మీ కారు ఎగ్జాస్ట్‌ పైప్‌ నుంచి నీరు లీక్‌ అవుతుందా?.. వెంటనే ఈ పని చేయకపోతే రిస్క్‌ తప్పదు..

కార్లలో చిన్న చిన్న సమస్యలు తలెత్తడం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఇంజిన్‌ సమస్యలు. కొన్ని చిన్న సమస్యలుగా అనిపించడం వల్ల వాటి గురించి కస్టమర్లకు సైతం తయారీదారులు చెప్పరు. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా కారులో కనిపించే ఓ సమస్య గురించి మీకు చెప్పబోతున్నాం. అదేంటంటే..

వేసవి కాలంలో మీ కారు ఎగ్జాస్ట్ పైప్ నుంచి నీరు కారడాన్ని మీలో చాలా మంది గమనించే ఉంటారు. అయితే దీని ద్వారా ఇంజిన్‌ సమస్యలు తలెత్తుతాయమోననే భయం కొందరికి ఉంటుంది. మరమ్మతులకు ఎక్కువ ఖర్చు అవుతుందా.. లేదంటే ఇది ప్రమాదకరమా అని మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది అన్ని కార్లలో సాధారణంగా కనిపించే సమస్య.

Water-Dripping-Engine

మీ కారు ఎగ్జాస్ట్ పైప్‌ నుంచి నీరు కారుతున్నప్పుడు మీరు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఆ సమయంలో నీటి రంగు మారుతుందా లేదా చూడాలి. ఇంకా దుర్వాసనతో పాటు నీరు కారడం వంటివి జరిగితే వీలైనంత త్వరగా మెకానిక్ వద్దకు తీసుకెళ్లడం మంచిది.

మొదటగా ఎగ్సాస్ట్ పైపు నుంచి నీరు ఎందుకు కారుతుందో మీరు తెలుసుకోవాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వాతావరణం వేడిగా ఉంటే, కారులో ఏసీని ఉపయోగిస్తారు. దీని ద్వారా ఎగ్జాస్ట్ నుంచి వాటర్‌ లీక్‌ అవుతుంది. ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ లోపలికి వచ్చే గాలిని చల్లబరచడంతో పాటు తేమను తగ్గిస్తుంది. తద్వారా నీరు మంచులా ఏర్పడటానికి దారితీస్తుంది.

Water-Dripping-Engine

అలా ఏర్పడిన నీరు కారులో ఏదో ఒక మూల నుంచి బయటకు వెళ్లాలి. ఈ క్రమంలో ఆ నీరు ఎగ్జాస్ట్ సిస్టమ్ ద్వారా బయటకు వెళ్తుంది. కొన్ని నీటి బొట్లు సాధారణంగా కారుకు ఇబ్బందిని కలిగించదు. ఇది అన్ని కార్లలో సాధారణంగా కనిపించేదే.. కానీ అది రంగు మారినా లేదా వాసన వచ్చినా, వీలైనంత త్వరగా మీ కారును మెకానిక్ వద్దకు తీసుకెళ్లడం అవసరం.

చల్లగా అయిన నీరు సాధారణంగా లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. మోటార్ ఆయిల్ ముదురు మరియు జిగటగా ఉంటుంది. అలాగే ట్రాన్స్మిషన్ ఆయిల్ ఒక విలక్షణమైన వాసన కలిగి ఉంటుంది. ఈ క్రమంలో ఎగ్జాస్ట్ నుంచి అధిక మొత్తంలో నీరు వస్తున్నట్లయితే, మీరు దాన్ని తనిఖీ చేయాలి. డ్రిప్పింగ్ తగ్గించడానికి, మీరు మీ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ తీసుకునే గాలి మొత్తాన్ని సర్దుబాటు చేయాల్సి ఉంటుంది.

మీ ఇంజిన్ వేడెక్కుతున్నట్లయినా, ఎగ్జాస్ట్ పైపు నుంచి నీరు కారుతున్నా.. అది ఐస్‌ వాటర్‌ లీక్ అవ్వడానికి కారణం కావచ్చు. ఇది ఎక్కువగా లీక్ అయినట్లయితే మీ కారు ఇంజిన్‌ దెబ్బ తినే అవకాశం ఉంది. ఇంజిన్ బ్లాక్ లేదా సిలిండర్‌లో పగుళ్లు వంటి అనేక కారణాల కారణంగా నీరు లీక్ అయ్యే అవకాశం ఉంటుంది.

RAC నిపుణులు కూడా వేడి వాతావరణం కారణంగా కారు యొక్క వెంటిలేషన్ ఓపెనింగ్స్ నుండి తెల్లటి 'పొగ' వెలువడుతుందని గమనించారు. పొగకు ఘాటైన వాసన ఉంటే తప్ప దీని గురించి మీరు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇది కేవలం కండెన్సర్ నుంచి వచ్చే నీటి ఆవిరి మాత్రమే ఎగ్జాస్ట్ పైప్‌ ద్వారా బయటకు వెళ్లడానికి బదులుగా సిస్టమ్ యొక్క మరొక చివర నుండి బయటకు వెళ్తుంది..

సిస్టమ్‌ను తక్కువ వ్యవధిలో రన్‌ చేయడం వల్ల ఈ పొగను ఆపవచ్చు. అయితే, పొగ ముదురు రంగులో ఉండి, అసహ్యకరమైన వాసన కలిగి ఉంటే, మీరు వెంటనే కారును ఆపి, బయటకు వెళ్లి, మెకానిక్‌ని పిలవడం చేయాలి. ఈ పై విషయాలు గుర్తుంచుకుంటే మీ కారు ఇంజిన్‌ దెబ్బతినకుండా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, September 13, 2023, 18:21 [IST]
English summary
Water leak from car exhaust pipe here is know why and safety tips
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+