'టొయోటా ఎతియోఎస్ ఎక్స్‌క్లూజివ్' లిమిటెడ్ ఎడిషన్ విడుదల
టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఎతియోస్ సెడాన్‌లో ఓ కొత్త లిమిటెడ్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. ఎతియోస్ ఎక్స్‌క్లూజివ్ (Etios Xclusive) పేరిట టొయోటా ఈ లిమిటెడ్ ఎడిషన్‌ను ఆఫర్ చేస్తోంది. రెగ్యులర్ ఎతియోస్‌తో పోల్చుకుంటే, ఈ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్లో మరిన్ని అదనపు ఫీచర్లు లభిస్తాయి.
టొయోటా ఎతియోఎస్ ఎక్స్‌క్లూజివ్ కేవలం 900 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. ముందు వైపు ఫుల్ క్రోమ్ గ్రిల్, టెయిల్ ల్యాంప్స్, హెడ్‌ల్యాంప్స్ మరియు సైడ్ మిర్రర్లపై క్రోమ్ గార్నిష్, బ్లూటూత్ ఆడియో సిస్టమ్, లిమిటెడ్ ఎడిషన్ బ్యాడ్జ్ మొదలైన ఫీచర్లు ఇందులో లభిస్తాయి.

రెగ్యులర్ టొయోటా ఎతియోస్ జి గ్రేడ్ వేరియంట్‌ను ఆధారంగా చేసుకొని కొత్త ఎతియోస్ ఎక్స్‌క్లూజివ్ వేరియంట్‌ను ప్రవేశపెట్టారు. ఇది క్లాసిక్ గ్రే, సింఫనీ సిల్వర్ అనే రెండు రంగులలో మాత్రమే లభిస్తుంది. ఈ కారును సొంతం చేసుకునేందుకు టొయోటా ఆర్థిక విభాగం - టొయోటా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆన్-రోడ్ ధరలో పూర్తిగా 100 శాతం ఫండింగ్‌ను అందిస్తోంది.
ఎతియోస్ ఎక్స్‌క్లూజివ్ కోసం నేటి నుంచే బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి. డెలివరీలు మాత్రమే జులై 11, 2014వ తేది నుంచి ప్రారంభమవుతాయి. దేశీయ విపణిలో టొయోటా ఎతియోఎస్ ఎక్స్‌క్లూజివ్ లిమిటెడ్ ఎడిషన్ ధరలు క్రింది విధంగా ఉన్నాయి:
ఎతియోఎస్ ఎక్స్‌క్లూజివ్ (పెట్రోల్) - రూ.5,98,140
ఎతియోఎస్ ఎక్స్‌క్లూజివ్ (డీజిల్) - Rs. 7,10,240
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)


Click it and Unblock the Notifications








