జెనీవాలో ప్రొడక్షన్ వెర్షన్ ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 విడుదల

By Ravi

మీ అందరికీ ఫోక్స్‌వ్యాగన్ వంద కిలోమీటర్ల మైలేజ్ కారు గుర్తుండే ఉంటుంది. జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ లీటరు ఇంధనానికి 100 కిలోమీటర్లకు పైగా మైలేజీనిచ్చే ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 కాన్సెప్ట్‌ను గడచిన రెండేళ్ల క్రితం అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ కారు ఉత్పత్తి దశకు కూడా చేరుకుంది. ఈ హైబ్రిడ్ కారును ఫోక్స్‌వ్యాగన్ ప్రస్తుతం జెనీవాలో జరుగుతున్న 83వ అంతర్జాతీయ మోటార్ షోలో విడుదల చేసింది.

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు డీజిల్ మరియు బ్యాటరీ పవర్‌తో పనిచేస్తుంది. ఇందులో 47 బిహెచ్‌పి, ట్విన్-సిలిండర్, 800 సీసీ, టర్బో డీజిల్ ఇంజన్‌ను, అలాగే, 27 బిహెచ్‌పి ఎలక్ట్రిక్ మోటార్‌లను అమర్చారు. ఈ ఎలక్ట్రిక్ మోటార్ కారులో అమర్చిన 5.5 కిలోవాట్ బ్యాటరీ సాయంతో నడుస్తుంది. కారు బరువును తేలికంగా ఉంచేందుకు గానూ దీని బాడీ నిర్మాణంలో ఎక్కువ భాగం ధృఢమైన కార్బన్ ఫైబర్‌ను ఉపయోగించారు.

ఈ హైబ్రిడ్ కారు మొత్తం బరువు 795 కేజీలు మాత్రమే. ఈ కారులో ఇద్దరికి మాత్రమే చోటు ఉంటుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు లీటరు ఇంధనానికి 111.16 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. ఇది 3.8 మీటర్ల పొడవును, 1.66 మీటర్ల వెడల్పును కలిగి ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 159.9 కిలోమీటర్లు. ఇది 12.7 సెకండ్ల వ్యవధిలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 160 కి.మీ.

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 కారులో 10 లీటర్ల సామర్థ్యం కలిగిన ఇంధన ట్యాంక్ ఉంటుంది. ఈ ఇంధనం సాయంతో 49.8 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. డీజిల్, బ్యాటరీ పవర్‌తో కలిపి ఈ కారులో 499 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. దీని ధరను కంపెనీ అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ, ఇది లక్ష డాలర్లు ఉండొచ్చని అంచనా. అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.54 లక్షలకు పైమాటే (పన్నులు కలుపుకోకుండా).

జెనీవా మోటార్ షోలో ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1

జెనీవా మోటార్ షోలో ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1

జెనీవా మోటార్ షోలో ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1

జెనీవా మోటార్ షోలో ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1

జెనీవా మోటార్ షోలో ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1

జెనీవా మోటార్ షోలో ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1

జెనీవా మోటార్ షోలో ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1

జెనీవా మోటార్ షోలో ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1

జెనీవా మోటార్ షోలో ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1

జెనీవా మోటార్ షోలో ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1

More from DriveSpark

Article Published On: Friday, March 8, 2013, 14:39 [IST]
English summary
Volkswagen has unveiled the world's most fuel efficient car XL1 at the 83rd Geneva International Motor Show. This is the production version at Volkswagen XL1, which was showcased in earlier auto shows.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+