కొత్త ఫోక్స్‌వ్యాగన్ క్రాస్ పోలో 1.2 ఎమ్‌పిఐ విడుదల; ధర రూ.6.94 లక్షలు
యూరప్‌కు చెందిన అతిపెద్ద కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్, గడచిన సంవత్సరం ఆగస్ట్ నెలలో తమ సరికొత్త 'క్రాస్ పోలో' (Cross Polo) మోడల్‌ను డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా.. కంపెనీ తాజాగా ఇందులో పెట్రోల్ వెర్షన్‌ను కూడా విడుదల చేసింది. కొత్త పెట్రోల్ వెర్షన్ ఫోక్స్‌వ్యాగన్ క్రాస్ పోలో 1.2 లీటర్ ఎమ్‌పిఐ ఇంజన్‌తో లభ్యం కానుంది.
ధర:
దేశీయ విపణిలో కొత్త ఫోక్స్‌వ్యాగన్ క్రాస్ పోలో 1.2 ఎమ్‌పిఐ (పెట్రోల్) వెర్షన్ ధర రూ.6.94 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ మోడల్ కోసం జనవరి 15, 2015 నుంచి బుకింగ్స్ ప్రారంభిస్తున్నామని కంపెనీ పేర్కొంది.

ఇంజన్:
ఫోక్స్‌వ్యాగన్ క్రాస్ పోలో కారులో 1.2 లీటర్ ఎమ్‌పిఐ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 74 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 110 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది.
మైలేజ్:
కంపెనీ పేర్కొన్న సమాచం ప్రకారం ఇది లీటరుకు 16.47 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ వివరించింది.
సేఫ్టీ ఫీచర్స్:
కొత్త క్రాస్ పోలో కారులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‍బ్యాగ్స్ సేఫ్టీ ఫీచర్లను స్టాండర్డ్‌గా ఆఫర్ చేస్తున్నారు. ఎన్‌సిఏపి క్రాష్ టెస్టులో ఈ మోడల్ 5 స్టార్లకు గాను 4 స్టార్ల రేటింగ్‌ను దక్కించుకుంది.

ఎక్స్టీరియర్ ఫీచర్లు:
బ్లాక్ ఫినిషింగ్‌తో కూడిన డ్యూయెల్ బీమ్ హ్యాలోజెన్ హెడ్‌ల్యాంప్స్, 15-ఇంచ్ అల్లాయ్ వీల్స్, సిల్వర్ అసెంట్స్‌తో కూడిన 'క్రాస్' బంపర్స్, సిల్వర్ పెయింటెడ్ రూఫ్ రెయిల్స్, రియర్ వ్యూ మిర్రర్ హైసింగ్, క్రోమ్ అసెంట్స్‌తో కూడిన 'క్రాస్' ఫ్రంట్ గ్రిల్, బ్లాక్ సైడ్ క్లాడింగ్, బ్లాక్ వీల్ ఆర్చెస్, వెనుక డోర్లపై 'క్రాస్' డెకాల్స్, విండ్‌స్క్రీన్, సైడ్ అండ్ రియర్ విండోస్ కోసం హీట్ ఇన్సులేటింగ్ చేయబడిన గ్లాస్.
ఇంటీరియర్ ఫీచర్లు:
సుపీరియర్ క్లౌడ్ బ్లాక్ టైటన్ అప్‌హోలెస్ట్రీ, లెథర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్, లెథర్ వ్రాప్డ్ గేర్‌షిఫ్ట్ నాబ్, హ్యాండ్‌బ్రేక్ లివర్ హ్యాండిల్, ఇంటీరియర్ క్రోమ్ గార్నిష్, ఫ్రంట్ డోర్లపై స్టోరేజ్ కంపార్ట్‌మెంట్, డోర్లకు పైభాగంలో 3 గ్రాబ్ హ్యాండిల్స్, (కోట్ హుక్‌లతో పాటుగా), గ్లౌవ్ బాక్సు లోపల సన్‌గ్లాస్ హోల్డర్, ఫ్రంట్ సెంటర్ కన్సోల్‌లో 12 వోల్ట్ పవర్ సాకెట్, లగేజ్ కంపార్ట్‌మెంట్ కవర్/పార్సెల్ ట్రే, క్లైమాట్రానికి ఆటోమేటిక్ ఎయిర్-కండిషనింగ్.

కలర్ ఆప్షన్స్:
- ఫ్లాష్ రెడ్
- డీప్ బ్లాక్ పెరల్
- రెఫ్లెక్స్ సిల్వర్


Click it and Unblock the Notifications








