త్వరలో రోడ్లపైకి రానున్న వోల్వో డ్రైవర్‌లెస్ కార్లు

By Ravi

విమానాల్లో 'ఆటో పైలట్ మోడ్' అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్‌తో పైలట్ సాయం అవసరం లేకుండానే విమానాన్ని యాంత్రికంగా కంట్రోల్ చేయవచ్చు. ఇప్పుడు ఇలాంటి వ్యవస్థ కార్లలో సైతం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే, మెర్సిడెస్ బెంజ్, నిస్సాన్ వంటి పలు ఆటోమొబైల్ కంపెనీలు డ్రైవర్‌లెస్ (డ్రైవర్ అవసరం లేని) కార్లను తయారు చేస్తున్న సంగతి తెలిసినదే.

ఈ కోవలో తాజాగా స్వీడన్ ఆటోమొబైల్ కంపెనీ వోల్వో వచ్చి చేరింది. 'డ్రైవ్ మి' అనే పేరుతో వోల్వో ఓ అధునాతన ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఇందులో భాగంగా, వోల్వో డ్రైవర్‌లెస్ కార్లను తయారు చేస్తుంది. ఈ తరహా వాహనాలను సెల్ఫ్ డ్రైవింగ్ కార్లని, ఆటానమస్ డ్రైవ్ వాహనాలని కూడా పిలుస్తుంటారు. వోల్వో ఇప్పటికే ఈ రకమైన 100 ఆటోమేటిక్ కార్లను తయారు చేసి, స్వీడన్ నగరమైన గోతెన్‌బర్గ్‌లో టెస్టింగ్ చేసేందుకు సిద్ధంగా ఉంది.

మరి ఈ వోల్వో డ్రైవర్‌లెస్ కార్లలోని విశిష్టమైన గుణాలేంటో తెలుసుకుందాం రండి.. చివరి స్లైడ్‌లో అద్భుతమైన వీడియోను వీక్షించడం మర్చిపోకండి.

వోల్వో డ్రైవర్‌లెస్ కార్లు

'డ్రైవ్ మి సెల్ఫ్-డ్రైవింగ్ కార్స్ ఫర్ సస్టెయినబిల్ మొబిలిటీ' అని పిలిచే ఈ ప్రాజెక్టును వోల్వో కార్ గ్రూప్ మరియు గోతెన్‌బర్గ్ స్వీడన్ ట్రాన్స్‌పోర్ట్ అడ్మినిస్ట్రేషన్‌‌లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 2014 నుంచి ఇరు సంస్థలు ఈ కార్లను టెస్టింగ్ చేయనున్నాయి. ప్రారంభంలో భాగంగా ఈ కార్లలోసేఫ్టీ కోసం డ్రైవర్‌ను ఉంచుతారు. 2017లో పూర్తిస్థాయిలో ఆటోమేటిక్ కార్లను టెస్ట్ చేస్తారు.

వోల్వో డ్రైవర్‌లెస్ కార్లు

ఈ వోల్వో ఆటానమస్ కార్లు చూడటానికి మామూలు కార్ల మాదిరిగానే కనిపిస్తాయి. అయితే, వీటికి చుట్టుపక్కల సెన్సార్లు అమర్చబడి ఉంటాయి. ఈ కార్లు జిపిఎస్ ఆధారంగా పనిచేస్తాయి. ఇందులో స్టీరింగ్ వీల్‌పై ఉండే ఒక్క బటన్ నొక్కగానే కారును ఆటోమేటిక్ డ్రైవ్ మోడ్‌కు గానీ లేదా మ్యాన్యువల్ డ్రైవ్ మోడ్‌కు గానీ మార్చుకోవచ్చు.

వోల్వో డ్రైవర్‌లెస్ కార్లు

కారును ఆటోమేటిక్ మోడ్‌లోకి స్విచ్ చేసినప్పుడు, డ్రైవర్ కారును కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉండదు, అదే ఆటోమేటిక్‌గా సెన్సార్లు, జిపిఎస్‌ల సాయంతో ముందుకు సాగిపోతుంది. మ్యాన్యువల్ మోడ్‌లో కారును నడిపేటప్పుడు, రెగ్యులర్ కార్లను డ్రైవ్ చేసినట్లుగానే, డ్రైవర్ స్టీరింగ్, పెడల్స్‌ను కంట్రోల్ చేస్తూ నడపుకోవచ్చు.

వీడియో

తాము సృష్టించిన ఈ ఆటోమేటిక్ డ్రైవర్‌లెస్ కార్లు ఎలా పనిచేస్తాయో వివరిస్తూ వోల్వో అధికారులు ఓ వీడియోని రూపొందించారు. ఈ కార్ల గురించే వారేం చెబుతున్నారో, వారి మాటల్లోనే వినండి..!

More from DriveSpark

Article Published On: Monday, December 16, 2013, 10:37 [IST]
English summary
Its now common knowledge that several automakers are working on developing self driving cars, also called autonomous drive vehicles. Mercedes-Benz, Nissan, Volvo among others, have already showcased their capabilities. But now Volvo wants to take it to the next level by running 100 automatic cars in the Swedish city of Gothenburg.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+