ఫోక్స్‌వ్యాగన్ పోలో జిటి మోడళ్ల సేల్స్ బంద్, త్వరలో కొత్త మోడల్!
జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ భారత మార్కెట్లో ఇటీవలే మరింత శక్తివంతమైన పోలో హ్యాచ్‌బ్యాక్ కార్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే. 'పోలో జిటి' (Polo GT) పేరుతో పెట్రోల్ (టిఎస్ఐ) మరియు డీజిల్ (టిడిఐ) వేరియంట్లలో రెగ్యులర్ వెర్షన్ల కన్నా మరింత ఎక్కువ పవర్‌తో ట్యూన్ చేయబడిన మోడళ్లను ఫోక్స్‌వ్యాగన్ గతంలో విడుదల చేసింది.
అయితే, ఈ పవర్‌ఫుల్ మోడళ్లు మార్కెట్లో మంచి సక్సెస్‌ను సాధించలేకపోయాయి. మరోవైపు పోలో హ్యాచ్‌బ్యాక్‌లో కంపెనీ ఓ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను కూడా ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, ఇప్పటికే డీలర్లు/స్టాక్ యార్డులో పోలో జిటి మోడళ్ల స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. అంతేకాకుండా, కొత్తగా జిటి మోడళ్ల కోసం బుకింగ్‌లు తీసుకోవద్దని కూడా డీలర్లకు చెప్పినట్లు సమాచారం.

వచ్చే నెలలో ఫోక్స్‌వ్యాగన్ తమ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ పోలో హ్యాచ్‌బ్యాక్‌ను మార్కెట్లో విడుదల చేయనుంది. ఇదే మోడల్‌లో జిటి వెర్షన్స్ కూడా విడుదలయ్యే ఆస్కారం ఉంది. ఇదివరకటి పోలో రేంజ్ మోడళ్లతో పోల్చుకుంటే, ఈ కొత్త పోలో కారులో కొద్దిపాటి ఎక్స్టీరియర్, ఇంటీరియర్ మార్పులు చేర్పులు ఉన్నాయి. అయితే, యాంత్రిక (ఇంజన్) పరంగా కొత్త పోలో రేంజ్ కార్లలో ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది.
ప్రస్తుతం ఫోక్స్‌వ్యాగన్ విక్రయిస్తున్న పెట్రోల్ వెర్షన్ పోలో జిటి కారులో 1.2 లీటర్ పెట్రోల్ టిఎస్ఐ టర్బోచార్జ్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 104 హార్స్ పవర్‌ల శక్తిని, 170 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్)తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

ఇకపోతే డీజిల్ వెర్షన్ పోలో జిటి కారులో 1.6 లీటర్ డీజిల్ టిడిఐ టర్బోచార్జ్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 103 హార్స్ పవర్‌ల శక్తిని, 250 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ మాత్రం 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్)తో అనుసంధానం చేయబడి ఉంటుంది.
మరికొద్ది రోజుల్లోనే ఫోక్స్‌వ్యాగన్ తమ సరికొత్త 2014 పోలో హ్యాచ్‌బ్యాక్ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేయనుంది. అదే రోజునే కంపెనీ వీటిలో జిటి రేంజ్ మోడళ్లను కొనసాగించేది లేదా వాటిని పూర్తిగా మార్కెట్ నుంచి తొలగించేది స్పష్టం చేయనుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








