త్వరలో విడుదల కానున్న ఫోక్స్‌వ్యాగన్ క్రాస్‌పోలో క్రాసోవర్
రెనో, ఫోర్డ్ కంపెనీలకు సవాల్ విసిరేందుకు ఫోక్స్‌వ్యాగన్ సిద్ధమవుతోంది. ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న పోలో హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ అభివృద్ధి చేసిన క్రాస్‌పోలో (CrossPolo) క్రాసోవర్‌ను త్వరలోనే మార్కెట్లో ప్రవేశపెట్టనున్నారు. పోలోకు రగ్గడ్ వెర్షనే క్రాస్‌పోలో. పరిశ్రమ వర్గాల సమచారం ప్రకారం, ఆగస్ట్ 21న ఫోక్స్‌వ్యాగన్ క్రాస్‌పోలో క్రాసోవర్‌ను ఆవిష్కరించే ఆస్కారం ఉంది.
ఫోక్స్‌వ్యాగన్ ఇప్పటికే తమ క్రాస్‌పోలోను భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది. ఇది అధిక గ్రౌండ్ క్లియరెన్సును కలిగి ఉండి, పెద్ద అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు బాడీలో క్రింది భాగాలను ధృడమైన ప్లాస్టిక్‌తో రూపొందించారు. ముందు, వెనుక వైపు సిల్వర్ స్కిడ్ ప్లేట్స్‌ను జోడించారు. ఈ కారుకు రూఫ్ రెయిల్స్ కూడా ఉంటాయి. ఇవి కేవలం ఆకర్షణకు మాత్రమే కాకుండా, 75 కేజీల బరువును కూడా మోయగలవు.

ఇంజన్ విషయానికి వస్తే, ఫోక్స్‌వ్యాగన్ క్రాస్‌పోలో క్రాసోవర్‌లో పోలో టిడిఐ హైలైన్ (టాప్ ఎండ్ వేరియంట్)లో ఉపయోగించిన 1.2 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఇందులో కూడా ఉపయోగించనున్నారు. ఈ కారులో మరిన్ని అధనపు సేఫ్టీ ఫీచర్లు జోడించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. క్రాస్‌పోలో క్రాసోవర్‌లో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, ఈకోస్పోర్ట్ మాదిరిగా వెనుక వైపు స్పేర్ వీల్ కలిగిన వేరియంట్ కూడా 2014లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.
ధర విషయానికి వస్తే, ఫోక్స్‌వ్యాగన్ క్రాస్ పోలో పోలో టిడిఐ హైలైన్ వేరియంట్ కన్నా రూ.1 లక్ష అధనంగా ఉండనుంది. ధర పరంగా దీనిని ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టాప్ ఎండ్ వేరయంట్‌కు దిగువన ఉంటుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.



Click it and Unblock the Notifications








