కరోలా ఆల్టిస్ ఉత్పత్తి బంద్; త్వరలో కొత్త వెర్షన్ విడుదల

By Ravi

జపనీస్ కార్ మేకర్ టొయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీ భారత మార్కెట్లో విక్రయిస్తున్న 'కరోలా ఆల్టిస్' సెడాన్ ఉత్పత్తిని నిలిపివేసింది. మరికొద్ది రోజుల్లో ఇందులో కొత్త వెర్షన్‌ను విడుదల చేయనున్న నేపథ్యంలోనే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పరిశ్రమ వర్గాల సమాచారం, వచ్చే నెలలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో టొయోటా ఈ కొత్త మోడల్‌ను ప్రదర్శనకు ఉంచే ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం, రెండు మూడు నెలల్లో దీనిని మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది.

జనవరి నెల నుంచి టొయోటా తమ కరోలా ఆల్టిస్ సెడాన్ ఉత్పత్తిని నిలిపివేసింది, కంపెనీ ఇప్పుడు కొత్త వెర్షన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. వాస్తవానికి ఈ కొత్త 2014 కరోలా సెడాన్ ఇప్పటికే కొన్ని గ్లోబల్ మార్కెట్లలో వాణిజ్య పరంగా విడుదలయ్యింది.


ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న కరోలా ఆల్టిస్ పెట్రోల్, డీజిల్, సిఎన్‌‌జి ఫ్యూయెల్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. పెట్రోల్ వెర్షన్‌లో 1.8 లీటర్, 4-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 138 బిహెచ్‌పిల శక్తిని, 170 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇందులో టాప్-ఎండ్ పెట్రోల్ వేరియంట్లలో 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను ఆప్షన్‌ను కూడా కంపెనీ ఆఫర్ చేస్తుంది.

అలాగే, డీజిల్ వెర్షన్ కరోలా ఆల్టిస్‌లో 1.4 లీటర్, టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 88 బిహెచ్‌పిల శక్తిని, 205 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఇది కేవలం 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తోనే లభిస్తుంది. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ ఆప్షన్ అందుబాటులో లేదు. దేశీయ విపణిలో పెట్రోల్ వెర్షన్ ధరలు రూ.12.54 లక్షల నుంచి 16.89 లక్షల రేంజ్‌లోను, డీజిల్ వెర్షన్ ధరలు 13.26 లక్షల నుంచి రూ.16.74 లక్షల రేంజ్‌లో ఉన్నాయి.

2014 Toyota Corolla

కాగా.. కొత్త 2014 టొయోటా కరోలా సెడాన్‌లో కూడా ఇంజన్ పరంగా పెద్దగా మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ఇందులో 1.4 లీటర్ డీజిల్ ఇంజన్ (88.4 పిఎస్ పవర్, 205 ఎన్ఎమ్ టార్క్)ను ఉపయోగించనున్నారు. పెట్రోల్ వెర్షన్‌లో 1.8 లీటర్ డ్యూయెల్ విటివిటి-ఐ (140 పిఎస్ పవర్, 173 ఎన్ఎమ్ టార్క్) ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్లను 6-స్పీడ్ మ్యన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్లతో అనుసంధానం చేయబడి ఉంటాయని తెలుస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, January 20, 2014, 10:13 [IST]
English summary
Toyota Kirloskar Motor has stopped production of its premier sedan Corolla Altis from this month as it gears up to roll out a new version in the next 4-5 months. According to industry sources, the company will showcase the model with added features during the upcoming Auto Expo in New Delhi next month.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+