వెంటో ఆటోమేటిక్ ఉత్పత్తి బంద్; టిఎస్ఐ వేరియంట్‌తో భర్తీ!
జర్మన్ కార్ మేకర్ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా సరిగ్గా నెల రోజుల క్రితం 1.2 లీటర్ 4-సిలిండర్ టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ మరియు 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో కూడిన 'వెంటో టిఎస్ఐ' సెడాన్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం కంపెనీ ఆఫర్ చేస్తున్న రెగ్యులర్ వెర్షన్ వెంటో ఆటోమేటిక్ (వెంటో ఏటి) వేరియంట్ ఉత్పత్తిని ఫోక్స్‌వ్యాగన్ ఇండియా నిలిపి వేసినట్లు సమాచారం.
కొత్త వెంటో టిఎస్ఐ ఆటోమేటిక్ రాకతో రెగ్యులర్ వెర్షన్ వెంటో ఆటోమేటిక్ పాత తరం (ఓల్డ్ జనరేషన్) మోడల్ అయిపోవటం, ఈ రెండు వేరియంట్ల ధర ఇంచు మించు ఒకేలా ఉండటంతో కొనుగోలుదారులు ఎక్కువగా వెంటో టిఎస్ఐ మోడల్‌నే ఎంచుకుంటున్నారు. రెగ్యులర్ వెంటో ఆటోమేటిక్ రూ.9.80 లక్షలకు లభిస్తుంటే, వెంటో టిఎస్ఐ ఆటోమేటిక్ రూ.9.99 లక్షలకు లభిస్తోంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

ఈ రెండు మోడళ్లలో ఇంజన్, ట్రాన్సిమిషన్, మైలేజ్‌ల పరంగా కూడా భేదాలున్నాయి. రెగ్యులర్ వెంటో ఏటిలో 1.6 లీటర్, 105 పిఎస్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ సాధారణ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. అదే వెంటో టిఎస్ఐ ఏటి విషయానికి వస్తే ఇందులో 1.2 లీటర్ 4-సిలిండర్ టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ ఉపయోగించారు. ఈ ఇంజన్ క్విక్-షిఫ్టింగ్ 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

రెగ్యులర్ వెంటో ఏటి లీటరుకు కేవలం 14.4 కిలోమీటర్ల మైలేజీని మాత్రమే ఆఫర్ చేస్తుంటే, వెంటో టిఎస్ఐ ఏటి లీటరుకు 16.93 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. వెంటో టిఎస్ఐ తక్కువ సామర్థ్యం, ఎక్కువ పవర్ కలిగిన ఇంజన్, డిఎస్‌జి ట్రాన్సిమిషన్‌తో పాటు ఈఎస్‌పి (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్) మరియు హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి అధనపు ఫీచర్లతో లభ్యమవుతుంది. కాబట్టి అన్ని విధాలుగా చూస్తే, రెగ్యులర్ వెంటో ఏటి కన్నా వెంటో టిఎస్ఐ ఏటి ఎన్నో రెట్లుగా మెరుగ్గా అనిపిస్తుంది.


Click it and Unblock the Notifications








