కార్లపై ఇయర్ ఎండ్ సేల్ డిస్కౌంట్స్
ఇయర్ ఎండ్ వచ్చిందంటే చాలు కార్ కంపెనీలు తమ స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు, అమ్మకాల లక్ష్యాన్ని చేరుకునేందుకు కార్లపై భారీ తగ్గింపును, ప్రోత్సాహకాలను ప్రకటిస్తుంటాయి. ఇప్పటికే, అనేక కార్ కంపెనీలు, డీలర్లు వాహనాలపై మంచి డీల్స్‌ని ఆఫర్ చేస్తున్నాయి.
మరికొద్ది రోజుల్లో క్రిస్మస్ పండుగ కూడా రానున్న నేపథ్యంలో, ఈ ఫెస్టివ్ సీజన్ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు కార్ మేకర్లు భారీ డిస్కౌంట్లను అందిస్తున్నారు. ఈ కథనంలో ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టాప్5 బెస్ట్ డీల్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టాప్5 బెస్ట్ డీల్స్ గురించి తెలుసుకోండి.

ఫోర్డ్ ఫిగో: రూ.54,000 బెనిఫిట్స్
అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ ఇండియా అందిస్తున్న చిన్న కారు ఫోర్డ్ ఫిగోపై కంపెనీ రూ.54,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.20,000 ఎక్సేంజ్ బోనస్, రూ.29,000 ఉచిత ఇన్సూరెన్స్, రూ.5,000 లాయల్టీ బోనస్ కలిసి ఉంటాయి.

షెవర్లే బీట్: రూ.65,000
జనరల్ మోటార్స్ ఇండియా విక్రయిస్తున్న చిన్న కారు షెవర్లే బీట్‌పై కంపెనీ మొత్తం రూ.65,000 విలువైన ప్రయోజనాలను ఆఫర్ చేస్తోంది. ఇందులో రూ.25,000 ఎక్సేంజ్ బోనస్, రూ.20,000 బజాజ్ అలయంజ్ ఇన్సూరెన్స్ (3 ఏళ్ల కవరింగ్), రూ.20,000 లాయల్టీ బోనస్ కలిసి ఉంటాయి.

హ్యుందాయ్ ఇయాన్: రూ.42,000
హ్యుందాయ్ మోటార్ ఇండియా విక్రయిస్తున్న చిన్న కారు ఇయాన్‌పై కంపెనీ మొత్తం రూ.42,000 ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.30,000 ఎక్సేంజ్ బోనస్, రూ.12,000 వరకూ ఉచిత ఇన్సూరెన్స్ కలిసి ఉంటాయి.

హ్యుందాయ్ శాంటాఫే: రూ.2 లక్షలు
హ్యుందాయ్ మోటార్ ఇండియా విక్రయిస్తున్న పవర్‌ఫుల్ ఎస్‌యూవీ హ్యుందాయ్ శాంటాఫే కంపెనీ ఏకంగా రూ.2 లక్షల విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. కొత్త శాంటాఫే మార్కెట్లోకి రానున్న నేపథ్యంలో, ఇంతటి భారీ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. ఈ డిస్కౌంట్ కోసం కస్టమర్లు డీలర్లతో బేరమాడాల్సి ఉంటుంది.

మారుతి వ్యాగన్ఆర్
మారుతి సుజుకి ఇండియా అందిస్తున్న టాల్ బాయ్ కారు వ్యాగన్ఆర్‌పై కంపెనీ డీలర్లు సుమారు రూ.50,000 విలువైన ప్రయోజనాలను అందిస్తున్నారు. ఇందులో రూ.20000 ఎక్సేంజ్ బోనస్, రూ.30,000 కన్జ్యూమర్ ఆఫర్ కలిసి ఉన్నాయి.

గమనిక: ఈ డిస్కౌంట్లు సిటీ, ప్రాంతాన్ని బట్టి మారే అవకాశం ఉంటుంది. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని అధీకృత డీలర్లను సంప్రదించండి.


Click it and Unblock the Notifications








