బడ్జెట్ కార్ బ్రాండ్‌ను ప్రవేశపెట్టేందుకు ఫోక్స్‌వ్యాగన్ సన్నాహాలు!

By Ravi

ఇప్పుడు భారత ఆటోమొబైల్ మార్కెట్లో బడ్జెట్ కార్ల పర్వం నడుస్తోంది. ఇప్పటికే ఈ సెగ్మెంట్లో మారుతి సుజుకి అగ్రగామిగా ఉంటే, ఆ బ్రాండ్‌కు మరింత గట్టి పోటీనిచ్చేందుకు పలు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇటీవలే జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ తమ డాట్సన్ బ్రాండ్‌ను ప్రవేశపెడితే, తాజాగా మరో జర్మన్ కార్ కంపెనీ ఓ బడ్జెట్ కార్ బ్రాండ్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఇది కూడా చదవండి: ఫోక్స్‌వ్యాగన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'టైగన్'

జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాన్, భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల కోసం ఓ బడ్జెట్ కారును ప్రవేశపెట్టాలన్న తమ ఇదివరకటి ప్రణాళికను మరోసారి తెరపైకి తీసుకువచ్చింది. వాస్తవానికి ఫోక్స్‌వ్యాగన్ ఇదివరకే ఓ చవక బ్రాండ్‌ను ఇండియాకు పరిచయం చేద్దామని యోచించింది. అయితే, బడ్జెట్ బ్రాండ్ల క్రింద నాణ్యమైన కార్లను కస్టమర్లకు అందించలేమనే ఉద్దేశ్యంతో ఈ ప్రయత్నాన్ని విరమించుకుంది.


కానీ మాస్ మార్కెట్లలో వేగంగా విస్తరించాలన్నా మరియు భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో అత్యధిక వాటా దక్కించుకోవాలన్నా బడ్జెట్ కార్ బ్రాండ్లను ప్రవేశపెడితే ఇది సాధ్యమవుతుందనే సత్యాన్ని ఫోక్స్‌వ్యాగన్ గ్రహించినట్లుంది.

ఇది కూడా చదవండి: ఫోక్స్‌వ్యాగన్ వెంటో డీజిల్ ఆటోమేటిక్ వస్తోంది!

ఫోక్స్‌వ్యాగన్ ఇప్పటికే ఓ ప్రతిపాదనను బోర్డు అనుమతి కోసం సమర్పించినట్లు తెలుస్తోంది. ఒక్కసారి అనుమతి లభిస్తే, 2016 చివర్లో కానీ లేదా 2017 ఆరంభంలో కానీ కంపెనీ ఓ కొత్త బ్రాండ్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ కొత్త బ్రాండ్ నుంచి తొలి బడ్జెట్ కార్లను చైనాలోని ఫోక్స్‌వ్యాగన్ స్థానిక భాగస్వామ్యులైన ఎస్ఏఐసి, ఎఫ్ఏడబ్ల్యూల సహకారంతో ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది.

VW Polo

ఫోక్స్‌వ్యాగన్ బడ్జెట్ కారు బ్రాండ్ క్రింద తయారయ్యే కార్ల ధరలు 6,000 యూరోల నుంచి 7,500 యూరోల మధ్యలో ఉండొచ్చని అంచనా. ఈ బడ్జెట్ కార్ బ్రాండ్ లాటిన్ అమెరికా, ఈస్టర్న్ యూరోపియన్ దేశాల్లోనే కాకుండా ఏషియా (భారత్తో కలిపి) మార్కెట్లలో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, March 21, 2014, 18:01 [IST]
English summary
It is being reported that Volkswagen has revived its plans to launch a new brand that will build budget cars for emerging markets.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+