టెర్రానో ఎస్‌యూవీ రాకతో నిస్సాన్ సేల్స్ పెరుగుతాయా?
జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇండియా ప్రవేశపెట్టనున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ 'నిస్సాన్ టెర్రానో' (Nissan Terrano)పై సదరు కంపెనీ భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ మోడల్ రాకతో తమ సంస్థ ఇండియా అమ్మకాలు ప్రోత్సాహకర రీతిలో ఉంటాయని నిస్సాన్ ఇండియా అంచనా వేస్తోంది. నిస్సాన్ టెర్రానో ఈనెల 20వ తేదీన భారత మార్కెట్లో విడుదల కానుంది.
నిస్సాన్ టెర్రానోను రెనో డస్టర్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేశారు. అయితే, ఇతర రెనో-నిస్సాన్ క్లోనింగ్ మోడల్స్ (మైక్రా-పల్స్, సన్నీ-స్కాలా) మాదిరిగా కాకుండా డస్టర్‌తో పోల్చుకుంటే టెర్రానో పూర్తిగా విశిష్టమైన డిజైన్‌ను, ఫీచర్లను కలిగి ఉండనుంది. నిస్సాన్ టెర్రానో కాంపాక్ట్ ఎస్‌యూవీ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

ఆగస్ట్ 20, 2013వ తేదీన తమ టెర్రానో ఎస్‌యూవీని విడుదల చేస్తామని నిస్సాన్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. నిస్సాన్ ఇండియా ఇప్పటికే తమ టెర్రానో కాంపాక్ట్‌ఎస్‌యూవీకి సంబంధించిన టీజర్ ఫొటోలను కూడా విడుదల చేసిన సంగతి తెలిసినదే. భారత మార్కెట్లో నిస్సాన్ టెర్రానో ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీ ధర రూ.8.90 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.
డీజిల్ వెర్షన్ నిస్సాన్ టెర్రానోలో నిస్సాన్ నుంచి అత్యంత పాపులర్ అయిన 1.5 లీటర్ కె9కె డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నట్లు సమాచాం. ఈ ఇంజన్ గరిష్టంగా 85 పిఎస్‌ల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారుకు సంబందించిన మరింత సమాచారం తెలియాలంటే ఆగస్ట్ 20 వరకు ఆగాల్సిందే. తాజా అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








