యూకే మార్కెట్లో సరికొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో విడుదల
జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ యూకే కస్టమర్ల కోసం ఓ సరికొత్త 2014 వెర్షన్ పోలో హ్యాచ్‌బ్యాక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మునుపటి తరం పోలోతో ఈ పోల్చుకుంటే ఈ కొత్త కొత్త పోలో మరింత సురక్షితమైనది మరియు సౌకర్యవంతమైనదని కంపెనీ పేర్కొంది.
యూకే మార్కెట్లో 2014 ఫోక్స్‌వ్యాగన్ పోలో ప్రారంభ వేరియంట్ ధర 11,100 పౌండ్లు, టాప్-ఎండ్ వేరియంట్ ధర 19,715 పౌండ్లు. ఈ కొత్త కారులో మరింత సమర్థవంతమైన ఇంజన్లను అమర్చారు.

పెట్రోల్ వెర్షన్ పోలో కారులో 1.0 లీటర్ ఎమ్‌పిఐ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 60 హెచ్‌పి లేదా 75 హెచ్‌పి వర్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇందులో మరింత పవర్‌ఫుల్ వెర్షన్ కోరుకునే వారి కోసం 1.2 లీటర్ ఇంజన్‌ను కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈ ఇంజన్ 90 హెచ్‌పి లేదా 112 హెచ్‌పి ట్యూనింగ్‌తో లభిస్తుంది.
డీజిల్ వెర్షన్ పోలో కారులో 1.4 లీటర్ త్రీ-సిలిండర్ టిడిఐ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 75 హెచ్‌పి లేదా 90 హెచ్‌పి పవర్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇకపోతే పెర్ఫార్మెన్స్ వెర్షన్ కోరుకునే వారి కోసం 150 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే 1.4 లీటర్ పెట్రోల్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఈ కొత్త ఇంజన్లన్నీ యూరో6 నిబంధనలకు లోబడి తయారు చేయబడినవి.

కొత్త 2014 ఫోక్స్‌వ్యాగన్ పోలో హ్యాచ్‌బ్యాక్‌లో కొన్ని కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ఇది 6 వేరియంట్లలో లభ్యం కానుంది. ఇందులో హిల్ హోల్డ్, ఆటోమేటిక్ పోస్ట్-కొల్లైజన్ బ్రేకింగ్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీ, సరికొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లను అందిస్తున్నారు.
ఆప్షనల్ ప్యాకేజ్‌గా డ్రైవర్ అలెర్ట్ సిస్టమ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, సిటీ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. మరి ఈ కొత్త 2014 ఫోక్స్‌వ్యాగన్ పోలో ఇండియాకు వస్తుందో లేదో అనేది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








