ఫోక్స్‍వ్యాగన్ వెంటో మాగ్నిఫిక్ లిమిటెడ్ ఎడిషన్ విడుదల
జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న వెంటో సెడాన్‌లో ఓ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‍ను విడుదల చేసింది. 'ఫోక్స్‌వ్యాగన్ వెంటో మాగ్నిఫిక్' (Volkswagen Vento Magnific) పేరిట విడుదల చేసిన ఈ స్పెషల్ ఎడిషన్ పకరిమిత సంఖ్యలో మాత్రమే లభ్యం కానుంది.
ఫోక్స్‌వ్యాగన్ వెంటో మాగ్నిఫిక్ లిమిటెడ్ ఎడిషన్ కంఫర్ట్‌లైన్, హైలైన్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌లో అల్లాయ్ వీల్స్, స్కఫ్ ప్లేట్స్, గార్మిన్ నావిగేషన్ సిస్టమ్, స్పెషల్ ఎడిషన్ బ్యాడ్జ్ ఫీచర్లను జోడించారు.

హైలైన్ వేరియంట్‌లో కంఫర్ట్‌లైన్ వేరియంట్‌లోని ఫీచర్లకు అదనంగా 3జి కనెక్టివిటీ, వెనుక సీటులో కూర్చునే ప్రయాణీకుల కోసం ఆండ్రాయిడ్ టాబ్లెట్స్, బ్లావ్‌పంక్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి.
ఫోక్స్‌వ్యాగన్ వెంటో బేస్ వేరియంట్‌లో సైతం ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్ ఫీచర్‌గా ఆఫర్ చేస్తున్నారు. కాగా.. వెంటో మాగ్నిఫిక్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
- వెంటో మాగ్నిఫిక్ కంఫర్ట్‌లైన్ (పెట్రోల్) : రూ.8.57 లక్షలు
- వెంటో మాగ్నిఫిక్ కంఫర్ట్‌లైన్ (డీజిల్) : రూ.9.84 లక్షలు
- వెంటో మాగ్నిఫిక్ హైలైన్ (పెట్రోల్) : రూ.9.26 లక్షలు
- వెంటో మాగ్నిఫిక్ హైలైన్ (డీజిల్) : రూ.10.42 లక్షలు
- (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)



Click it and Unblock the Notifications








