టీఎస్‌ పేరుతో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు; పాత వాహనాలను మార్చుకోవాల్సిందే

హైదరాబాద్‌: నేటి నుండి (12.06.2014 నుంచి) తెలంగాణా రాష్ట్రంలో కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలన్నింటికి టీఎస్‌ (TS) పేరుతో నంబర్‌ప్లేట్లు మంజూరు చేయనున్నట్లు రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో వాహనాల కోసం టీఎస్‌ కోడ్‌ కేటాయిస్తూ గెజిట్‌ విడుదలైందని ఆయన తెలిపారు. ఇప్పటికే రోడ్లపై ఉన్న పాత వాహనాల నంబర్‌ ప్లేట్లను (ఏపీ పేరుతో ఉన్నవి) సైతం మరో నాలుగు నెలల్లో టీఎస్‌గా మార్చుకోవాలని సూచించారు. మొదట్లో ఈ తెలంగాణా స్టేట్ కోడ్‌ను టీజీ (TG)గా కేటాయించాలనుకున్నప్పటికీ, చివరకు దానిని టీఎస్‌గా ఖరారు చేశారు.

పాత వాహనాలకు నెంబర్‌ ప్లేట్లను టీఎస్‌గా మార్చుకోవడానికి పరిమిత ఫీజు చెల్లింపుపై త్వరలోనే ఓ స్పస్టత ఇస్తామని, కొత్తగా కొనుగోలు చేసే వాహనాలకు మాత్రం టీఎస్‌ కోడ్‌తోనే రిజిస్ట్రేషన్‌ అవుతుందని ఆయన వివరించారు. ఏపీ (AP) పేరుతో ఉన్న వాహనాల నెంబర్ ప్లేట్లను నాలుగు నెలల్లోగా టీఎస్‌గా మార్చుకోవాలని ఆయన సూచించారు. అవసరమైతే సమయాన్ని పెంచేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని మహేందర్‌రెడ్డి తెలిపారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో 73 లక్షల వాహనాలు ఉన్నాయని అంచనా.


ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలో తిరుగుతున్న పాత వాహనాల విషయంలో ఇన్నాళ్లుగా ఉన్న ఏపీ కోడ్ స్థానంలో టీఎస్‌ను చేర్చి ప్రస్తుత నెంబర్‌ను యథాతథంగా కొనసాగించడం సాధ్యం కాదని, తాజా నిర్ణయంతో ఆయా వాహనాల జిల్లా కోడ్‌లతోపాటు నెంబర్ కూడా మార్చాల్సిన అసరం ఉందని ఆయన వివరించారు. నెంబర్ల మార్పులో ఫ్యాన్సీ నెంబర్లు, సెంటిమెంట్ నెంబర్లకు సైతం ఎటువంటి మినహాయింపూ ఉండదని ఆయన స్పష్టం చేశారు. కానీ, గతంలో ఫ్యాన్సీ నెంబర్ల కోసం అధిక మొత్తాలను వెచ్చించిన వారి విషయంలో మరో రెండు, మూడు రోజుల్లో సమీక్ష జరిపి ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ప్రకటిస్తుందని మహేందర్‌రెడ్డి అన్నారు.

తెలంగాణా జిల్లాల రిజిస్ట్రేషన్ కోడ్స్..!?
తెలంగాణా రాష్ట్రంలోని వివిధ జిల్లాలను సూచించే రిజిస్ట్రేషన్ కోడ్‌లకు సంబంధించిన విధివిధానాలను రెండు మూడు రోజుల్లో ఖరారు చేయనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, జిల్లాల కోడ్‌లను రవాణా శాఖ అధికారులు ఇప్పటికే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆ వివరాల ప్రకారం..

TS Logo

టీఎస్ 01ను ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్‌కు, టీఎస్ 02ను హైదరాబాద్ సెంట్రల్ (ఖైరతాబాద్), టీఎస్ 03 హైదరాబాద్ నార్త్ (సికింద్రాబాద్), టీఎస్ 04 హైదరాబాద్ ఈస్ట్ (మలక్‌పేట), టీఎస్ 05 హైదరాబాద్ సౌత్ (కిషన్‌బాగ్ సౌత్), టీఎస్ 06 హైదరాబాద్ వెస్ట్ (మొహిదీపట్నం), టీఎస్ 07 కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, టీఎస్ 08 ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లెందు, మణుగూరు, టీఎస్ 09 మహబూబ్‌నగర్, పెబ్బేరు, గద్వాల, టీఎస్ 10 మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, పటాన్‌చెరు, టీఎస్ 11 నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, భువనగిరి, బీబీనగర్, టీఎస్ 12 నిజామాబాద్, టీఎస్ 13 అత్తాపూర్, కూకట్‌పల్లి, మేడ్చల్, టీఎస్ 14 ఉప్పల్‌కలాన్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి, టీఎస్ 15 వరంగల్, జనగాం, మహబూబాబాద్, రంగారెడ్డిలోని కొన్ని ప్రాంతాలకు కేటాయించారని సమాచారం. (దీనిపై తెలంగాణా ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది).

ఎక్కడిక్కడ నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు..
ఇదిలా ఉండగా.. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాతి నుంచి ఆ రాష్ట్రానికి సంబంధించిన వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ విషయంలో ఎలాంటి స్పష్టత లేకపోవటం ఇప్పటి వరకూ అనేక కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. గ్రేటర్ పరిధిలోని రవాణాశాఖ కార్యాలయాలలో వేల సంఖ్యలో వాహనాల రిజిస్ట్రేషన్ ఆగిపొయింది. అయితే, తాజాగా తెలంగాణా రాష్ట్రానికి టీఎస్ కోడ్‌ను కేటాయించడంతో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ తిరిగి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, ఆర్టీవో కార్యలయాలకు భారీ సంఖ్యలో వాహనాదారులు వస్తారనే అంచనాతో ఆయా ఆర్టీవో కార్యాలయాల వద్ద తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

More from DriveSpark

Article Published On: Thursday, June 12, 2014, 9:59 [IST]
English summary
After the formation of a new state, officials and denizens in new Telangana state will have to cope with several changes. To begin with, the licence plate of every vehicle registered in Telangana region will have to reflect the change (comprising two letters from the name of the state) under the Motor Vehicles Act.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+