స్టీవ్ జాబ్స్ కల నిజమవుతుందా..? ఐకార్ వస్తుందా..?

By Ravi

ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ కంపెనీ యాపిల్ ఐఎన్‌సి యొక్క దివంగత ముఖ్య కార్య నిర్వహణాధికారి (సీఈఓ) స్టీవ్ జాబ్స్ 2012లో మరణించిన తర్వాత కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. తాను బ్రతికి ఉన్న సమయంలో ఓ 'ఐకార్' (iCar)ను డిజైన్ చేయాలని స్టీవ్ జాబ్స్ కలగనేవారని అతని మిత్రుడు, యాపిల్ సంస్థ బోర్డ్ సభ్యులైన మైకీ డ్రెక్స్లర్ గతంలో వెల్లడించిన సంగతి తెలిసినదే.

కాగా.. ఇప్పుడు స్టీవ్ జాబ్స్ కల నెరవేరే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు యాపిల్ సంస్థ ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లాతో సంప్రదింపులు జరపుతున్నట్లు సమాచారం. వాస్తవానికి తమ బ్యాలెన్స్ షీట్‌లో 158.8 బిలియన్ డాలర్ల నగదు కలిగిన యాపిల్, దాదాపు 24 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటల్ కలిగిన టెస్లా మోటార్స్ కంపెనీని కొనుగోలు చేసే శక్తి ఉంది.

ఇది కూడా చదవండి: ఐకార్ (iCar)ను అభివృద్ధి చేయాలని కలగన్న స్టీవ్ జాబ్స్

Steve Jobs Apple iCar

గత కొద్ది వారాల క్రితమే ఇరు కంపెనీ ముఖ్య అధికారులు ఈ విషయంపై సమావేశమయ్యారు. అయితే, ఈ సమావేశంలోని అంశాలను వెల్లడించేందుకు మాత్రం వారు నిరాకరించారు. ఈ పరిణామాలను గమనిస్తుంటే, టెస్లా సహకారంతో యాపిల్ తమ 'ఐకార్'ను రూపకల్పన చేసి, మరణించిన స్టీవ్ జాబ్స్ ఆశయానికి తిరిగి ప్రాణం పోసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఒకవేళ యాపిల్, టెస్లా కంపెనీల మధ్య డీల్ విజయవంతమైనట్లయితే, మరికొద్ది సంవత్సరాల్లోనే యాపిల్ ఐకార్లు రోడ్లపై పరుగులు తీసే ఆస్కారం ఉంది. యాపిల్ తమ కార్లకు ఐఫోన్, ఐపాడ్‌ల మాదిరిగానే ఐకార్ అనే పేరునే ఉపయోగించే అవకాశం ఉంది. భవిష్యత్తులో తయారు చేసే కార్లను ఐకార్ 2, ఐకార్ 3 అని పిలిచే అవకాశం ఉంది. వీటిల్లో అధునాత ఐఓస్ సిస్టమ్‌ను ఉపయోగిస్తారు.

ఒకవేళ యాపిల్-టెస్లా ఓ సరికొత్త ఐకార్‌ను డిజైన్ చేస్తే, అది ప్రస్తుతం టెస్లా విక్రయిస్తున్న/అభివృద్ధి చేస్తున్న కార్ల కన్నా ఎంతో భిన్నంగా ఉండనుంది. అలాగే ధర కూడా టెస్లా కార్ల ధరల కన్నా కాస్తంత అధికంగానే ఉండే ఆస్కారం ఉంది. యాపిల్ ఐకార్ విషయంలో వస్తున్న ఈ వదంతులు నిజమో కాదో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

More from DriveSpark

Article Published On: Monday, February 24, 2014, 9:57 [IST]
English summary
Steve Jobs Apple iCar dream will become reality? reports says there is possibility. Now rumors have been swirling since news broke this week of a possible meeting between Apple's top executive for acquisitions and the CEO of electric car maker Tesla.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+