వీడియో: డిసి అవంతి మేడ్ ఇన్ ఇండియా స్పోర్ట్స్ కార్

By Ravi

వెహికల్ కస్టమైజేషన్ దిగ్గజం, ప్రముఖ ఆటోమొబైల్ డిజైనర్ దిలీప్ ఛాబ్రియాకు చెందిన 'డిసి డిజైన్స్' సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన ప్రొడక్షన్ వెర్షన్ మేడ్ ఇన్ ఇండియా స్పోర్ట్స్ కారు 'డిసి అవంతి' (DC Avanti)ని వాణిజ్య పరంగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుతు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

డిసి డిజైన్స్ తొలిసారిగా తమ అవంతి కారును 2012లో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. డిసి డిజైన్స్ తమ అవంతి స్పోర్ట్స్ కారును గుజరాత్‌లోని సనంద్ పారిశ్రామిక ప్రాంతంలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనున్నారు. మరికొద్ది నెలల్లోనే ఇది వినియోగదారుల వద్దకు రానుంది.

DC Avanti Sports Car

ఈ నేపథ్యంలో, డిసి అవంతి స్పోర్ట్స్ కారుకు సంబంధించి ఓ ప్రమోషనల్ వీడియోని డిసి డిజైన్స్ తమ అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేసింది. ఈ కథనంలో మీరు కూడా ఆ వీడియోని వీక్షించవచ్చు. డిసి డిజైన్స్ సనంద్ ప్లాంటులో తొలుత అవంతి కారును ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం సాలీనా 3500 యూనిట్లు.

డిసి అవంతి కారులో ఫోర్డ్ నుంచి గ్రహించిన ఈకోబూస్ట్ 2.0 లీటర్, ఫోర్-సిలిండర్, డిఓహెచ్‌సి, 6-వాల్వ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 240 బిహెచ్‌పిల శక్తిని, 366 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. డిసి అవంతి సూపర్ కారు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇంకా ఇందులో ఏబిఎస్, ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/wWajWeNX3KQ?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Friday, May 9, 2014, 16:19 [IST]
English summary
DC Design has showcased production version of Avanti sportscar at the Auto Expo 2014. Now DC Design have uploaded a video featuring Avanti on their official Youtube channel. Take a look.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+