ప్రపంచపు మొట్టమొదటి ప్రొడక్షన్ వెర్షన్ ఫ్లయింగ్ కార్

By Ravi

గంటల కొద్దీ నిలిచిపోయే ట్రాఫిక్ జామ్‌ల నుంచి జయ్యిమని గాల్లోకి ఎగిరిపోతే ఎంత బాగుంటుందో కదా..! త్వరలోనే ఈ ఊహ నిజం కానుంది..! ఫ్లయింగ్ కార్స్ (ఎగిరే కార్ల)పై ఇప్పటికే అనే సంస్థలు పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసినదే. అయితే, ఈ పరిశోధనలన్నీ దాదాపు కాన్సెప్ట్ దశకు మాత్రమే పరిమితమైపోయాయి. ఇందులో ఏదీ నిజంగా వినియోగదారులకు అందుబాటులోకి రాలేదు.

కానీ వచ్చే ఏడాది నుంచి ఫ్లయింగ్ కార్లు కస్టమర్లు అందుబాటులోకి రానున్నాయి. స్లోవేకియాకు చెందిన ఇంజనీర్ స్టీఫెన్ క్లీన్ తయారు చేసిన 'ఏరోమొబిల్ 2.5' (Aeromobil 2.5) అనే ఫ్లయింగ్ కారు కాన్సెప్ట్ దశ నుంచి ఉత్పత్తి దశకు చేరుకోనుంది. ఈ ఫ్లయింగ్ కారును ఇప్పటికే అనేక సార్లు టెస్టింగ్ చేసిన కంపెనీ, ఈనెలాఖరున ఇందులో ప్రొడక్షన్ వెర్షన్‌ను విడుదల చేయనుంది.

ఈ ప్రొడక్షన్ వెర్షన్ ఫ్లయింగ్ కారు పేరు 'ఏరోమొబిల్ 3.0', దీనిని అక్టోబర్ 29, 2014వ తేదీన ఆస్ట్రియాలోని పయోనీర్స్ ఫెస్టివల్‌లో ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ఈ ఫొటో ఫీచర్‌లో తెలుసుకోండి.

ప్రొడక్షన్ వెర్షన్ ఫ్లయింగ్ కారు

తర్వాతి స్లైడ్‌లలో ప్రొడక్షన్ వెర్షన్ ఫ్లయింగ్ కార్ ఏరోమొబిల్ 3.0కి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోండి.

ప్రొడక్షన్ వెర్షన్ ఫ్లయింగ్ కారు

ఏరోమొబిల్ సంస్థ 1990వ సంవత్సరం నుంచి ఫ్లయింగ్ కార్ కాన్సెప్ట్‌పై పనిచేస్తోంది. తమ మొట్టమొదటి చూడటానికి వికారంగా ఉండి, తరచూ ఉపయోగించేందుకు వీలుగా ఉండేది కాదని కంపెనీ పేర్కొంది. ఆ తర్వాత ఈ ఫ్లయింగ్ కారు డిజైన్‌ను అనేక సార్లు మార్చారు.

ప్రొడక్షన్ వెర్షన్ ఫ్లయింగ్ కారు

ప్రొడక్షన్ వెర్షన్ ఏరోమొబిల్ 3.0 ఫ్లయింగ్ కారులో రోటాక్స్ 912 ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్‌ను ఏరోమొబిల్ 2.5 వెనుక భాగంలో అమర్చారు. ఇది గాలిలో 700 కిలోమీటర్ల దూరం, నేలపై 875 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.

ప్రొడక్షన్ వెర్షన్ ఫ్లయింగ్ కారు

గాలిలో ఇది గంటకు 15 లీటర్ల ఇంధనాన్ని, రోడ్డుపై 12.5 కెఎమ్‌పిఎల్ మైలేజీని ఆఫర్ చేస్తుంది. గాలిలో దీని గరిష్ట వేగం గంటకు 200 కిలోమీటర్లు, రోడ్డుపై గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లు. టేకాఫ్ స్పీడ్ గంటకు 130 కిలోమీటర్లు.

ప్రొడక్షన్ వెర్షన్ ఫ్లయింగ్ కారు

ఏరోమొబిల్ 3.0 ఫ్రంట్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. నాలుగు చక్రాలు కలిగిన ఈ వాహనంలో వెనుక చక్రాలు బ్యాలెన్సింగ్ కోసం సహకరిస్తాయి, ముందు చక్రాలు ఇంజన్‌కు కనెక్ట్ అయి ఉంటాయి.

ప్రొడక్షన్ వెర్షన్ ఫ్లయింగ్ కారు

ఏరోమొబైల్ 3.0 క్యాబిన్/కాక్‌పిట్‌లో రెండు సీట్లు ఉంటాయి. ఇందులో ఒకటి డ్రైవర్/పైలట్ కోసం మరొకటి ప్యాసింజ్/కోపైలట్ కోసం.

ప్రొడక్షన్ వెర్షన్ ఫ్లయింగ్ కారు

ఈ ఫ్లయింగ్ కారులో రెండు స్టీరింగ్ వీల్స్ ఒకదానిపై ఒకటి ఉంటాయి. ఇందులో పెద్ద స్టీరింగ్‌ను రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ఉపయోగించాలి, దానిపై ఉండే చిన్న స్టీరింగ్‌ను గాలిలో ఫ్లయింగ్ కారును కంట్రోల్ చేసేందుకు వినియోగించాలి.

ప్రొడక్షన్ వెర్షన్ ఫ్లయింగ్ కారు

ఏరోమొబిల్ 3.0 ఫ్లయింగ్ కారు ఫ్రేమ్‌ను స్టీల్‌తో తయారు చేశారు, దీని బాడీని కార్భన్ ఫైబర్ పదార్థంతో తయారు చేశారు. ఫలితంగా దీని తక్కువ బరువును కలిగి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, October 15, 2014, 15:12 [IST]
English summary
The AeroMobil 2.5 prototype has been successfully tested for take-off, flight and landing. The company will, therefore, unveil the world's first production ready flying car, the AeroMobil 3.0, on October 29, 2014 at the Pioneers Festival in Austria. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+