కార్లపై భారీ డిస్కౌంట్స్.. ఏయే కంపెనీ ఎంతిస్తోంది..?
సరసమైన ధరకే సరైన కారును సొంతం చేసుకోవాలనుకునే ఇదే అనువైన సమయం. సాధారణంగా, కార్ల కంపెనీలు పండుగ సీజన్‌లో ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. అయితే, గడచిన కొద్ది నెలలుగా భారత ఆటోమొబైల్ మార్కెట్లో అమ్మకాలు మందకొడిగా సాగుతుండటంతో, ఇప్పుడు తయారీదారులు ఆఫర్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. గతంలో ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని ఆఫర్లను తమ ఉత్పత్తులపై అందిస్తున్నారు. అమ్మకాలు పడిపోవడంతో స్టాక్ యార్డులలో కార్లు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి.
ఈ నేపథ్యంలో, పాత స్టాక్ క్లియర్ చేసుకునేందుకు ఆకర్షనీయమైన డిస్కౌంట్లను, ప్రోత్సాహకాలను ఆఫర్ చేస్తున్నారు. వాస్తవానికి మార్చి నెలాఖరుతో పాత ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి, సదరు ఆర్థిక సంవత్సర లక్ష్యాలను చేరుకునేందుకు కూడా కంపెనీలు డిస్కౌంట్లను అందిస్తుంటాయి. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కార్ల అమ్మకాలు ఏకంగా 12 ఏళ్ల కనిష్టానికి పడిపోయి 25.7 శాతం క్షీణించాయి. దీంతో కార్ల కంపెనీలకు వేరే మార్గం లేక తప్పనిసరై భారీ డిస్కౌంట్లను ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
వివిధ కార్ మోడళ్లపై సంబంధిత కార్ కంపెనీలు ఆఫర్ చేస్తున్న డిస్కౌంట్ల వివరాల కోసం క్రింది ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి.

కార్లపై భారీ డిస్కౌంట్స్
మారుతి సుజుకి స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్ డీజిల్ మోడళ్లపై కంపెనీ రూ.5,000 వరకూ డిస్కౌంట్‌ను మరియు కార్పోరేట్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందజేస్తోంది.

కార్లపై భారీ డిస్కౌంట్స్
జనరల్ మోటార్స్ అందిస్తున్న అన్ని చెవర్లే క్రూజ్ వేరియంట్లపై కంపెనీ ఉచిత బీమా ఆఫర్‌ను ప్రకటించింది. దీనికి అదనంగా మరో రూ.20,000 ఎక్సేంజ్ బోనస్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

కార్లపై భారీ డిస్కౌంట్స్
జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న వెంటో సెడాన్ కోసం కంపెనీ ఓ వినూత్న ఆఫర్‌ను ప్రకటించింది. పాత కారును తీసుకువచ్చి, కేవలం ఒక్క రూపాయి చెల్లించి కొత్త వెంటోను తీసుకెళ్లండని ఫోక్స్‌వ్యాగన్ అంటోంది.

కార్లపై భారీ డిస్కౌంట్స్
స్కొడా ఇండియా అందిస్తున్న ర్యాపిడ్ సెడాన్ కోసం కంపెనీ ఓ విశిష్టమైన ఆఫర్‌ను అందిస్తోంది. ఇప్పుడు స్కొడా ర్యాపిడ్ కారును కొనుగోలు చేసి, 12 నెలల తర్వాత ఈఎమ్ఐను చెల్లించడంటూ స్కొడా కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది.

కార్లపై భారీ డిస్కౌంట్స్
మారుతి సుజుకి అందిస్తున్న వ్యాగన్ఆర్ కారుపై డీలర్లు రు.20,000 ఎక్సేంజ్ బోనస్‌ను ఆఫర్ చేస్తున్నారు. దీనికి అదనంగా, రూ.28,000 వరకూ నగదు తగ్గింపును కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ కారును కొనుగోలు చేసే వారు మొత్తం రూ.48,000 వరకూ ఆదా చేసుకోవచ్చు.

కార్లపై భారీ డిస్కౌంట్స్
మారుతి సుజుకి తాజాగా మార్కెట్లో ప్రవేశపెట్టిన కొత్త ఆల్టో 800 కారుపై రూ.20,000 నగదు డిస్కౌంట్‌ను, రూ.10,000 ఎక్సేంజ్ బోనస్‌ను ఆఫర్ చేస్తున్నారు.

కార్లపై భారీ డిస్కౌంట్స్
శక్తివంతమైన మారుతి సుజుకి ఆల్టో కె10 (1000సీసీ వెర్షన్)పై రూ.20,000 నగదు డిస్కౌంట్‌ను, రూ.20,000 ఎక్సేంజ్ బోనస్‌ను ఆఫర్ చేస్తున్నారు.

