ఆగస్ట్ 12న టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్ విడుదల

By Ravi

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఈ ఏడాది ఆరంభంలో ఆవిష్కరించిన తమ తొలి కాంపాక్ట్ సెడాన్ 'టాటా జెస్ట్' (Tata Zest) విడుదలకు ముహుర్తం ఖరారైంది. మేము ఇది వరకు చెప్పినట్లుగానే, టాటా మోటార్స్ తమ జెస్ట్‌ను ఆగస్ట్ నెలలోనే విడుదల చేయనుంది. ఆగస్ట్ 12, 2014వ తేదీన ఈ కారును విడుదల చేస్తామని కంపెనీ ప్రకటించింది.

ఇది కూడా చదవండి: ఆగస్ట్ 20న టీవీఎస్ స్కూటీ జెస్ట్ విడుదల

మోడ్రన్ డిజైన్‌కి శ్రీకారం చుడుతూ అభివృద్ధి చేసిన సరికొత్త టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‍‌‌పై కంపెనీ అనేక ఆశలు పెట్టుకుంది. టాటా జెస్ట్ ప్రచారం కంపెనీ జోరుగా ఆన్‌లైన్ క్యాంపైన్ కూడా సాగిస్తోంది. మరోవైపు టాటా మోటార్స్ ఆన్‌లైన్ ద్వారా ఈ మోడల్‌కు బుకింగ్‌లను కూడా స్వీకరిస్తోంది. కేవలం 21,000 బయానా (అడ్వాన్స్) చెల్లించి కస్టమర్లు తమ టాటా జెస్ట్ సెడాన్‌ను బుక్ చేసుకోవచ్చు.

Zest By Tata Motors

టాటా జెస్ట్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. పెట్రోల్ వెర్షన్లలో టాటా మోటార్స్ ఇటీవలే ఆవిష్కరించిన సరికొత్త 1.2 లీటర్, టర్బో చార్జ్డ్, రెవట్రోన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 85 పిఎస్‌ల శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్పోర్ట్స్, ఎకానమీ, సిటీ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్‌తో లభిస్తుంది.

ఇది కూడా చదవండి: ఫియట్ పుంటో ఇవో విడుదల, ధరలు

డీజిల్ వెర్షన్లలో మాత్రం 1.3 లీటర్, క్వాడ్రాజెట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టాటా జెస్ట్ ధరలు వేరియంట్‌ను బట్టి ధర రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా. ఈ కారుకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

ఈ వీడియో చూశారా..
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/RQGXsg0AJMU" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Wednesday, August 6, 2014, 9:25 [IST]
English summary
India's most trusted four wheeler manufacturer Tata Motors is all set to change its product portfolio. The Zest will be their first product that breaks the traditional Tata design. The Zest will be launched in India on the 12th of August, 2014.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+