వోల్వో వి40 క్రాస్ కంట్రీ విడుదల; ధర రూ.25.5 లక్షలు

స్వీడన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'వోల్వో ఇండియా' తమ అధునాత వి40 క్రాస్ కంట్రీ క్రాసోవర్ మోడల్‌ను నేడు (శుక్రవారం) మార్కెట్లోకి విడుదల చేసింది. భారతీయ సంపన్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా విలాసవంతమైన ఫీచర్లు, ప్రీమియం లుక్ ఉండేలా తీర్చిదిద్దిన వోల్వో వి40 క్రాస్ కంట్రీ ధర దేశీయ విపణిలో రూ.28.5 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

వోల్వో వి40 క్రాస్ కంట్రీ క్రాసోవర్ ఈ సెగ్మెంట్లోని బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1, ఆడి క్యూ3, తాజాగా వచ్చిన మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ మరియు త్వరలో మార్కెట్లోకి రానున్న బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్ వంటి మోడళ్లకు సవాలుగా నిలువనుంది. అంతర్జాతీయ మార్కెట్లో వోల్వో వి40 4 క్రాస్ కంట్రీ 4 పెట్రోల్, 3 డీజిల్ వేరియంట్లలో లభ్యమవుతుండగా, భారత మార్కెట్లో మాత్రం కేవలం ఒకే ఒక్క వేరియంట్ అందుబాటులో ఉంది.

భారత్‌లో వోల్వో వి40 క్రాస్ కంట్రీ 'డి3' అనే వేరియంట్లో మాత్రమే లభ్యమవుతుంది. అయితే, ఇందులో ఫుల్లీ లోడెడ్ ఫీచర్లు ఉన్నాయి. ఈ వేరియంట్లో పవర్‌ఫుల్ టర్బోఛార్జ్‌డ్ 2.0 లీటర్, 5-సిలిండర్, కామన్ రెయిల్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 148 హార్స్ పవర్‌ల శక్తిని, 350 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ జియార్‌ట్రానిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్సుతో జతచేయబడి ఉంటుంది.

వోల్వో కార్లంటేనే సేఫ్టీకి పెట్టింది పేరు. మరి ఈ వి40 క్రాస్ కంట్రీలో వోల్వో అందిస్తున్న పీచర్లేంటో ఈ క్రింది స్లైడ్‌లలో పరిశీలిద్దాం రండి..!

సేఫ్టీ ఫీచర్లు

సేఫ్టీ ఫీచర్లు

సిప్స్ (సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ సిస్టమ్), ఎయిర్‌బ్యాగ్స్, క్నీ ఎయిర్‌బ్యాగ్స్ (మోకాలు కోసం), విప్లాష్ ప్రొటెక్షన్‌తో కూడిన ఫ్రంట్ సీట్స్, ఇన్‌ఫ్లేటబల్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్, సిటీ సెఫ్టీ టెక్.

సేఫ్టీ ఫీచర్లు

సేఫ్టీ ఫీచర్లు

డైనమిక్ స్టెబిలిటీ అంట్ ట్రాక్షన్ కంట్రోల్, లేజర్ అసిస్టెట్ ఆటోమేటిక్ బ్రేకింగ్

ఇతర ఫీచర్లు

ఇతర ఫీచర్లు

ఫ్యాబ్రిక్ కవర్‌తో కూడిన ఫిక్స్డ్ పానరోమిక్ గ్లాస్ రూఫ్, క్లీన్ ఎయిర్ ఫిల్టర్ టెక్నాలజీతో కూడిన ఏ/సి, క్రూయిజ్ కంట్రోల్, 7 రకాల లైటింగ్ మోడ్లతో కూడిన థియేటర్ లైటింగ్.

ఇతర ఫీచర్లు

ఇతర ఫీచర్లు

డ్రైవర్ సీట్ కోసం మెమరీ ఫంక్షన్‌తో కూడిన లెథర్ సీట్స్, రీమోట్ కీలెస్ ఎంట్రీ, ప్రకాశించే గేర్ నాబ్, యాక్టివ్ బెండింగ్ టెక్నాలజీతో కూడిన ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్, వోల్వో సెన్సస్ ఆడియో సిస్టమ్.

ఇంధనం ఆదా చేసే ఫీచర్లు

ఇంధనం ఆదా చేసే ఫీచర్లు

స్టార్ట్/స్టాప్ ఫంక్షన్, వోల్వో ఇంజన్ బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్ సిస్టమ్.

అడాప్టివ్ డిజిటల్ డిస్‌ప్లే

అడాప్టివ్ డిజిటల్ డిస్‌ప్లే

ఎలిగాన్స్, ఈకో మరియు పెర్ఫామెన్స్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ 8 ఇంచ్ టిఎఫ్‌టి డిస్‌ప్లేతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్.