కార్లపై భారీ డిస్కౌంట్స్
ఫియట్ ఇండియా అందిస్తున్న సెడాన్ లీనియా ఎమోషన్‌పై (డీజిల్) ఎక్సేంజ్ బోనస్‌తో కలిపి రూ.75,000 వరకూ డిస్కౌంట్‌ను, పుంటో ఎమోషన్‌పై (డీజిల్) ఎక్సేంజ్ బోనస్‌తో కలిపి రూ.53,000 వరకూ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నారు.

కార్లపై భారీ డిస్కౌంట్స్
టాటా మోటార్స్ అందిస్తున్న 2012 మోడల్ ఆరియా క్రాసోవర్‌పై రూ.2 లక్షల డిస్కౌంట్‌ను, 2011 మోడళ్లపై రూ.2.5 లక్షల డిస్కౌంట్‌ను మరియు 2012-13 మోడళ్లపై రూ.50,000 ఎక్సేంజ్ బోనస్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది (ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకూ మాత్రమే).

కార్లపై భారీ డిస్కౌంట్స్
మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న వన్ అండ్ ఓన్లీ సెడాన్ వెరిటోపై రూ.20,000 నగదు డిస్కౌంట్, ఉచిత బీమా, రూ.10,000 ఎక్సేంజ్ బోనస్, రూ.7,000 కార్పోరేట్ డిస్కౌంట్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

కార్లపై భారీ డిస్కౌంట్స్
మహీంద్రా తాజాగా మార్కెట్లో విడుదల చేసిన కాంపాక్ట్ ఎస్‌యూవీ క్వాంటోపై కంపెనీ రూ.20,000 ఎక్సేంజ్ బోనస్‌ను ఆఫర్ చేస్తోంది.

కార్లపై భారీ డిస్కౌంట్స్
మహీంద్రా అండ్ మహీంద్రా పాపులర్ ఎమ్‌పివి జైలోపై కంపెనీ రూ.52,000 నగదు తగ్గింపును అందిస్తోంది.

కార్లపై భారీ డిస్కౌంట్స్
హ్యుందాయ్ తమ అన్ని రకాల ఉత్పత్తులపై రూ.15,000 మొదలుకొని రూ.42,500 వరకూ ప్రోత్సాహకాలను ఆఫర్ చేస్తోంది.

కార్లపై భారీ డిస్కౌంట్స్
టొయోటా అందిస్తున్న కరోలా అల్టిస్ సెడాన్ బీమాలో 50 శాతం తగ్గింపు, రూ.20,000 ఎక్సేంజ్ బోనస్, రూ.10,000 వరకూ కార్పోరేట్ డిస్కౌంట్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

కార్లపై భారీ డిస్కౌంట్స్
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా అందిస్తున్న ఆడి ఏ4 మోడల్‌పై (2.0 టిడిఐ వేరియంట్‌పై మాత్రమే) డీలర్లు రూ.4 లక్షల వరకూ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.

కార్లపై భారీ డిస్కౌంట్స్
నిస్సాన్ ఇండియా ఇటీవలే మార్కెట్లో ప్రవేశపెట్టిన 2012 మోడల్ ఇవాలి ఎమ్‌పివిపై కొనుగోలుదారులు రూ.1.25 లక్షల వరకూ ఆదా చేసుకోవచ్చు.

కార్లపై భారీ డిస్కౌంట్స్
నిస్సాన్ సన్నీ పెట్రోల్, డీజిల్ వేరియంట్లపై రూ.17,000 వరకూ నగదు తగ్గింపు (వేరియంట్‌ను బట్టి)ను మరియు రూ.20,000 ఎక్సేంజ్ బోనస్‌ను కంపెనీ ఆఫర్ చేస్తుంది.

కార్లపై భారీ డిస్కౌంట్స్
ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న పస్సాట్ ప్రీమియం సెడాన్‌పై డీలర్లు రూ.2 లక్షల వరకూ ప్రోత్సాహకాలను అందిస్తున్నారు.

కార్లపై భారీ డిస్కౌంట్స్
పెట్రోల్ వేరియంట్ ఫోక్స్‌వ్యాగన్ పోలో (కంఫర్ట్‌లైన్, హైలైన్) దాదాపు రూ.24,000 విలువైన ఉచిత ఇన్సూరెన్స్, అన్ని డీజిల్ వేరియంట్లపై రూ.26,000 విలువైన ఉచిత ఇన్సూరెన్స్ మరియు రూ.10,000 ఎక్సేంజ్ బోనస్‌ను ఆఫర్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications








