను మార్కెట్లో ప్రవేశపెట్టింది.

ఎమ్‌పివి సెగ్మెంట్లో పెరుగుతున్న పోటీని సమర్థవంతంగా తట్టుకునేందుకు టొయోటా, మునపటి వెర్షన్ ఇన్నావా డిజైన్, ఫీచర్లతో పోల్చుకుంటే మరింత మెరుగ్గా ఉండేలా తీర్చిదిద్దిన కొత్త ఇన్నోవాను తీర్చిదిద్దింది. దేశీయ విపణిలో కొత్త 2013 టొయోటా ఇన్నోవా ధరలు రూ.9.77 లక్షల నుంచి రూ.15.06 లక్షల రేంజ్‌లో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).

కొత్త 2013 టొయోటా ఇన్నోవాలోని సరికొత్త ఫీచర్ల వివరాలను తెలుసుకునేందుకు క్రింది ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి.

2013 టొయోటా ఇన్నోవా విడుదల

కొత్త 2013 టొయోటా ఇన్నోవా ఎమ్‌పివి ఫీచర్ల వివరాలను తర్లాతి స్లైడ్‌లలో పరిశీలించండి.

2013 టొయోటా ఇన్నోవా విడుదల

కొత్త 2013 టొయోటా ఇన్నోవా ఎమ్‌పివి మొత్తం నాలుగు వేరియంట్లలో (ఈ, జి, జిఎక్స్, విఎక్స్) విభిన్న ఆప్షన్లలో అందుబాటులో ఉంటంది.

2013 టొయోటా ఇన్నోవా విడుదల

ఆకర్షనీయమైన ఫ్రంట్ గ్రిల్ కొత్త ఇన్నోవాకు సరికొత్త లుక్‌ను అందిస్తుంది. 3 లైన్ క్రోమ్ బార్ గ్రిల్, దానిపై ఇన్నోవా లోగో ఆకర్షనీయంగా ఉంటుంది.

2013 టొయోటా ఇన్నోవా విడుదల

స్టయిలిష్ క్రోమ్ లైన్డ్ ఫాగ్ ల్యాంప్స్ ఇందులో మరొక ప్రత్యేక ఆకర్షణ. ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ ఉండే క్రోమ్ లైనింగ్ అట్రాక్టివ్‌గా ఉంటుంది.

2013 టొయోటా ఇన్నోవా విడుదల

కొత్త ఇన్నోవా వెనుక వైపు నుంచి ఆల్ట్రా మోడ్రన్ లుక్ కల్పించేలా, వెనుక డోరు క్రోమ్ గార్నిష్ చేశారు. బూట్ డోరుపై పెద్ద క్రోమ్ బార్‌ను జోడించారు.

2013 టొయోటా ఇన్నోవా విడుదల

స్టయిలిష్ క్రోమ్ ఫినిష్డ్ మఫ్లర్ (సైలెన్సర్) ఇన్నోవాకు మంచి లుక్‌నిస్తుంది.

2013 టొయోటా ఇన్నోవా విడుదల

స్పోర్టీ రియర్ స్పాయిలర్ ఈ కారుకు వెనుక నుంచి స్పోర్టీ లుక్‌నిస్తుంది.

2013 టొయోటా ఇన్నోవా విడుదల

క్రోమ్ ఫినిష్‌తో కూడిన స్పోర్టీ సైడ్ మౌల్డింగ్ కొత్త ఇన్నోవాకు మరింత ప్రీమియం అండ్ స్పోర్టీ లుక్‌నిస్తుంది.

2013 టొయోటా ఇన్నోవా విడుదల

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో క్లాసీ ఉడ్ అండ్ సిల్వర్ ఫినిష్ డ్యాష్‌బోర్డ్ ప్యానెల్ కొత్తగా ఉంటుంది. కారు ఇంటీరియర్‌కు ప్రీమియం లుక్‌నిస్తుంది.

2013 టొయోటా ఇన్నోవా విడుదల

అలాగే, రెండు రంగుల కలయికతో కూడిన లెథర్ కవర్డ్ డ్యూయెల్ టోన్ సీట్స్ సౌకర్యంగా ఉండటమే కాకుండా, మంచి లుక్‌ను కూడా ఇస్తాయి.

2013 టొయోటా ఇన్నోవా విడుదల

ఉడ్ ఫినిష్‌తో కూడిన ఆర్మ్ రెస్ట్ ప్యానెలో కొత్త ఇన్నోవాలో మరొక చెప్పుకోదగిన ప్రత్యేకత.

2013 టొయోటా ఇన్నోవా విడుదల

అలాగే, ఉడ్ ఫినిషింగ్‌తో కూడిన గేర్ నాబ్ కూడా ప్రత్యేకంగా అనిపిస్తుంది.

2013 టొయోటా ఇన్నోవా విడుదల

ఇందులో కొత్తగా 6-స్పోక్ స్టయిలిష్ అల్లాయ్ వీల్స్‌ను జోడించారు.

2013 టొయోటా ఇన్నోవా విడుదల

కొత్త ఇన్నోవా వీల్ ఆర్సెచ్ పై భాగంలో క్రోమ్ స్ట్రిప్ ఉంటుంది. ఇది బయటి నుంచి మరింత ప్రీమియం లగ్జరీ లుక్‌నిస్తుంది.

2013 టొయోటా ఇన్నోవా విడుదల

బాడీ కలర్ సైడ్ మిర్రర్స్, వాటిపై టర్న్ ఇండికేటర్స్ ఈ కారులో మరో ప్రత్యేకత.

2013 టొయోటా ఇన్నోవా విడుదల

బయటి డోర్ హ్యాండిల్స్, వాటి చుట్టూ క్రోమ్ ఫినిషింగ్ కొత్తగా అనిపిస్తుంది.

2013 టొయోటా ఇన్నోవా విడుదల

టాప్ ఎండ్ వేరియంట్లుగా గుర్తింపునిచ్చేందుకు వీటికి వెనుక భాగంలో జెడ్ బ్యాడ్జ్‌ను జోడించారు.

2013 టొయోటా ఇన్నోవా విడుదల

దేశీయ విపణిలో కొత్త 2013 టొయోటా ఇన్నోవా ధరలు రూ.9.77 లక్షల నుంచి రూ.15.06 లక్షల రేంజ్‌లో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).

More from DriveSpark

Article Published On: Saturday, October 5, 2013, 13:03 [IST]
English summary
Toyota Innova facelift was unveiled in Indonesia a few weeks back. This was followed by a continuous barrage of spy shots and leaked price list. All that will come to an end now that Toyota has officially revealed all information about the Innova facelift.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+