యమహా ఫ్యాసినో మిస్ దివా యూనివర్స్ 2014 ఫైనలిస్ట్స్
జపనీస్ టూవీలర్ కంపెనీ యమహా గడచిన సంవత్సరం 'ఫెమినా మిస్ ఇండియా కాంటెస్ట్'ను అధికారిక భాగస్వామిగా వ్యవరిస్తే, ఈ ఏడాది 'ఫ్యాసినో మిస్ దివా యూనివర్స్ 2014'కు అధికారిక భాగస్వామిగా వ్యవరిస్తోంది. కాగా.. ఈ కాంటెస్ట్‌కు సంబంధించి ఇటీవలే ఢిల్లీలో నిర్వహించిన ఆడిషన్స్ పూర్తయ్యాయి. ఇందులో మొత్తం ఆరుగు అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ అయ్యారు.
ఇవి కూడా చూడండి: యమహా రే ఫెమినా మిస్ ఇండియా 2013 కాంటెస్ట్ బ్యూటీస్
యమహా ఫ్యాసినో మిస్ దివా యూనివర్స్ 2014 కోసం మొత్తం 108 మంది యువతులు రిజిస్టర్ చేసుకున్నారు. వీరందరికీ న్యూఢిల్లీలోని సామ్రాట్ హోటల్‌లో ఆడిషన్స్ నిర్వహించారు. కొన్ని కాంపిటీటివ్ రౌండ్స్ అనంతరం, కేవలం 6 గురు మాత్రమే ముంబైలో జరగబోయే నేషనల్ రౌండ్‌కు ఎన్నికయ్యారు. వీరిలో ప్రియాంక ఖత్రిని 'మిస్ ఫ్యాసినో'గా డిక్లేర్ చేశారు.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

మిస్ యూనివర్స్ ఫ్రాంచైజీగా మిస్ దివా కాంటెస్ట్‌ను గడచిన సంవత్సరంలో ప్రారంభించారు.

మిస్ దివా కోసం యమహా మోటార్ ఇండియా సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకొని, జులై 31, 2014వ తేదీ నుంచి నేషనల్ వైడ్ ఆడిషన్స్ నిర్వహించారు.

మిస్ దివా 2014లో విజేతగా నిలిచిన మోడల్, ఇండియా తరఫున మిస్ యూనివర్స్ 2014 కాంటెస్ట్‌లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంటుంది.

'మిస్ ఫ్యాసినో'గా డిక్లేర్ అయిన ప్రియాంక ఖత్రి.

యమహా ఫ్యాసినో మిస్ దివా యూనివర్స్ 2014 ఫైనలిస్ట్స్

యమహా రే స్కూటర్‌తో ఫొటోలకు ఫోజిలిస్తున్న ప్రియాంక ఖత్రి.


Click it and Unblock the Notifications








