కొత్త 2015 ఫోక్స్‌వ్యాగన్ జెట్టా విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు
జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న ప్రీమియం సెడాన్ ఫోక్స్‌వ్యాగన్ జెట్టాలో కంపెనీ ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను నేడు (ఫిబ్రవరి 17, 2015) మార్కెట్లో విడుదల చేసింది. కొత్త 2015 ఫోక్స్‌వ్యాగన్ జెట్టా ఎక్స్టీరియర్, ఇంటీరియర్‌లలో అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి.
పూర్తిగా రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ ప్రొఫైల్, కొత్త డిజైన్‌తో కూడిన బంపర్స్, రిఫ్రెష్డ్ ల్యాంప్స్, బెటర్ ఏరోడైనమిక్స్‌తో ఇది లభ్యం కానుంది. దీని రియర్ డిజైన్‌లో కూడా చెప్పుకోదగిన మార్పులు ఉన్నాయి. ఇంటీరియర్లలో కూడా పలు ప్రధాన మార్పులు ఉండనున్నాయి.

పెట్రోల్ వెర్షన్ జెట్టా ధరలు:
- ట్రెండ్‌లైన్ - రూ.13.87 లక్షలు
- కంఫర్ట్‌లైన్ - రూ.15.36 లక్షలు
డీజిల్ వెర్షన్ జెట్టా ధరలు:
- ట్రెండ్‌లైన్ - రూ.15.01 లక్షలు
- కంఫర్ట్‌లైన్ - రూ.16.89 లక్షలు
- హైలైన్ మ్యాన్యువల్ - రూ.18.76 లక్షలు
- హైలైన్ ఆటోమేటిక్ - రూ.19.77 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ముంబై)
పెట్రోల్ ఇంజన్:
ఫోక్స్‌వ్యాగన్ జెట్టా పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. పెట్రోల్ వెర్షన్ జెట్టాలో 1.4 లీటర్ టిఎస్ఐ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 121 బిహెచ్‌పిల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభ్యం కానుంది. దీని సర్టిఫైడ్ మైలేజ్ 14.69 కెఎంపిఎల్.
డీజిల్ ఇంజన్:
డీజిల్ వెర్షన్ జెట్టాలో 2.0 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 139 బిహెచ్‌పిల శక్తిని, 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో లభ్యం కానుంది. దీని సర్టిఫైడ్ మైలేజ్ 19.33 కెఎంపిఎల్ (మ్యాన్యువల్), 16.96 కెఎంపిఎల్ (ఆటోమేటిక్).

కీలక ఫీచర్లు:
- క్రూయిజ్ కంట్రోల్
- బై-జెనాన్ హెడ్‌ల్యాంప్స్
- ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్
- ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్
- ఫటిగ్ డిటెక్షన్
- 6 ఎయిర్‌బ్యాగ్స్
- ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)
- ఈఎస్‌పి (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్)


Click it and Unblock the Notifications








