బజాజ్ ఆటోరిక్షాలకు చెక్ పెట్టేందుకు వస్తున్న జీబీ త్రీవీలర్

By Ravi

స్వీడన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ క్లీన్ మోషన్ ఏసియా మార్కెట్లపై కన్నేసింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను అందిస్తున్న క్లీన్ మోషన్ ఇండోనేషియా రాజధానిలో తిరుగుతున్న బజాజ్ ఆటో రిక్షాలకు చెక్ పెట్టేందుకు తమ ఎలక్ట్రిక్ త్రీవీలర్ 'జెడ్‌బీ' (జీబీ అని పలకాలి) (Zbee)ని సిద్ధం చేస్తోంది.

ప్రస్తుతానికి ఈ ఎలక్ట్రిక్ త్రీవీలర్ ఇండినేషియా మార్కెట్లోనే విడుదల కానుంది. అయితే, ఇండోనేషియా వరకు వచ్చిన ఈ స్వీడన్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ, భవిష్యత్తులో భారత మార్కెట్‌కు కూడా వచ్చే మెండుగా అవకాశాలున్నాయి. ఇప్పటికే పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సతమవుతున్న మనలాంటి దేశాలకు ఈ వాహనాలు ఎంతైనా అవసరం.

మరి ఈ క్లీన్ మోషన్ జీబీ ఎలక్ట్రిక్ త్రీవీలర్ విశేషాలేంటో క్రింది ఫొటో ఫీచర్‌లో తెలుసుకుందాం రండి.

ఆవిష్కరణ

ఆవిష్కరణ

జీబీ ఎలక్ట్రిక్ త్రీవీలర్‌ను ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగిన రిటెక్ టెక్నాలజీ ఎక్స్‌‌పో-18లో ఆ దేశ అధ్యక్షుడు సుసిలో బాంబ్యాంగ్ యుధోయోనో ఆవిష్కరించారు.

ఎలక్ట్రిక్ మోటార్

ఎలక్ట్రిక్ మోటార్

క్లీమ్ మోషన్ సంస్థ తయారు చేసిన ఈ జీబీ ఎలక్ట్రిక్ త్రీవీలర్ 4 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ సాయంతో నడుస్తుంది.

బ్యాటరీ

బ్యాటరీ

ఈ ఎలక్ట్రిక్ బ్యాటరీ పవర్‌తో పనిచేస్తుంది. ఈ ప్రతి కిలోమీటరుకు 40 Wh విద్యుత్‌ను వినియోగించుకుంటుంది. ఫుల్ చార్జ్‌పై ఇందులో 50 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చు.

గరిష్ట వేగం.

గరిష్ట వేగం.

దాదాపు 230 కేజీల బరువు కలిగి ఉండే జీబీ ఎలక్ట్రిక్ త్రీవీలర్ గంటకు గరిష్టంగా 45 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

సిటీ రోడ్స్

సిటీ రోడ్స్

ఈ వేగం సిటీ రోడ్లకు చక్కగా సరిపోతుంది. తక్కువ దూరాలు, అర్బన్ ట్రాన్స్‌పోర్టేషన్ల కోసం ఈ ఎలక్ట్రిక్ త్రీవీలర్లను ఉపయోగించుకోవచ్చు.

కాంపాక్ట్ డిజైన్

కాంపాక్ట్ డిజైన్

దీని కాంపాక్ట్ డిజైన్ వలన ఇది రోడ్డుపై కానీ లేదా పార్కింగ్ స్థలాల్లో కానీ ఎక్కువ స్థలాన్ని ఆక్రమించదు.

ఎకో ఫ్రెండ్లీ

ఎకో ఫ్రెండ్లీ

ఇది పూర్తిగా పర్యావరణ సాన్నిహిత్యమైన ఎలక్ట్రిక్ వాహనం. ఈ వాహనాన్ని ఉపయోగించడం వలన పర్యావరణానికి మేలు జరగటమే కాకుండా ఉపయోగించే వారికి ఆదాయపరంగా కూడా మంచి లాభాలను తెచ్చిపెట్టగలదు.

అంచనా ధర

అంచనా ధర

తొలుత ఇండోనేషియా మార్కెట్లో విడుదల కానున్న జీబీ ఎలక్ట్రిక్ త్రీవీలర్ ధ 80 మిలియన్ ఇండోనేషియన్ రుపయ్య (మన దేశ కరెన్సీలో సుమారు రూ.4.88 లక్షలు).

ఏసియా మార్కెట్లు

ఏసియా మార్కెట్లు

స్వీడన్ కంపెనీ క్లీమ్ మోషన్ తమ జీబీ ఎలక్ట్రిక్ త్రీవీలర్‌ను కేవలం ఇండోనేషియా మార్కెట్లలోనే కాకుండా, ఈ వాహనాలకు అవకాశాలు ఎక్కువగా ఉండే ఏసియా మార్కెట్లలో దీనిని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, September 4, 2013, 10:07 [IST]
English summary
Swedish electric vehicle maker Clean Motion was looking to enter the Indonesian market with its Zbee electric three wheeler.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+