ఈనెలలోనే మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు విడుదల!

By Ravi

మహీంద్రా గ్రూపుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ 'మహీంద్రా రేవాట నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నెక్స్ట్ జనరేషన్, ఫ్యూచర్ రెడీ, ఎలక్ట్రిక్ కారు 'మహీంద్రా ఈ2ఓ' (Mahindra e2o) విడుదలకు ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది. ఇటీవలే బెంగుళూరు ప్లాంటులో ఈ ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిని చేపట్టిన మహీంద్రా రేవా ఇప్పటికే కొన్ని కార్లను ప్రముఖులకు డెలివరీ చేసినట్లు తెలుస్తోంది. కర్ణాటక రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగిన కొన్ని మహీంద్రా ఈ2ఓ కార్లు ప్రస్తుతం బెంగుళూరు నగర రోడ్లపై పరుగులు తీస్తున్నాయి.

ఇది వరకటి సమాచారం ప్రకారం, యూనియన్ బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలపై కేంద్ర ప్రభుత్వం విధించే పన్నులు లేదా ఆఫర్ చేయబోయే ప్రోత్సాహకాలను దృష్టిలో ఉంచుకొని ఈ కారు ధరను నిర్ణయించాలని కంపెనీ నిర్ణయించుకుంది. కాగా.. తాజాగా విడుదలైన బడ్జెట్ 2013-14లో ఎలక్ట్రిక్/హైబ్రిడ్ వాహనాలపై ప్రస్తుతం అమల్లో ఉన్న సబ్సిడీని 2015 వరకూ పొడిగించటం జరిగింది. ఈ నేపథ్యంలో, మహీంద్రా ఈ2ఓ కారు ఈ నెలలో మార్కెట్లో విడుదల కావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు


మహీంద్రా రేవా తమ ఫోర్-సీటర్ ఈ2ఓ ఎలక్ట్రిక్ కారును 5సి (5C) అనే శుభ్రం, సౌకర్యం, అనుసంధానం, తెలివి, ఖర్చు తక్కువతో కూడిన ప్రయాణం (Clean, Convenient, Connected, Clever and Cost Effective Commuting) ఐదు సూత్రాలను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేయటం జరిగింది. ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారును భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్లాటినం సర్టిఫికెట్ పొందిన బెంగుళూరు ప్లాంటులో ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ప్లాంటులో ఏటా సుమారు 30,000 ఎలక్ట్రిక్ కార్లు ఉత్పత్తి కానున్నాయి.

ప్రకృతి ఏవిధంగాను హాని కలిగించని రీతిలో (ఈకో ఫ్రెండ్లీ) కారును మహీంద్రా రేవా తయారు చేసింది. మహీంద్రా ఈ2ఓ పేరులో ఈ అనే అక్షరం సూర్యుని శక్తిని, 2 (టూ) కారులో కనెక్ట్ చేయబడిన టెక్నాలజీని, ఓ అనే అక్షరం ఆక్సిజన్‌ను ప్రతిభింభింపజేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారులో శక్తివంతమైన నెక్స్ట్ జనరేషన్ లిథియం అయాన్ బ్యాటరీలను (మొబైల్ ఫోన్లలో ఉపయోగించే రకం) ఉపయోగించారు. ఈ బ్యాటరీలను ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 100 కిలోమీటర్ల రేంజ్ వరకూ ప్రయాణించవచ్చు.

More from DriveSpark

Article Published On: Monday, March 4, 2013, 12:56 [IST]
English summary
Mahindra Reva is set to launch the much awaited electric car 'e2o' this month, which was showcased at 2012 Delho Auto. The Mahindra e2o is the first step in the creation of an entire electric vehicle value chain and ecosystem by the Mahindra Group.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+