హ్యుందాయ్ కార్లపై ఇయర్ ఎండ్ సేల్ డిస్కౌంట్స్

By Ravi

సరసమైన ధరకే కొత్త కారును సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇదే సరైన సమయం. ఇయర్ ఎండ్ సందర్భంగా, కార్ కంపెనీలు తమ స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు, అమ్మకాల లక్ష్యాన్ని చేరుకునేందుకు కార్లపై భారీ తగ్గింపును, ప్రోత్సాహకాలను ప్రకటిస్తుంటాయి. ఇప్పటికే అనేక కార్ కంపెనీలు, డీలర్లు వాహనాలపై మంచి డీల్స్‌ని ఆఫర్ చేస్తున్నాయి.

మరికొద్ది రోజుల్లో క్రిస్మస్ పండుగ కూడా రానున్న నేపథ్యంలో, ఈ ఫెస్టివ్ సీజన్ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు కార్ మేకర్లు భారీ డిస్కౌంట్లను అందిస్తున్నారు. తాజాగా హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా తమ అన్ని రకాల కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.

హ్యుందాయ్ అందిస్తున్న శాంత్రో మొదలుకొని లగ్జరీ మోడల్ సొనాటా వరకూ ఈ తగ్గింపులను అందిస్తోంది. డిసెంబర్ నెలాఖరు లోపుగా హ్యుందాయ్ కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు ఈ డిస్కౌంట్లను పొందవచ్చు.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

హ్యుందాయ్ కార్లపై డిస్కౌంట్స్

తర్వాతి స్లైడ్‌లలో వివిధ మోడళ్లపై హ్యుందాయ్ అందిస్తున్న ఆఫర్లను పరిశీలించండి.

(ఈ డిస్కౌంట్ మొత్తంలో క్యాష్ డిస్కౌంట్, కార్పోరేట్ డిస్కౌంట్ వటి పలు అంశాలు కలిసి ఉంటాయి)

శాంత్రో: రూ.38,500 సేవింగ్స్

శాంత్రో: రూ.38,500 సేవింగ్స్

హ్యుందాయ్ అందిస్తున్న శాంత్రో హ్యాచ్‌బ్యాక్‌‍పై కంపెనీ రూ.38,500 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది.

ఇయాన్: రూ.43,000 సేవింగ్స్

ఇయాన్: రూ.43,000 సేవింగ్స్

హ్యుందాయ్ అందిస్తున్న ఇయాన్ హ్యాచ్‌బ్యాక్‌‍పై కంపెనీ రూ.43,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది.

ఐ10: రూ.42,500 సేవింగ్స్

ఐ10: రూ.42,500 సేవింగ్స్

హ్యుందాయ్ అందిస్తున్న ఐ10 హ్యాచ్‌బ్యాక్‌‍పై కంపెనీ రూ.42,500 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది.

గ్రాండ్ ఐ10

గ్రాండ్ ఐ10

హ్యుందాయ్ అందిస్తున్న పెట్రోల్ వెర్షన్ గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్‌‍పై రూ.14,000లు మరియు డీజిల్ వెర్షన్ గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్‌‍పై రూ.44,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది.

ఎక్సెంట్

ఎక్సెంట్

హ్యుందాయ్ అందిస్తున్న పెట్రోల్ వెర్షన్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్‌పై రూ.15,000లు మరియు డీజిల్ వెర్షన్ ఎక్సెంట్‌పై రూ.48,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది.

వెర్నా

వెర్నా

హ్యుందాయ్ అందిస్తున్న పెట్రోల్ వెర్షన్ వెర్నా మిడ్-సైజ్ సెడాన్‌పై రూ.43,000లు మరియు డీజిల్ వెర్షన్ వెర్నాపై రూ.48,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది.

ఎలాంట్రా

ఎలాంట్రా

హ్యుందాయ్ అందిస్తున్న పెట్రోల్ వెర్షన్ ఎలాంట్రా ప్రీమియం సెడాన్‌పై రూ.70,000లు మరియు డీజిల్ వెర్షన్ ఎలాంట్రాపై రూ.70,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది.

సొనాటా

సొనాటా

హ్యుందాయ్ అందిస్తున్న లగ్జరీ సెడాన్ సొనాటాపై కంపెనీ రూ.1.60 లక్షల విలువైన ప్రయోజనాలను అందిస్తోంది.

(ఈ ఆఫర్లకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని అధీకృత హ్యుందాయ్ డీలరును సంప్రదించండి)

More from DriveSpark

Article Published On: Tuesday, December 9, 2014, 15:22 [IST]
English summary
Hyundai Motor India is offering huge benefits like cash discounts, exchange bonuses, corporate discounts on its cars. These offers valid from December end.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+