హైదరాబాద్‌లో ఫోక్స్‌వ్యాగన్ పోలో జిటి టిఎస్ఐ విడుదల
ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ఇటీవల దేశీయ విపణిలో విడుదల చేసిన పవర్‌ఫుల్ 'పోలో జిటి టిఎస్ఐ' ఇప్పుడు తాజాగా మార్కెట్లో కూడా విడుదలయ్యింది. రాష్ట్ర మార్కెట్లో ఈ పెర్ఫామెన్స్ వేరియంట్ పోలో జిటి ధర రూ.8.13 లక్షలు (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)గా ఉంది. ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఎమ్‌డి అరవింద్ సక్సేనా ఈ కారును హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేశారు.
ఫోక్స్‌వ్యాగన్ పోలో జిటి టిఎస్ఐలో అమర్చిన పవర్‌ఫుల్ 1.2 లీటర్, ఫోర్ సిలిండర్, డైరెక్ట్ ఇంజక్షన్ మరియు టర్బో ఛార్జింగ్ ఆప్షన్‌తో కూడిన పెట్రోల్ ఇంజన్ గరిష్టం 105 పిఎస్‌ల శక్తిని, 175 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్‌ను అధునాతన 7-స్పీడ్ డబుల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేశారు. ఈ డిఎస్‌జి గేర్‌బాక్స్‌లో ఆటోమేటిక్, స్టోర్ట్, మ్యాన్యువల్ అనే మూడు మోడ్స్ ఉంటాయి.
ఇది కేవలం 9.7 సెకండ్ల వ్యవధిలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది మరియు గరిష్టంగా గంటకు 190 కిలోమీటర్ల వేగంతో వేగంతో పరుగులు పెడుతుంది. కేవలం 1500 ఆర్‌పిఎమ్ నుంచి ఇది గరిష్ట టార్క్‌ను అందుకుంటుందని ఫోక్స్‌వ్యాగన్ ఇండియా పేర్కొంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, ఫోక్స్‌వ్యాగన్ పోలో జిటి టిఎస్ఐ లీటరుకు 17.2 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ వివరించింది.

ఫోక్స్‌వ్యాగన్ పోలో జిటి టిఎస్ఐ

ఫోక్స్‌వ్యాగన్ పోలో జిటి టిఎస్ఐ

ఫోక్స్‌వ్యాగన్ పోలో జిటి టిఎస్ఐ

ఫోక్స్‌వ్యాగన్ పోలో జిటి టిఎస్ఐ

ఫోక్స్‌వ్యాగన్ పోలో జిటి టిఎస్ఐ

ఫోక్స్‌వ్యాగన్ పోలో జిటి టిఎస్ఐ

ఫోక్స్‌వ్యాగన్ పోలో జిటి టిఎస్ఐ

ఫోక్స్‌వ్యాగన్ పోలో జిటి టిఎస్ఐ

ఫోక్స్‌వ్యాగన్ పోలో జిటి టిఎస్ఐ

ఫోక్స్‌వ్యాగన్ పోలో జిటి టిఎస్ఐ

ఫోక్స్‌వ్యాగన్ పోలో జిటి టిఎస్ఐ

ఫోక్స్‌వ్యాగన్ పోలో జిటి టిఎస్ఐ

ఫోక్స్‌వ్యాగన్ పోలో జిటి టిఎస్ఐ

ఫోక్స్‌వ్యాగన్ పోలో జిటి టిఎస్ఐ
ఇది కేవలం హైలైన్ వేరియంట్లో మాత్రమే లభ్యమవుతుంది. బ్లాక్ ఫినిష్‌తో కూడిన హాలోజన్ హెడ్‌ల్యాంప్స్, ట్రిపుల్ ఫ్లాష్‌తో కూడిన లైన్ ఛేంజ్ ఇండికేటర్, యూఎస్‌బి, ఆక్స్-ఇన్, ఎస్‌డి కార్డ్ కనెక్టివిటీతో కూడిన స్టీరియో, అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ అండ్ రియర్ ఫాగ్ ల్యాంప్స్, రియర్ డిఫాగ్గర్, రియర్ వాష్ వైపర్, ఎలక్ట్రిక్ ఓవిఆర్ఎమ్‌లు, ముందువైపు 12 వోల్ట్ పవర్ అవుట్‌లెట్, టిల్ట్ అండ్ అడ్జస్టబల్ స్టీరింగ్, రిమోట్ సెంట్రల్ లాకింగ్, లెథర్‌తో కప్పబడిన స్టీరింగ్ వీల్, గేర్ నాబ్ మరియు హ్యాండ్ బ్రేక్ వంటి ఫీచర్లున్నాయి.
ఇంకా ఇందులో ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్, ఈఎస్‌పి (ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్) మరియు అన్ని 4 అద్దాలకు పించ్ గార్డ్ సేఫ్టీ వంటి భద్రతా ఫీచర్లున్నాయి. ఫోక్స్‌వ్యాగన్ పోలో జిటి టిఎస్ఐ క్యాండీ వైట్, ఫ్లాష్ రెడ్, డీప్ బ్లాక్ అనే మూడు ఆకర్షనీయమైన రంగుల్లో లభిస్తుంది. ఈ కారులో ఉపయోగించిన ఇంజన్ టెక్నాలజీ, ఈ సెగ్మెంట్లో లభిస్తున్న ఇతర హ్యాచ్‌బ్యాక్‌లతో పోల్చుకుంటే ఎన్నో తరాలు ముందుంటుంది. మరి కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో జిటి టిఎస్ఐపై ఓ కన్నేద్దాం రండి..!


Click it and Unblock the Notifications








