ప్రపంచంలో కెల్లా అతిచిన్న లగ్జరీ క్యాంపర్ వ్యాన్ 'మినీ క్లబ్‌వ్యాన్ క్యాంపర్'

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూకి చెందిన లగ్జరీ స్మాల్ కార్ బ్రాండ్ మినీ ఇటీవలే 'మినీ క్లబ్‌వ్యాన్ క్యాంపర్' (Mini Clubvan Camper) అనే ఓ అధునాత వాహనాన్ని ఆవిష్కరించింది. వారాతంపు సెలవుల్లో విహారయాత్రలకు వెళ్లే వ్యక్తులను దృష్టిలో ఉంచుకొని, వారి ప్రయాణానికి కావల్సిన అన్ని వసతులను ఈ కారులో ఆఫర్ చేసే విధంగా కంపెనీ ఈ కొత్త వాహనాన్ని తీర్చిదిద్దింది.

కంపెనీ అందిస్తున్న మినీ క్లబ్‌వ్యాన్ మోడల్ ఆధారంగా చేసుకొని ఈ మినీ క్లబ్‌వ్యాన్ క్యాంపర్‌ను తయారు చేశారు. ఇందులో ఒక వ్యక్తి హాయిగా, సుఖంగా నిద్రించేందుకు కావల్సిన ఏర్పాట్లు, పొడగించుకోదగిన చిన్నపాటి కిచెన్, స్టవ్, ఫ్రిడ్జ్ వంటి సకల సదుపాయాలను ఈ కారులో అమర్చారు. ప్రపంచంలో కెల్లా అతిచిన్న లగ్జరీ క్యాంపర్ వ్యాన్‌గా నిలిచిన ఈ 'మినీ క్లబ్‌వ్యాన్ క్యాంపర్' విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

మినీ క్లబ్‌వ్యాన్ క్యాంపర్

మినీ క్లబ్‌వ్యాన్ క్యాంపర్ ప్రపంచంలో కెల్లా అతిచిన్న లగ్జరీ క్యాంపర్ వ్యాన్. వారాంతాల్లో దూరప్రయాణాలు, విహారయాత్రలు చేయాలనుకునే వ్యక్తుల కోసం దీనిని తయారు చేశారు.

మినీ క్లబ్‌వ్యాన్ క్యాంపర్

మినీ అందిస్తున్న క్లబ్‌వ్యాన్ మోడల్ ఆధారంగా తయారు చేసిన ఈ క్లబ్‌వ్యాన్ క్యాంపర్‌లో ఓ చిన్న కిచెన్, స్టవ్, ఫ్రిడ్జ్, టెలివిజన్, హీటర్, గ్లాస్ రూఫ్, ఒక వ్యక్తి కోసం బెడ్ వంటి సదుపాయాలు ఉన్నాయి.

మినీ క్లబ్‌వ్యాన్ క్యాంపర్

ఇందులో వినోదం కోసం ఓ టెలివిజన్, చల్లటి వాతావరణంలో వెచ్చగా ఉండేందుకు ఓ హీటర్, వెంటిలేషన్ లేదా రాత్రివేళల్లో నక్షత్రాలను వీక్షించేందుకు గ్లాస్ రూఫ్ ఉంటాయి.

మినీ క్లబ్‌వ్యాన్ క్యాంపర్

'వెర్సటైల్ హోమ్ ఆన్ వీల్స్'గా వ్యాఖ్యానించే ఈ కాన్సెప్ట్ మోడల్‌లో, స్నానం చేయటం కోసం ఓ హ్యాండ్‌హోల్డ్ షవర్ కూడా ఉంటుంది.

మినీ క్లబ్‌వ్యాన్ క్యాంపర్

మినీ క్లబ్‌వ్యాన్ క్యాంపర్‌‌లో ఒక వ్యక్తి నిద్రించేందుకు మాత్రమే చోటు ఉంటుంది. మీరు చూసినట్లయితే, డ్రైవర్ సీటుకు పక్కన ఉండే ప్యాసింజర్ సీటును తొలగించి, దాని స్థానంలో వెనుకగా ఓ బెడ్‌ను ఏర్పాటు చేశారు.

మినీ క్లబ్‌వ్యాన్ క్యాంపర్

మినీ ఆవిష్కరించిన మూడు కాన్సెప్ట్ వాహనాల్లో ఒకటైన క్లబ్‌వ్యాన్ క్యాంపర్‌లో షవర్ సౌకర్యం ఉంది కానీ, టాయలెట్ మాత్రం లేదు.

మినీ క్లబ్‌వ్యాన్ క్యాంపర్

వారాతంపు సెలవుల్లో విహారయాత్రలకు వెళ్లే వ్యక్తులను దృష్టిలో ఉంచుకొని, వారి ప్రయాణానికి కావల్సిన అన్ని వసతులను ఈ కారులో ఆఫర్ చేసే విధంగా కంపెనీ ఈ కొత్త వాహనాన్ని తీర్చిదిద్దింది.

మినీ క్లబ్‌వ్యాన్ క్యాంపర్

ఇందులో ఒక వ్యక్తి హాయిగా, సుఖంగా నిద్రించేందుకు కావల్సిన ఏర్పాట్లు, పొడగించుకోదగిన చిన్నపాటి కిచెన్, స్టవ్, ఫ్రిడ్జ్ వంటి సకల సదుపాయాలను అమర్చారు.

మినీ క్లబ్‌వ్యాన్ క్యాంపర్

ప్యాసింజర్ సీటును తొలగించి, ఆ స్థలాన్ని అదనపు లగేజ్ దాచుకునేందుకు అనువుగా తయారు చేశారు.

More from DriveSpark

Article Published On: Monday, October 28, 2013, 16:12 [IST]
English summary
BMW's own luxury small car brand the Mini has unveiled the world's smallest luxury camper van called 'Clubvan Camper'. This concept car is designed for a single person going away for the weekend.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+