ఫిబ్రవరి 17న విడుదల కానున్న కొత్త 2015 ఫోక్స్‌వ్యాగన్ జెట్టా
జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్, గడచిన సంవత్సరం ఆగస్ట్ నెలలో అంతర్జాతీయ మార్కెట్లలో ఆవిష్కరించిన సరికొత్త 2015 ఫోక్స్‌వ్యాగన్ జెట్టా ప్రీమియం సెడాన్‌ను, కంపెనీ తాజాగా ఇండియన్ మార్కెట్లో కూడా విడుదల చేయనుంది. అధికారిక సమాచారం ప్రకారం, కొత్త ఫోక్స్‌వ్యాగన్ జెట్టా ఫిబ్రవరి 17, 2015వ తేదీన విడుదల కానుంది.
కొత్త 2015 ఫోక్స్‌వ్యాగన్ జెట్టా ఎక్స్టీరియర్, ఇంటీరియర్‌లలో అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి. పూర్తిగా రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ ప్రొఫైల్, కొత్త డిజైన్‌తో కూడిన బంపర్స్, రిఫ్రెష్డ్ ల్యాంప్స్, బెటర్ ఏరోడైనమిక్స్‌తో ఇది లభ్యం కానుంది. దీని రియర్ డిజైన్‌లో కూడా చెప్పుకోదగిన మార్పులు ఉన్నాయి. ఇంటీరియర్లలో కూడా పలు ప్రధాన మార్పులు ఉండనున్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ జెట్టా పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. పెట్రోల్ వెర్షన్ జెట్టాలో 1.4 లీటర్ టిఎస్ఐ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 120 బిహెచ్‌పిల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభ్యం కానుంది. దీని సర్టిఫైడ్ మైలేజ్ 14.69 కెఎంపిఎల్.
డీజిల్ వెర్షన్ జెట్టాలో 2.0 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 138 బిహెచ్‌పిల శక్తిని, 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో లభ్యం కానుంది. దీని సర్టిఫైడ్ మైలేజ్ 19.33 కెఎంపిఎల్ (మ్యాన్యువల్), 16.96 కెఎంపిఎల్ (ఆటోమేటిక్). లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.



Click it and Unblock the Notifications








