ఇన్నోవా ఫేస్‌లిఫ్ట్‌ను సిద్ధం చేస్తున్న టొయోటా

By Ravi

ఎమ్‌పివి సెగ్మెంట్లో మార్కెట్ లీడర్ ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చేది టొయోటా ఇన్నోవా. ఈ సెగ్మెంట్లోకి ఎన్ని కొత్త మోడళ్లు ప్రవేశించినప్పటికీ, ఇన్నోవా ధీటుగా నిలుబడలేకపోయాయి. అయితే, ప్రస్తుత పోటీవాతారణంలో తన అగ్రస్థానాన్ని నిలుపుకునేందుకు గాను జపనీస్ ఆటో దిగ్గజం టొయోటా తమ ఇన్నోవాలో ఓ కొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే, టొయోటా ఇన్నోవా ఫేస్‌లిఫ్ట్‌కు సంబంధించిన స్పై చిత్రాలు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ అప్‌గ్రేడెడ్ వెర్షన్ టొయోటా ఇన్నోవా తొలుతగా ఇండినేషియా మార్కెట్లోను ఆ తర్వాత భారత మార్కెట్లో విడుదల కానుంది. ఈ స్పై చిత్రాలను బట్టి చూస్తే, కొత్త అప్‌గ్రేడెడ్ ఇన్నోవా ఫ్రంట్, రియర్ డిజైన్లలో కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండనున్నాయి.

Toyota Innova Facelift

ముందు వైపు పెద్ద క్రోమ్ గ్రిల్, సరికొత్త ఫ్రంట్ బంపర్, కొత్త ఎయిర్‌డ్యామ్ డిజైన్, ఫాగ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ క్రోమ్ సరౌండింగ్స్ వంటి మార్పులు ప్రధానంగా గమనించవచ్చు. వెనుక వైపు కూడా క్రోమ్ గార్నిష్ చేశారు. నెంబర్ ప్లేట్‌కు పైభాగంలో పెద్ద క్రోమ్ బార్‌ను జోడించారు. ఇంటీరియర్ మార్పుల గురించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.

టొయోటా ఇన్నోవాను 2005లో ప్రవేశపెట్టిన తర్వాత అప్‌గ్రేడ్ చేయటం ఇది మూడవసారి. తొలిసారి అప్‌డేట్‌ను 2009లోను ఆ తర్వాతి అప్‍‌డేట్‌ను 2011లోను విడుదల చేశారు. తాజాగా అప్‌గ్రేడ్ చేసిన ఈ 2013 ఫేస్‌లిఫ్ట్ టొయోటా ఇన్నోవా ఎమ్‌పివిని వచ్చే నెల 19వ తేదీ నుంచి జరగనున్న 2013 ఇండోనేషియా ఇంటర్నేషనల్ మోటార్ షోలో ఆవిష్కరించే ఆస్కారం ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, August 16, 2013, 11:46 [IST]
English summary
According to sources, Toyota is planning to launch facelifted Innova MPV soon. The first spy images of the facelifted Toyota Innova spotted in Indonesia. New Innova is likely to be shown at the 2013 Indonesia International motor show in next month.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+