సరికొత్త కరోలా ఆల్టిస్ సెడాన్‌ను విడుదల చేసిన టొయోటా
జపనీస్ కార్ కంపెనీ టొయోటా గడచిన సంవత్సరం ద్వితీయార్థంలో అమెరికన్, యూరోపియన్ మార్కెట్లలో విడుదల చేసిన సరికొత్త నెక్స్ట్ జనరేషన్ కరోలా ప్రీమియం సెడాన్ 'టొయోటా కరోలా ఆల్టిస్' (Toyota Corolla Altis)ను కంపెనీ తాజాగా భారత మార్కెట్లో కూడా విడుదల చేసింది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో టొయోటా తొలిసారిగా ఈ మోడల్‌ను భారత్‌కు పరిచయం చేసింది.
ప్రస్తుతం టొయోటా విడుదల చేసిన ఈ సరికొత్త కరోలా ఆల్టిస్ 11వ తరానికి చెందినది. టొయోటా తొలిసారిగా 2003లో కరోలా ఆల్టిస్‌ను భారత్‌లో విడుదల చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 88,500 యూనిట్లకు పైగా కరోలా ఆల్టిస్ కార్లు అమ్ముడుపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న సెడాన్‌గా కరోలా రికార్డును సృష్టించింది. ఈ మోడల్‌కు ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు.
దేశీయ విపణిలో 2014 టొయోటా కరోలా పెట్రోల్ వెర్షన్ ప్రారంభ ధర రూ.11.99 లక్షలుగా ఉండగా, డీజిల్ వెర్షన్ ప్రారంభ ధర రూ.13,07 లక్షలుగా (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ కారుకు సంబంధించిన సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం రండి.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో 2014 టొయోటా కరోలా ఆల్టిస్ సెడాన్‌లో చేసిన మార్పుల చేర్పులను తెలుసుకోండి.

ఎక్స్టీరియర్ మార్పులు
ఆకర్షనీమైన క్రోమ్ గ్రిల్, బంపర్‌లో చిన్న ఎయిర్ ఇన్‌టేక్, ఫ్రంట్ ఆప్రాన్స్ వరకు స్ట్రెచ్ చేసిన పెద్ద హెడ్‌లైట్స్, రివైజ్డ్ గ్రిల్, కొత్త బానెట్ డిజైన్, బాడీ లైన్స్, పెద్ద ఫాగ్‌ల్యాంప్ హౌసింగ్, రియర్ వ్యూ మిర్రర్స్‌పై టర్న్ ఇండికేటర్స్, కొత్త అల్లాయ్ వీల్స్, వెనుక వైపు సన్నటి మరియు పొడవాటి టెయిల్ ల్యాంప్ క్లస్టర్, రెండు టెయిల్ ల్యాంప్స్ మధ్యలో క్రోమ్ స్ట్రిప్, రీడిజైన్డ్ రియర్ బంపర్, 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి అనేక మార్పులు చేర్పులను ఈ కొత్త 2014 టొయోటా కరోలా ఆల్టిస్‌లో చూడొచ్చు.

ఇంటీరియర్ అప్‌గ్రేడ్స్
సైబర్ కార్బన్ పియానో బ్లాక్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, రౌండ్ డయల్స్‌తో కూడిన స్పోర్టీయర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కంట్రోల్‌తో కూడిన 3-స్పోక్ లెథర్ స్టీరింగ్ వీల్, ఇంటీరియర్ ఇల్యుమినేషన్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, పెంచబడిన వీల్‌బేస్ (100 మి.మీ.) వంటి మార్పులతో ఇది విలాసవంతమైన కారును నడుపుతున్న అనుభూతినిస్తుంది.

కంఫర్ట్ ఫీచర్స్
శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్, 7 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, లెథర్ సీట్స్, కీలెస్ ఎంట్రీ, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ప్యాడల్ షిఫ్టర్స్ (ఆటోమేటిక్ వేరియంట్) పుష్ బటన్ స్టార్ట్, రియర్ రిక్లైనింగ్ సీట్స్ (సెగ్మెంట్ ఫస్ట్), రియర్ రీడింగ్ ల్యాంప్, రియర్ సన్ షేడ్, రియర్ పవర్ సాకెట్, మెరుగుపరచిన డ్రైవింగ్ పొజిషన్, సీట్ అడ్జస్టమెంట్ వంటి పలు కంఫర్ట్ ఫీచర్ల వలన ఈ కారును నడపటం, ఇందులో ప్రయాణించడం సౌకర్యవంతంగా ఉంటుంది.

ఇంజన్ ఆప్షన్స్ - పెట్రోల్
కొత్త టొయోటా కరోలా ఆల్టిస్ పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్‌లో 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 140 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మ్యాన్యువల్ వెర్షన్‌లో 6-స్పీడ్ గేర్‌బాక్స్, ఆటోమేటిక్ వెర్షన్‌లో 7-స్పీడ్ సివిటి గేర్‌బాక్స్‌ను ఉపయోగించారు.

ఇంజన్ ఆప్షన్స్ - డీజిల్
డీజిల్ వెర్షన్‌లో వేరియబల్ నాజల్ టర్బోతో కూడిన 1.4 లీటర్ 1ఎన్‌డి డి-4డి ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజన్ గరిష్టంగా 88 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తోనే అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇందులో ఆటోమేటిక్ వెర్షన్ అందుబాటులో లేదు.

సేఫ్టీ ఫీచర్స్
కొత్త కరోలా ఆల్టిస్‌లో ఈబిడి మరియు ఏబిఎస్‌తో కూడిన బ్రేక్ అసిస్ట్, కుడిచేతి వైపు రియర్ ఫాగ్ ల్యాంప్స్, డ్యూయెల్ ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్, జిఓఏ బాడీ, ఇమ్మొబిలైజర్, ఆడియో స్క్రీన్‌పై డిస్‌ప్లేతో కూడిన రియర్ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి.

కలర్ ఆప్షన్స్
కొత్త టొయోటా కరోలా ఆల్టిస్ మొత్తం 7 ఆకర్షనీయమైన రంగుల్లో లభిస్తుంది. అవి - వైట్ పెరల్ క్రిస్టల్ షైన్, సిల్వర్ మైకా మెటాలిక్, గ్రే మెటాలిక్, బ్లూ మెటాలిక్, షాంపైన్ మైకా మెటాలిక్, సూపర్ వైట్ 2 మరియు సెలెస్టియల్ బ్లాక్.

ధరలు - పెట్రోల్ వెర్షన్
కరోలా ఆల్టిస్ విఎల్ (సివిటి) - రూ.16,89,324
కరోలా ఆల్టిస్ జిఎల్ - రూ.15,38,324
కరోలా ఆల్టిస్ జి-సివిటి - రూ.15,04,324
కరోలా ఆల్టిస్ జి - రూ.13,74,328
కరోలా ఆల్టిస్ జె(ఎస్) - రూ.11,99,000
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ధరలు - డీజిల్ వెర్షన్
కరోలా ఆల్టిస్ డిజిఎల్ - రూ.16,68,324
కరోలా ఆల్టిస్ డిజి - రూ.15,04,324
కరోలా ఆల్టిస్ డిజె(ఎస్) - రూ.13,64,324
కరోలా ఆల్టిస్ డిజె - రూ.13,07,324
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)


Click it and Unblock the Notifications








