పేటెంట్ అందుకున్న ఫోక్స్‌వ్యాగన్ బగ్గీ అప్ కాన్సెప్ట్
జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ గడచిన సెప్టెంబర్ 2011లో జరిగిన ఫ్రాంక్‌ఫర్ట్ ఆటో షోలో ఆవిష్కరించిన బగ్గీ అప్ కాన్సెప్ట్ కారు అప్పట్లో అనేక మంది దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసినదే. రూఫ్, డోర్లు లేకుండా కంపెనీ అభివృద్ధి చేసిన ఈ బగ్గీ అప్ కాన్సెప్ట్ గురించి ఫ్రాంక్‌ఫర్ట్ ఆటో షో ముగిసిన తర్వాత ఎలాంటి అప్‌డేట్స్ అందలేదు. దీంతో ఈ కారు ప్రొడక్షన్ దశకు చేరుకోదని కార్ ప్రియులు నిరాశ చెందారు.
అయితే, తాజా సమాచారం ప్రకారం, ఫోక్స్‌వ్యాగన్ తమ బగ్గీ అప్ పేటెంట్ డిజైన్ కోసం 2012లోనే ధరఖాస్తు చేసుకోగా, ఇప్పుడు దానికి ఆమోదం లభించినట్లు సమాచారం. ఫోక్స్‌వ్యాగన్ డిజైన్ హెడ్ క్లాస్ బిషఫ్ ఆధ్వర్యంలో బెర్లిన్‌లోని అధునా ఫోక్స్‌వ్యాగన్ డిజైన్ స్టూడియోలో ఈ కారును డిజైన్ చేశారు. బగ్గీ అప్ కోసం జారీ చేసిన పేటెంట్ డిజైన్ 14 ఏళ్లు చెల్లుబాటులో ఉంటుంది.
ఫోక్స్‌వ్యాగన్ బగ్గీ అప్ కాన్సెప్ట్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి...!

ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న అప్ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను ఆధారంగా చేసుకొని బగ్గీ కాన్సెప్ట్ కారును డిజైన్ చేశారు.

ఈ కారును అప్ కారు ఆధారంగా డిజైన్ చేసినప్పటికీ, ఇది 1960 దశాబ్ధానికి చెందిన ఫోక్స్‌వ్యాగన్ బీటెల్‌ను తలపిస్తుంది.

ఫోక్స్‌వ్యాగన్ బగ్గీ టూ సీటర్. ఈ కారులో ఇద్దరికి మాత్రమే చోటు ఉంటుంది. ఈ కారుకు రూఫ్, డోర్లు ఉండవు.

గడచిన 2011లో జరిగిన ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో తొలిసారిగా ఈ కారును ప్రదర్శనకు ఉంచారు.

3584 మి.మీ. పొడవు ఉండే ఈ బగ్గీ అప్ కారులో 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను ఉపయోగించారు.

బీచ్, పిక్నిక్‌ల కోసం తయారు చేసిన బగ్గీ అప్ కారు పూర్తిగా వాటర్‌ప్రూఫ్ కారు. కారు లోపలికి వచ్చిన నీరు బయటికి వెళ్లేందుకు డ్రైన్ సిస్టమ్ కూడా ఉంది.



Click it and Unblock the Notifications








