వెంటో కనెక్ట్ లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసిన ఫోక్స్‌వ్యాగన్
జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న వెంటో సెడాన్‌లో ఓ లిమిటెడ్ ఎడిషన్ విడుదలైంది. 'వెంటో కనెక్ట్' (Vento Konekt) పేరిట ఫోక్స్‌వ్యాగన్ ఈ లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. రెగ్యులర్ వెర్షన్ వెంటో పోల్చుకుంటే ఈ లిమిటెడ్ ఎడిషన్‌లో పలు విశిష్టమైన ఫీచర్లు లభ్యం కానున్నాయి.
ఫోక్స్‌వ్యాగన్ వెంటో కనెక్ట్ లిమిటెడ్ ఎడిషన్‌లో హై-ఎండ్ బ్లావ్‌పంక్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, జిపిఎస్ నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, 3జి ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి ఫీచర్లున్నాయి. కనెక్ట్ ప్యాకేజ్ కేవలం వెంటో కంఫర్ట్‌లై మరియు హైలైన్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందులో హై-రెజల్యూషన్ 7ఇంచ్ టిఎఫ్‌టి టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంటుంది.
ఈ కనెక్ట్ ప్యాకేజ్‌లో భాగంగా వెనుక సీట్లలోని ప్రయాణీకుల వినోదం కోసం 8 ఇంచ్ బ్లావ్‌పంక్ట్ టాబ్లెట్ ఉంటుంది. ఇది 3జి కనెక్టివిటీతో పాటుగా, రెండు సిమ్ కార్డ్ స్లాట్‌లు, వైఫై కనెక్టివిటీని కూడా కలిగి ఉంటుంది. హెచ్‌డి కలర్ డిస్‌ప్లేతో కూడిన ఈ టాబ్లెట్‌లో 16 లైవ్ టెలివిజన్ ఛానెళ్లను వీక్షించవచ్చు. ఇంటర్నెట్ రేడియో, వెథర్ అప్‌డేట్స్, లైవ్ స్టాక్ మార్కెట్ ఫీడ్‌ను కూడా పొందవచ్చు.
ఇంకా ఈ హై-ఎండ్ టాబ్లెట్‌లో ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా యాప్స్‌ను యాక్సెస్ చేసుకోవటంతో పాటుగా 3జి సాయంతో వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా నావిగేషన్ కోసం గూగుల్ మ్యాప్స్ ఉపయోగించుకోవచ్చు, సమీపంలోని ఫోక్స్‌వ్యాగన్ డీలర్/సర్వీస్ సెంటర్ల వివరాలను తెలుసుకోవచ్చు. లెథరెట్ సీట్స్, కనెక్ట్ బ్యాడ్జ్, స్కఫ్ ప్లేట్స్‌ను కూడా ఈ ప్యాకేజ్‌లో ఆఫర్ చేస్తున్నారు.

ఫోక్స్‌వ్యాగన్ వెంటోపై కనెక్ట్ లిమిటెడ్ ఎడిషన్ బ్యాడ్జింగ్.

ఫోక్స్‌వ్యాగన్ వెంటో కనెక్ట్ లిమిటెడ్ ఎడిషన్‌లో హై-ఎండ్ బ్లావ్‌పంక్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, జిపిఎస్ నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, 3జి ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి ఫీచర్లున్నాయి. ఇందులో హై-రెజల్యూషన్ 7ఇంచ్ టిఎఫ్‌టి టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంటుంది.

ఈ కనెక్ట్ ప్యాకేజ్‌లో భాగంగా వెనుక సీట్లలోని ప్రయాణీకుల వినోదం కోసం 8 ఇంచ్ బ్లావ్‌పంక్ట్ టాబ్లెట్ ఉంటుంది. ఇది 3జి కనెక్టివిటీతో పాటుగా, రెండు సిమ్ కార్డ్ స్లాట్‌లు, వైఫై కనెక్టివిటీని కూడా కలిగి ఉంటుంది. హెచ్‌డి కలర్ డిస్‌ప్లేతో కూడిన ఈ టాబ్లెట్‌లో 16 లైవ్ టెలివిజన్ ఛానెళ్లను వీక్షించవచ్చు. ఇంటర్నెట్ రేడియో, వెథర్ అప్‌డేట్స్, లైవ్ స్టాక్ మార్కెట్ ఫీడ్‌ను కూడా పొందవచ్చు.

లెథరెట్ సీట్స్, స్కఫ్ ప్లేట్స్‌ను కూడా ఈ ప్యాకేజ్‌లో ఆఫర్ చేస్తున్నారు.

Click it and Unblock the Notifications