భారత్‌కు ఫోక్స్‌వ్యాగన్ టైగన్, ఫిబ్రవరి 2014లో ఆవిష్కరణ
ఈ ఏడాది భారత మార్కెట్లో మరో సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ సందడి చేయనుంది. జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ తమ పాపులర్ టైగన్ కాంపాక్ట్ ఎస్‌యూవీని భారత్‌కు పరిచయం చేయనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 2014 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ తొలిసారిగా ఇండియన్ వెర్షన్ ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మోడల్‌ను ఆవిష్కరించనుంది.
గడచిన 2012లో జరిగిన సావ్ పాలో మోటార్ షోలో ఫోక్స్‌వ్యాగన్ తమ టైగన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కాన్సెప్ట్‌ను మొట్టమొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ తర్వాత ఇది ఉత్పత్తి దశకు చేరుకుని, ప్రస్తుతం యూరప్ మార్కెట్లలో బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలించింది. భారత్‌లో ఇది ఫోక్స్‌వ్యాగన్ ఇండియాకు తొలి మరియు ఏకైక ఎస్‌యూవీగా నిలువనుంది.

ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న పాపులర్ స్మాల్ కార్ 'అప్' ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమైన ఈ సబ్-ఫోర్ మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ టైగన్ ఈ సెగ్మెంట్లోని ఫోర్డ్ ఈకోస్పోర్ట్, రెనో డస్టర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. ఇది 3.86 మీటర్ల పొడవును, 1.43 మీటర్ల వెడల్పును, 2.47 మీటర్ల వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. దీని బూట్ స్పేస్ 280 లీటర్లు, వెనుక సీట్లను మడుచుకుంటే, బూట్‌స్పేస్‌ను 987 లీటర్లకు పెంచుకోవచ్చు.

బ్రెజిల్ మార్కెట్లో విడుదలైన ఫోక్స్‌వ్యాగన్ టైగన్‌లో 1.0 లీటర్, 3 సిలిండర్ టర్బోచార్జ్డ్, డైరెక్ట్ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇది గరిష్టంగా 110 పిఎస్‌ల శక్తిని, 175 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ కేవలం 8.2 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుటుంది. దీని గరిష్ట వేగం గంటకు 175 కిలోమీటర్లు. ఇది మొత్తం 985 కేజీల బరువును కలిగి ఉండి, లీటరుకు 21 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది.

అయితే, ఇండియన్ మార్కెట్ విషయానికి వస్తే, ఇంజన్ పరంగా ఈ ఎస్‌యూవీలో మార్పు ఉండే అవకాశం ఉంది. ఇందులో 1.2 లీటర్ టర్బోచార్జ్డ్, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభ్యమయ్యే ఆస్కారం ఉంది. ధర పరంగా దీనిని పోలో మరియు వెంటో మోడళ్లకు మధ్యలో ప్రవేశపెట్టవచ్చని అంచనా. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








