హోండా మొబిలియోతో కామెడీ చేసిన 'కపిల్ శర్మ'

By Ravi

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ మరికొద్ది రోజుల్లోనే తమ 'మొబిలియో' (Mobilio) ఎమ్‌పివిని దేశీయ విపణిలో విడుదల చేయనున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, హోండా ఇప్పటికే ఈ మోడల్‌కు సంబంధించిన ఓ కమర్షియల్‌ను కూడా రూపొందించింది. హోండా మొబిలియో కమర్షియల్ కోసం కంపెనీ, ప్రముఖ టెలివిజన్ కమెడియన్ కపిల్ శర్మను ఎంచుకుంది.

కామెడీ సర్కస్ ప్రోగ్రామ్ ద్వారా బుల్లితెరకు పరిచయమై, ప్రస్తుతం కామెడీ నైట్స్ విత్ కపిల్ పేరుతో ఓ ప్రత్యేకమైన వినోదాత్మక కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న కపిల్ శర్మ తొలిసారిగా హోండా మొబిలియో కమర్షియల్ చేయటం విశేషం. ఈ కమర్షియలో కూడా కపిల్ తనదైన శైలిలో హాస్యాన్ని పండిస్తూ, హోండా మొబిలియో ఎమ్‌పివిలోని ఫీచర్లను కూడా వివరించాడు.

ఆ హాస్యభరిత వీడియోని మనం కూడా చూసేద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/3jpLOO8SRM0?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>
హోండా మొబిలియో విషయానికి వస్తే, ఇదొక 7-సీటర్ (2+3+2) ఎమ్‌‌పివి. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. పెట్రోల్ వెర్షన్‌లో 1.5 లీటర్, 4-సిలిండర్ ఐ-విటెక్ ఇంజన్‌ను అమర్చనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6600 ఆర్‌పిఎమ్ వద్ద 117 బిహెచ్‌పిల శక్తిని, 4600 ఆర్‌పిఎమ్ వద్ద 145 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇందులో ఆటోమేటిక్ వెర్షన్ అందుబాటులో లేదు.

ఇకపోతే.. డీజిల్ వెర్షన్‌లో 1.5 లీటర్, 4-సిలిండర్ ఐ-డిటెక్ ఇంజన్‌ను అమర్చనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 3600 ఆర్‌పిఎమ్ వద్ద 98 బిహెచ్‌పిల శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 145 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తోనే లభిస్తుంది. ఇందులో కూడా ఆటోమేటిక్ వెర్షన్ అందుబాటులో లేదు. దేశీయ విపణిలో దీని ప్రారంభ ధర రూ.5.90 లక్షలు ఉండొచ్చని అంచనా. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, June 25, 2014, 14:22 [IST]
English summary
Honda has officially confirmed that it will launch the Mobilio MPV in India during the month of July. Honda has put up this MPV for display at different shopping malls across India. Now Honda has released a TV commercial which features India's famous stand-up comedian Kapil Sharma who turned as salesmen to sell Mobilio.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+