ఎలిగాన్స్ మోడ్

ఎలిగాన్స్ మోడ్

స్పీడోమీటర్‌పై హైలైట్ అవుతుంది. మ్యాన్యువల్ మోడ్ ఎంచుకుంటే, గేర్ షిఫ్ట్ ఇండికేటర్ కనిపిస్తుంది.

ఈకో మోడ్

ఈకో మోడ్

ఈకో మోడ్ సింబల్, రియల్ టైమ్ ఫ్యూయెల్ కంజప్షన్ మరియు సగటు ఫ్యూయెల్ కంజప్షన్ వివరాలు కనిపిస్తాయి.

పెర్ఫామెన్స్ మోడ్

పెర్ఫామెన్స్ మోడ్

స్పీడో మీటర్ ముల్లు స్థానంలో టాకోమీటర్ కనిపిస్తుంది. డిజిటల్ స్పీడ్ కనిపిస్తుంది, అలాగే యాక్సిలరేట్ చేస్తున్నప్పుడు అప్పటి వరకూ ఉపయోగించిన పవర్, మిగిలి ఉన్న పవర్ వివరాలు తెలుస్తాయి.

పార్కింగ్ పైలట్

పార్కింగ్ పైలట్

భారతదేశంలోనే తొలిసారిగా వోల్వో పార్కింగ్ పైలట్ సిస్టమ్‌ను పరిచయం చేసింది. ఇది ఆటోమేటిక్ కారును పార్క్ చేయటానికి కావల్సిన పార్కింగ్ స్థలాన్ని (1.2 మీటర్ల కారు పొడవు) గుర్తిస్తుంది.

ఇంజన్

ఇంజన్

పవర్‌ఫుల్ టర్బోఛార్జ్‌డ్ 2.0 లీటర్, 5-సిలిండర్, కామన్ రెయిల్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 148 హార్స్ పవర్‌ల శక్తిని, 350 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)

ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)

ఈ ఇంజన్ 6-స్పీడ్ జియార్‌ట్రానిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్సుతో జతచేయబడి ఉంటుంది.

పెర్ఫామెన్స్

పెర్ఫామెన్స్

ఇది కేవలం 8.68 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.

గరిష్ట వేగం

గరిష్ట వేగం

వోల్వో వి40 క్రాస్ కంట్రీ క్రాసోవర్ గరిష్టం వేగం గంటకు 210 కిలోమీటర్లు.

మైలేజ్

మైలేజ్

వోల్వో వి40 క్రాస్ కంట్రీ క్రాసోవర్‌లో ఉపయోగించిన 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ 16.81 కెఎమ్‌పిఎల్ మైలేజీని ఆఫర్ చేస్తుంది.

ఎక్స్టీరియర్ కలర్ ఆప్షన్స్

ఎక్స్టీరియర్ కలర్ ఆప్షన్స్

ఇది మిస్టీ బ్లూ, ప్యాషన్ రెడ్, రా కాపర్ మరియు సిల్వర్ మెటాలిక్ అనే రంగులలో లభిస్తుంది.

ఇంటీరియర్ కలర్ ఆప్షన్స్

ఇంటీరియర్ కలర్ ఆప్షన్స్

బ్లాక్ చార్కోల్, లైట్ బ్రౌన్, హాజల్ బ్రౌన్‌ మరియు బ్లాక్ చార్కోల్ కాంబినేషన్ ఇంటీరియర్ లెథర్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.

రియర్ ప్రొఫైల్

రియర్ ప్రొఫైల్

టెయిల్ ల్యాంప్స్

టెయిల్ ల్యాంప్స్

సెంటర్ కన్సోల్, ఆర్మ్ రెస్ట్స్

సెంటర్ కన్సోల్, ఆర్మ్ రెస్ట్స్

ఫోల్డబల్ రియర్ సీట్స్, బూట్ స్పేస్

ఫోల్డబల్ రియర్ సీట్స్, బూట్ స్పేస్

కప్ హోల్డర్స్

కప్ హోల్డర్స్

ఇంటీరియర్ వ్యూ

ఇంటీరియర్ వ్యూ

సేఫ్టీ ఫీచర్స్

సేఫ్టీ ఫీచర్స్

ధర రూ.28.5 లక్షలు

ధర రూ.28.5 లక్షలు

More from DriveSpark

Article Published On: Friday, June 14, 2013, 17:11 [IST]
English summary
The Swedish automaker Volvo has launched the V40 Cross Country crossover for its Indian customers. Volvo is expected to attract potential customers with its offering of a comprehensive safety, luxury and functional feature package for a price tag that rivals others in its segment. This includes BMW X1, Audi Q3, Mercedes Benz B-Class and perhaps even A-Class and the upcoming BMW 1 Series.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+