ఫోక్స్‌వ్యాగన్ వెంటో ప్రిఫర్డ్ ఎడిషన్ విడుదల; ధర రూ.10.74 లక్షలు

By Ravi

ఫోక్స్‌వ్యాగన్ డీలర్ల వద్ద 2013 మోడల్ వెంటో సెడాన్‌ల స్టాక్ కుప్పలు తెప్పలుగా ఉంది. ఈ స్టాక్‌ను క్లియర్ చేసుకునే దిశలో భాగంగా, వెంటో సెడాన్‌ను మరింత ఆకర్షనీయంగా మార్చేందుకు కంపెనీ ఈ మోడల్‌ను ఓ స్పెషల్ ఎడిషన్‌గా తీర్చిదిద్దింది. అయితే ఈ ఫోక్స్‌వ్యాగన్ వెంటో ప్రిఫర్డ్ ఎడిషన్ కేవలం కంఫర్ట్‌లైన్ డీజిల్ వేరియంట్‌లో మాత్రమే లభిస్తోంది.

ఫోక్స్‌వ్యాగన్ వెంటో ప్రిఫర్డ్ ఎడిషన్‌లో కొద్దిపాటి కాస్మోటిక్ మార్పులు మరియు అదనపు ఎక్విప్‌మెంట్‌లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. బాహ్య మార్పుల విషయానికి వస్తే, విండోస్‌పై క్రోమ్ ట్రిమ్స్, సైడ్ డోర్ ప్రొటెక్టర్, సన్ విజర్, బూట్ స్పాయిలర్, అల్లాయ్ వీల్స్, బూట్ డోర్‌పై ప్రిఫర్డ్ ఎడిషన్ బ్యాడ్జ్‌లు ఉన్నాయి.

Volkswagen Vento Preferred Edition

ఎక్విప్‌మెంట్‌ల విషయానికి వస్తే.. శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్, రియర్ వ్యూ కెమెరా, ఫాక్స్ లెథర్ సీట్ కవర్స్ ఫీచర్లున్నాయి. ఇంకా ఈ కారును కొనుగోలు చేసిన వారికి 1 ఏడాది ఉచిత ఇన్సూరెన్స్, నాలుగేళ్ల పాటు రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌లను కంపెనీ అందిస్తోంది. ఫోక్స్‌వ్యాగన్ వెంటో ప్రిఫర్డ్ ఎడిషన్ స్టాక్ లభ్యతను బట్టి అందుబాటులో ఉంటుంది.

ఈ 2013 ఫోక్స్‌వ్యాగన్ వెంటో ప్రిఫర్డ్ ఎడిషన్ కంఫర్ట్‌లైన్ డీజిల్ వెర్షన్ ధర రూ.10.74 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై)గా ఉంది. వెంటో డీజిల్ కంఫర్ట్‌లైన్‌ 1.6 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 105 పిఎస్‌ల శక్తిని, 250 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది. ఇది లీటరుకు 20.5 కి.మీ. మైలేజీనిస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, April 11, 2014, 16:49 [IST]
English summary
Volkswagen dealers still have plenty of unsold 2013 Vento sedans and in a bid to clear inventory the old car has been turned into a special edition model to make it attractive.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+