థాయ్‌లాండ్‌లో హోండా అకార్డ్ హైబ్రిడ్ విడుదల

By Ravi

గడచిన ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో హోండా కార్స్ ఇండియా తమ అధునాత లగ్జరీ హైబ్రిడ్ సెడాన్ అకార్డ్‌ను ఆవిష్కరించిన సంగతి మనకు తెలిసినదే. హోండా ఇప్పటికే భారత్‌లో అకార్డ్ ఉత్పత్తిని, అమ్మకాలను నిలిపివేసింది. 2015లో ఓ రిఫ్రెష్డ్ అకార్డ్‌ను పరిచయం చేయాలని కంపెనీ యోచిస్తోంది. అయితే, ఇందులో హైబ్రిడ్ వెర్షన్ వస్తుందా లేదా అనేది మాత్రం ప్రశ్నార్థకంగా ఉంది.

ఏదేమైనప్పటికీ, భారత్ కన్నా ముందుగా థాయ్‌లాండ్ మార్కెట్‌లో హోండా అకార్డ్ హైబ్రిడ్ సెడాన్‌ను కంపెనీ పరిచయం చేసింది. దీన్నిబట్టి, ఈ హైబ్రిడ్ హోండా అకార్డ్ ఇండియాకు రావటానికి మరెంతో సమయం పట్టదని తెలుస్తోంది. థాయ్‌లాండ్ మార్కెట్లో విడుదలైన హోండా అకార్డ్ హైబ్రిడ్ లగ్జరీ సెడాన్‌ను అక్కడే స్థానికంగా అసెంబ్లింగ్ చేస్తున్నారు. ఇది రెండు వేరియంట్లలో లభిస్తోంది.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

హోండా అకార్డ్ హైబ్రిడ్

తర్వాతి స్లైడ్‌లలో మరింత సమాచారాన్ని తెలుసుకోండి.

హోండా అకార్డ్ హైబ్రిడ్

ఈ రెండు వేరియంట్లలో స్పోర్ట్ హైబ్రిడ్ మల్టీ-మోడ్ డ్రైవ్ (ఐ-ఎమ్ఎమ్‌డి) టెక్నాలజీని ఆఫర్ చేస్తుంది. ఇందులో ఓ 2.0 లీటర్ ఐ-విటెక్, ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ మరియు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. పెట్రోల్ ఇంజన్ 141 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్స్ 1.3 కివా లిథియం ఐయాన్ బ్యాటరీల సాయంతో నడుస్తుంది.

హోండా అకార్డ్ హైబ్రిడ్

నార్మల్ డ్రైవింగ్ మోడ్‌లో పెట్రోల్ ఇంజన్ నడుస్తున్నప్పుడు, జనరేటర్ మోటార్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ సాయంతో కారులోని లిథియం అయాన్ బ్యాటరీలు చార్జ్ అవుతాయి. ఈ కారును డ్యూయెల్ పవర్‌తో కానీ లేదా ఇండివిడ్యువల్ పవర్‌తో కానీ నడుపుకోవచ్చు.

హోండా అకార్డ్ హైబ్రిడ్

ఇక ఈ కారులోని ఫీచర్స్ విషయానికి వస్తే.. ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్ అండ్ టెయిల్ ల్యాంప్స్, క్రూయిజ్ కంట్రోల్, డ్యూయెల్ జోన్ ఎయిర్ కండిషన్, మెమరీ సీట్స్, స్మార్ట్ కీ సిస్టమ్, పుష్ స్టార్ట్ ఇగ్నిషన్, ఇంటెలిజెంట్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే (ఐ-ఎమ్ఐడి), 7.5 ఇంచ్ టిఎఫ్‌టి స్క్రీన్, సిరి వాయిస్ కమాండ్, ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లున్నాయి. ఇందులో సన్‌రూఫ్ కూడా ఉంది.

హోండా అకార్డ్ హైబ్రిడ్

సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే.. ఆరు ఎయిర్‌బ్యాగ్స్, విఎస్ఏ, ఏబిఎస్, ఈబిడి, బ్రేక్ అసిస్ట్, హిల్-స్టార్ట్ అసిస్ట్, మల్టీ యాంగిల్ రియర్ వ్యూ కెమెరా, లేన్ వాచ్ బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ సిస్టమ్, కొల్లైజన్ మిటిగేషన్ బ్రేక్ సిస్టమ్ (సిఎమ్‌బిఎస్) వంటి అధునాత ఫీచర్లున్నాయి.

హోండా అకార్డ్ హైబ్రిడ్

హోండా అకార్డ్ హైబ్రిడ్ క్రిస్టల్ బ్లాక్ పెరల్, వైట్ ఆర్చిడ్ పెరల్, మోడ్రన్ స్టీల్ మెటాలిక్, ఆల్బాస్టర్ సిల్వర్ మెటాలిక్ రంగులలో లభిస్తుంది. అలాగే ఇంటీరియర్స్ కోసం బ్లాక్, బీజ్ థీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ కారు కోసం కంపెనీ ఓ మాడ్యులో యాక్ససరీ ప్యాకేజ్‌ను కూడా ఆఫర్ చేస్తోంది.

More from DriveSpark

Article Published On: Thursday, July 3, 2014, 11:47 [IST]
English summary
Honda has launched the new Accord Hybrid in Thailand. The Thai-assembled Honda Accord Hybrid is available in two variants.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+