ఫైర్‌ఫైటింగ్ కారును తయారు చేసిన ఫోక్స్‌వ్యాగన్ అకాడెమీ విద్యార్థులు

By Ravi

ఫోక్స్‌వ్యాగన్ అకాడెమీ వద్ద మూడేళ్ల డ్యూయెల్ అప్రంటీస్ కోర్స్ చేస్తున్న విద్యార్థుల బృందం ఓ ఫైర్‌పైటింగ్ కార్ (అగ్నిమాపక కారు)ను తయారు చేసింది. ఫోక్స్‌వ్యాగన్ పూనే ప్లాంట్‌లోని సేఫ్టీ విభాగం కోసం ఈ కారును తయారు చేశారు. ఈ అకాడెమీలోని తొలి బ్యాచ్ యొక్క చివరి సంత్సరపు అసైన్‌మెంట్‌లో భాగంగా, తక్కువ బడ్జెట్‌లో కారును నిర్మించాలన్న ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు.

ఫోక్స్‌వ్యాగన్ అకాడెమీలోని 14 మంది విద్యార్థులకు ఈ టాస్క్ ఇచ్చారు. ఫోక్స్‌వ్యాగన్ పూనే ప్లాంట్‌లో ప్రతిరోజు ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌కు ఉపయోగపడేలా ఓ ఫైర్‌‌ఫైటింగ్ వాహనాన్ని తయారు చేయాల్సిందిగా ఆ విద్యార్థులకు సూచించారు.

Volkswagen Academy Apprentices Build Firefighting Car For Pune Plant

ఇందులో భాగంగా, ఆ విద్యార్థుల బృందం తక్కువ ఖర్చులో ఓ ఫైర్‌‌ఫైటింగ్ కారును తయారు చేసేందుకు గాను ఫోక్స్‌వ్యాగన్ వెంటో మరియు క్రాస్ పోలో కార్లలో ఉపయోగించే విడిభాగాలు మరియు స్క్రాప్డ్ పార్ట్స్‌ను ఉపయోగించి ఈ వాహనాన్ని తయారు చేశారు.

దీని బేసిక్ డిజైన్ ఫోక్స్‌వ్యాగన్ వెంటో మాదిరిగా కనిపించినప్పటికీ, బి-పిల్లర్ నుంచి టెయిల్‌గేట్ వరకు అనేక మార్పులు చేసి, ఫ్రంట్ క్యాబినే ఉండేలా వెనుక వైపు పరికరాలను తీసుకువెళ్లేలా దీనిని ఓ పికప్ ట్రక్ మాదిరిగా డిజైన్ చేశారు.

ఫోక్స్‌వ్యాగన్ ఫైర్‌‌ఫైటింగ్ కారు కోసం దాదాపు 160కి పైగా విడిభాగాలను ప్రత్యేకంగా డిజైన్ చేశామని అకాడెమీ తెలిపింది. ఈ కారులో 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ప్లాంట్‌లో డైలీ ఇన్‌స్పెక్షన్ కోసం, ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ మెటీరియర్ మూవ్‌మెంట్ కోసం ఈ ఫైర్‌‌ఫైటింగ్ కారును ఉపయోగించనున్నట్లు అకాడెమీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Saturday, May 10, 2014, 10:33 [IST]
English summary
The apprentices undergoing a three-year Dual Apprenticeship course at the Volkswagen Academy India built a firefighting car for the Safety Department of Volkswagen Pune Plant as their final year project. This unique task offered the students an opportunity to have hands-on experience with various activities involved in building a car. The Pilot Hall team at Volkswagen Pune Plant, which is responsible for experimental projects, mentored the apprentices throughout the process of building the car.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+