హైదరాబాద్ మార్కెట్లో వోల్వో వి40 క్రాస్ కంట్రీ విడుదల
స్వీడన్ కార్ మేకర్ 'వోల్వో ఇండియా' ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసిన తమ అధునాత 'వోల్వో వి40 క్రాస్ కంట్రీ' (Volvo V40 Cross Country) క్రాసోవర్ మోడల్‌ను తాజాగా హైదరాబాద్ మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. యూరో ఎన్‌సిఏపి క్రాష్ టెస్ట్‌లో ఇది 5-స్టార్ రేటింగ్ దక్కించుకుందని, రాష్ట్ర మార్కెట్లో దీని ధరను రూ.29.25 లక్షలు (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)గా నిర్ణయించామని వోల్వో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ థామస్ ఎర్న్‌బర్గ్ తెలిపారు.
వోల్వో వి40 క్రాస్ కంట్రీ ఒక్క వేరియంట్లో (D3) మాత్రమే లభిస్తుంది. ఇందులో పవర్‌ఫుల్ టర్బోఛార్జ్‌డ్ 2.0 లీటర్, 5-సిలిండర్, కామన్ రెయిల్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 148 హార్స్ పవర్‌ల శక్తిని, 350 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ జియార్‌ట్రానిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్సుతో జతచేయబడి ఉంటుంది. ఇది కేవలం 8.68 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది, గరిష్టం వేగం గంటకు 210 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.









వోల్వో వి40 క్రాస్ కంట్రీ క్రాసోవర్‌లో ఉపయోగించిన 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ 16.81 కెఎమ్‌పిఎల్ మైలేజీని ఆఫర్ చేస్తుంది. వోల్వో కార్లంటేనే సేఫ్టీకి పెట్టింది పేరు. సిప్స్ (సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ సిస్టమ్), ఎయిర్‌బ్యాగ్స్, క్నీ ఎయిర్‌బ్యాగ్స్ (మోకాలు కోసం), విప్లాష్ ప్రొటెక్షన్‌తో కూడిన ఫ్రంట్ సీట్స్, ఇన్‌ఫ్లేటబల్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్, సిటీ సెఫ్టీ టెక్, డైనమిక్ స్టెబిలిటీ అంట్ ట్రాక్షన్ కంట్రోల్, లేజర్ అసిస్టెట్ ఆటోమేటిక్ బ్రేకింగ్ వంటి సేఫ్టీ ఫీచర్లు వోల్వో వి40 సొంతం.
ఇంకా ఇందులో ఫ్యాబ్రిక్ కవర్‌తో కూడిన ఫిక్స్డ్ పానరోమిక్ గ్లాస్ రూఫ్, క్లీన్ ఎయిర్ ఫిల్టర్ టెక్నాలజీతో కూడిన ఏ/సి, క్రూయిజ్ కంట్రోల్, 7 రకాల లైటింగ్ మోడ్లతో కూడిన థియేటర్ లైటింగ్, డ్రైవర్ సీట్ కోసం మెమరీ ఫంక్షన్‌తో కూడిన లెథర్ సీట్స్, రీమోట్ కీలెస్ ఎంట్రీ, ప్రకాశించే గేర్ నాబ్, యాక్టివ్ బెండింగ్ టెక్నాలజీతో కూడిన ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్, వోల్వో సెన్సస్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లున్నాయి.
ఈ కారులోని స్టార్ట్/స్టాప్ ఫంక్షన్, వోల్వో ఇంజన్ బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్ సిస్టమ్ ద్వారా ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు. ఇందులో ఎలిగాన్స్, ఈకో మరియు పెర్ఫామెన్స్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్‌తో కూడిన 8 ఇంచ్ టిఎఫ్‌టి డిస్‌ప్లేతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. భారతదేశంలోనే తొలిసారిగా వోల్వో పార్కింగ్ పైలట్ సిస్టమ్‌ను ఈ కారులో పరిచయం చేశారు. ఇది ఆటోమేటిక్ కారును పార్క్ చేయటానికి కావల్సిన పార్కింగ్ స్థలాన్ని (1.2 మీటర్ల కారు పొడవు) గుర్తిస్తుంది.
ఇది మిస్టీ బ్లూ, ప్యాషన్ రెడ్, రా కాపర్ మరియు సిల్వర్ మెటాలిక్ అనే రంగులలో లభిస్తుంది. బ్లాక్ చార్కోల్, లైట్ బ్రౌన్, హాజల్ బ్రౌన్ మరియు బ్లాక్ చార్కోల్ కాంబినేషన్ ఇంటీరియర్ లెథర్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. వోల్వో వి40 క్రాస్ కంట్రీ క్రాసోవర్ ఈ సెగ్మెంట్లోని బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1, ఆడి క్యూ3, తాజాగా వచ్చిన మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ మరియు త్వరలో మార్కెట్లోకి రానున్న బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్ వంటి మోడళ్లకు సవాలుగా నిలువనుంది.


Click it and Unblock the Notifications








