డిసి డిజైన్స్ టొయోటా ఇన్నోవా లాంజ్ ప్యాకేజ్

By Ravi

వెహికల్ కస్టమైజేషన్ గురించి అవగాన ఉన్న వారికి డిసి డిజైన్స్ సంస్థ గురించి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. వెహికల్ కస్టమైజేషన్‌లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మన భారతీయుడు, ప్రముఖ ఆటోమోటివ్ డిజైనర్ దిలీప్ ఛాబ్రియా స్థాపించిన వెహికల్ కస్టమైజేషన్ సంస్థ డిసి డిజైన్స్ తాజాగా టొయోటా ఇన్నోవా కోసం ఓ లాంజ్ ప్యాకేజ్‌ను విడుదల చేసింది.

తమదైన శైలిలో ఇన్నోవాను కస్టమైజ్ చేసి ఎక్స్టీరియర్లను ఆకర్షనీయంగా, ఇంటీరియర్లను అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దారు. కోట్లు ఖరీదు చేసే విలాసవంతమైన కార్లలో ఉండే ఇంటీరియర్స్‌ను కేవలం అతి తక్కువ మొత్తంలోనే ఈ కస్టమైజ్డ్ ఇన్నోవాలో పొందవచ్చు. రెండవ వరుసలో కెప్టెన్ సీట్లు, వినోదం కోసం పెద్ద స్క్రీన్, ల్యాప్ టాప్/ఫుడ్ ట్రే, కప్ హోల్డర్స్, శీతల పానీయాలను భద్రపరచుకునేందుకు చిన్నసైజు ఫ్రిడ్జ్ వంటి ఫీచర్లను ఈ డిసి ఇన్నోవాలో చూడొచ్చు.

దూర ప్రయాణాలు చేసేటప్పుడు వెనుక సీట్లలో ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేందుకు కోసం అత్యంత సౌకర్యవంతంగా, ప్రీమియం లెథర్‌, ఫుట్ రెస్ట్, నెక్ రెస్ట్, ఆర్మ్ రెస్ట్ లతో ఏర్పాటు చేసిన సీట్లు ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సీట్లన్నీ కూడా ఆటోమేటిక్‌గా కంట్రోల్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. ఇంటీరియర్ థీమ్‌ కూడా మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఈ డిసి ఇన్నోవా ఎక్స్టీరియర్లలో కూడా కొద్దిపాటి మార్పులను గమనించవచ్చు. మరి ఈ కస్టమైజ్డ్ బ్యూటీపై మనం కూడా ఓ కన్నేసొద్దాం రండి..!

టొయోటా ఇన్నోవా డిసి లాంజ్ ప్యాకేజ్

డిసి డిజైన్స్ కస్టమైజ్ చేసిన ఈ టొయోటా ఇన్నోవా ఎక్స్టీరియర్లలో మార్పులు పరిమితమే, అయినప్పటికీ ఇంటీరియర్లను పూర్తిగా మార్చేశారు.

టొయోటా ఇన్నోవా డిసి లాంజ్ ప్యాకేజ్

ప్రీమియం లెథర్ సీట్లు, వినోదం పెద్ద ఎల్‌సిడి స్క్రీన్, బీజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్‌తో కూడిన ఇంటీరియర్ థీమ్‌ను ఈ కారులో గమనించవచ్చు.

టొయోటా ఇన్నోవా డిసి లాంజ్ ప్యాకేజ్

ఫ్రంట్ ప్యాసింజర్ సీటును అత్యంత విలాసవంతమైన రీతిలో, ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేసుకునే వెసలుబాటుతో కస్టమైజ్ చేశారు.

టొయోటా ఇన్నోవా డిసి లాంజ్ ప్యాకేజ్

క్రోమ్ గార్నిష్, ఉడ్ ఫినిష్, స్పీకర్స్, ఇల్యుమినేషన్ (లైటింగ్), మ్యాగజైన్ హోల్డర్స్‌తో కస్టమైజ్ చేసిన డిసి ఇన్నోవా డోర్స్ కూడా ఇక్కడ ప్రధానంగా చెప్పుకోదగిన ఫీచర్లు.

టొయోటా ఇన్నోవా డిసి లాంజ్ ప్యాకేజ్

మధ్య వరుస (రెండవ వరుస)లోని కెప్టెన్ సీట్లు అనేక సౌకర్యవంతమైన ఫీచర్లతో లభిస్తాయి.

టొయోటా ఇన్నోవా డిసి లాంజ్ ప్యాకేజ్

రెండవ వరుసలోని కెప్టెన్ సీట్లను పూర్తిగా వెనుకకు జరుపుకొని, ఫుట్ రెస్ట్ లను ఆన్ చేసుకొని, హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు.

టొయోటా ఇన్నోవా డిసి లాంజ్ ప్యాకేజ్

అయితే, చివరి వరుస (మూడవ వరుస)లోని సీట్లు మాత్రం అంత విలాసవంతంగా ఉండవు.

టొయోటా ఇన్నోవా డిసి లాంజ్ ప్యాకేజ్

శీతల పదార్ధాలు, పానీయాలను స్టోర్ చేసుకునేందుకు కారు వెనుక భాగంలో (బూట్ స్పేస్‌లో) ఓ చిన్న ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది.

టొయోటా ఇన్నోవా డిసి లాంజ్ ప్యాకేజ్

ఈ టొయోటా ఇన్నోవా డిజి లాంజ్‌లో ఉపయోగించిన మెటీరియల్ నాణ్యత అత్యంత విలాసవంతమైన అనుభూతిని కల్పిస్తుంది.

టొయోటా ఇన్నోవా డిసి లాంజ్ ప్యాకేజ్

ఈ కస్టమైజ్డ్ కారు జోడించిన కొత్త స్టయిలిష్ అల్లాయ్ వీల్స్, దీనికి మరింత ప్రీమియం లుక్‌ని కల్పిస్తాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, July 3, 2013, 11:34 [IST]
English summary
DC Designs has modified Toyota's best selling MPV Innova, DC Designs has released the images of customized Toyota Innova. Toyota Innova Lounge Package is available with DC Designs.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+