ఇయర్ ఎండ్ సేల్: టాటా కార్లపై భారీ డిస్కౌంట్స్

By Ravi

డిసెంబర్ వచ్చిందంటే చాలు.. కార్ల కంపెనీలు తమ వాహనాలపై భారీ తగ్గింపులను ప్రకటిస్తుంటాయి. ఇప్పటికే పలు కార్ కంపెనీలు తమ వాహనాలపై ఇయర్ ఎండ్ డిస్కౌంట్లను ప్రకటిస్తుంటే, తాజాగా టాటా మోటార్స్ కూడా ఈ జాబితాలోకి వచ్చే చేరింది.

కొనుగోలుదారులను ఆకర్షించేందుకు టాటా మోటార్స్ ఈ డిసెంబర్ నెలలో తమ ఉత్పత్తులపై భారీ తగ్గింపులను, వివిధ ప్రోత్సాహకాలను ప్రకటించింది. టాటా మోటార్స్ విక్రయిస్తున్న నానో కారు మొదలుకొని ఆరియా ఎమ్‌పివి వరకు వివిధ మోడళ్లపై కంపెనీ డిస్కౌంట్లను అందిస్తోంది.

అయితే, కంపెనీ ఇటీవలే విడుదల చేసిన జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌పై మాత్రం ఎలాంటి డిస్కౌంట్లను ప్రకటించలేదు. మరి టాటా మోటార్స్ వివిధ మోడళ్లపై అందిస్తున్న ఆఫర్ల వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

టాటా కార్లపై భారీ డిస్కౌంట్స్

తర్వాతి స్లైడ్‌లలో టాటా మోటార్స్ అందిస్తున్న వివిధ మోడళ్లపై కంపెనీ ప్రకటించిన ఆఫర్లను చూడండి.

టాటా నానో ట్విస్ట్

టాటా నానో ట్విస్ట్

టాటా నానో ట్విస్ట్ (పవర్ స్టీరింగ్) మోడల్‌పై గరిష్టంగా రూ.61,000 వరకు బెనిఫిట్లను టాటా మోటార్స్ ఆఫర్ చేస్తోంది.

ఈ మోడల్ ప్రధాన ఫీచర్లు:

* పవర్ స్టీరింగ్

* బెస్ట్ ఇన్ క్లాస్ ఏసి

* బెస్ట్ ఇన్ క్లాస్ మైలేజ్ (25 కెఎమ్‌పిఎల్)

* 4 ఏళ్లు లేదా 60,000 కి.మీ. వారంటీ

టాటా ఇండికా ఈవి2

టాటా ఇండికా ఈవి2

టాటా ఇండికా ఈవి2 మోడల్‌పై గరిష్టంగా రూ.55,000 వరకూ బెనిఫిట్లను టాటా మోటార్స్ ఆఫర్ చేస్తోంది.

ఈ మోడల్ ప్రధాన ఫీచర్లు:

* రీఫైన్డ్ సిఆర్4 ఇంజన్ (25 కెఎమ్‌పిఎల్)

* కొత్త ఎఫ్-షిఫ్ట్ గేర్‌బాక్స్

* డ్యూయెల్ టోన్ ఇంటీరియర్స్

* డ్యుయో ఫ్లోట్ సస్పెన్షన్

టాటా విస్టా

టాటా విస్టా

టాటా విస్టా మోడల్‌పై గరిష్టంగా రూ.55,000 బెనిఫిట్లను టాటా మోటార్స్ ఆఫర్ చేస్తోంది.

ఈ మోడల్ ప్రధాన ఫీచర్లు:

* టచ్‌స్క్రీన్ మల్టీమీడియా సిస్టమ్, జిపిఎస్

* రీఫైన్డ్ 75 పిఎస్ క్వాడ్రాజెట్ డీజిల్ ఇంజన్

* డ్రైవ్ ప్రో కన్సోల్, అడ్వాన్స్డ్ డిఐఎస్

టాటా ఇండిగో ఈసిఎస్

టాటా ఇండిగో ఈసిఎస్

టాటా ఇండిగో ఈసిఎస్ మోడల్‌పై గరిష్టంగా రూ.55,000 బెనిఫిట్లను టాటా మోటార్స్ ఆఫర్ చేస్తోంది.

ఈ మోడల్ ప్రధాన ఫీచర్లు:

* రీఫైన్డ్ సిఆర్4 ఇంజన్ (25 కెఎమ్‌పిఎల్)

* కొత్త డ్యుయో ఫ్లోట్ సస్పెన్షన్

* అధునాతన మ్యూజిక్ సిస్టమ్

టాటా మూవస్

టాటా మూవస్

టాటా మూవస్ ఎమ్‌పివిని కంపెనీ కేవలం రూ.6.99 లక్షల ప్రత్యేక ధరకే (ఎక్స్-షోరూమ్) విక్రయిస్తోంది.

ఈ మోడల్ ప్రధాన ఫీచర్లు:

* 2.2 లీటర్ వేరికార్ ఇంజన్, 120 పిఎస్ పవర్

* అత్యుత్తమ మైలేజ్ (15.16 కెఎమ్‌పిఎల్)

* 7/8/9 సీటర్ ఆప్షన్స్

టాటా సుమో గోల్డ్

టాటా సుమో గోల్డ్

టాటా సుమో గోల్డ్ మోడల్‌పై గరిష్టంగా రూ.55,000 బెనిఫిట్లను టాటా మోటార్స్ ఆఫర్ చేస్తోంది.

ఈ మోడల్ ప్రధాన ఫీచర్లు:

* పవర్‌ఫుల్ 3లీటర్ సిఆర్4 డీజిల్ ఇంజన్

* రూఫ్ మౌంటెడ్ డ్యూయెల్ ఏసి

* డబుల్ విష్‌బోన్ సస్పెన్షన్

టాటా సఫారీ స్టోర్మ్

టాటా సఫారీ స్టోర్మ్

టాటా సఫారీ స్టోర్మ్ వేరియంట్‌పై గరిష్టంగా రూ.96,000 బెనిఫిట్లను టాటా మోటార్స్ ఆఫర్ చేస్తోంది.

ఈ మోడల్ ప్రధాన ఫీచర్లు:

* పవర్‌ఫుల్ 2.2లీ వేరికార్ ఇంజన్

* 140 పిఎస్ పవర్, 320 ఎన్ఎమ్ టార్క్

* 4x4 ఈఎస్ఓఎఫ్ (ఎలక్ట్రానిక్ షిఫ్ట్-ఆన్-ఫ్లై)

* 3 ఏళ్లు లేదా 1,00,000 కి.మీ. ఇంజన్ వారంటీ

టాటా ఆరియా

టాటా ఆరియా

టాటా ఆరియా ఎమ్‌పివి కంపెనీ కేవలం రూ.9.95 లక్షల ప్రత్యేక ధరకే (ఎక్స్-షోరూమ్) కంపెనీ విక్రయిస్తోంది.

ఈ మోడల్ ప్రధాన ఫీచర్లు:

* పవర్‌ఫుల్ 2.2లీ వేరికార్ ఇంజన్

* 150 పిఎస్ పవర్, 320 ఎన్ఎమ్ టార్క్

* బెస్ట్ ఇన్ క్లాస్ మైలేజ్ (15.05 కెఎమ్‌పిఎల్)

* 3 ఏళ్లు లేదా 1,00,000 కి.మీ. ఇంజన్ వారంటీ

More from DriveSpark

Article Published On: Wednesday, December 17, 2014, 11:17 [IST]
English summary
Tata Motors has come up with an exciting savings scheme for the month of December 2014. Take a look.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+