వీక్షించండి: డాట్సన్ గో ఫస్ట్ లుక్ వీడియో
జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ 1986వ సంవత్సరం తర్వాత నిలిపి వేసిన తమ పురాతన కార్ బ్రాండ్ డాట్సన్‌ను తిరిగి 30 ఏళ్ల తర్వాత మార్కెట్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ బ్రాండ్ క్రింద 'గో' (Go) అనే చవక కారును న్యూఢిల్లీలోని కింగ్‌డమ్ ఆఫ్ డ్రీమ్ వద్ద నిర్వహించిన ఓ కార్యక్రమంలో సోమవారం నాడు ఆవిష్కరించింది.
ఈ మేరకు డాట్సన్ గో కారుకు సంబంధించి ఫస్ట్ లుక్ వీడియోని కూడా నిస్సాన్ ఇంటర్నెట్‌లో విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ వీడియోలో గోల్డ్ కలర్ డాట్సన్ గో కారు చూడొచ్చు. మరి ఆ వీడియోపై మనం కూడా ఓ లుక్కేద్దామా..?
<center>/four-wheelers/watch-datsun-go-first-look-official-video-004768.html</center>
డాట్సన్ గో గురించి సంక్షిప్తంగా..
- నిస్సాన్ 30 ఏళ్ల తర్వాత డాట్సన్ బ్రాండ్ కార్లను తిరిగి మార్కెట్లోకి తీసుకువచ్చింది.
- వచ్చే ఏడాది ప్రారంభం (2014)లో డాట్సన్ కార్లు భారత్‌లో అందుబాటులోకి రానున్నాయి.
- ఇండియాతో పాటుగా ఇండోనేసియా, రష్యా, దక్షిణాఫ్రికాల్లో దేశాల్లో కూడా డాట్సన్ కార్లు విడుదల కానున్నాయి.
- భారత్‌తో డాట్సన్ గో కారు ఈ సెగ్మెంట్లోని మారుతి ఆల్టో, హ్యుందాయ్ ఇయాన్, చెర్లే స్పార్క్ వంటి మోడళ్లకు పోటీ ఇవ్వనుంది.
- భారత మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ కారును పూర్తిగా భారత్‌లోనే తయారు చేశారు.
- ఇందులో మైక్రా నుంచి గ్రహించిన 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్సుతో జతచేయబడి ఉంటుంది.
- డాట్సన్ గో కారులో డీజిల్ వెర్షన్ విడుదల గురించి కంపెనీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
- భారత్‌లో డాట్సన్ కార్లను చెన్నైలోని రెనో-నిస్సాన్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనున్నారు.
- టూవీలర్ల నుంచి కార్లకు అప్‌గ్రేడయ్యే వినియోగదారులు, కొత్తగా కార్లను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లను టార్గెట్‌గా చేసుకొని డాట్సన్ గో కారును అభివృద్ధి చేశారు.
- భారత మార్కెట్లో డాట్సన్ గో కారు ధర రూ.4 లక్షల కన్నా తక్కువగా ఉండనుంది.
- భారత్‌లో 2016 నాటికి మొత్తం మూడు డాట్సన్ కార్లను విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది.


Click it and Unblock the Notifications








