ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యజమానులకు గుడ్‌న్యూస్.. రూ. 27,000 విలువైన ప్యాకేజ్ ఫ్రీ.. కొద్ది రోజులే ఛాన్స్.!!
హీరో మోటోకార్ప్ తన విడా(Hero Vida Electric Scooter) ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ప్రత్యేక ఆఫర్‌ను తీసుకువచ్చింది. ఈ ఆఫర్ ద్వారా కస్టమర్లు రూ. 27,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. మరి కస్టమర్లు ఈ ఆఫర్‌ను ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు. పూర్తి సమాచారం ఈ కథనంలో..
భారత మార్కెట్లో హీరో Vida V1 ప్రో వేరియంట్‌తో పాటు Vida V1 ప్లస్ వేరియంట్‌ను విక్రయిస్తోంది. Vida V1 ప్లస్ వేరియంట్ ధర ధర రూ. 97,800 కాగా... టాప్ స్పెక్ Vida V1 ప్రో ధర రూ. 1.26 లక్షలుగా ఉంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.

గతంలో నిలిపివేసిన Vida V1 ప్లస్‌ను హీరో మోటోకార్ప్ మళ్లీ తీసుకురావడంతో.. కస్టమర్లను ఆకర్షించే పనిలో ఉంది. ఈ క్రమంలో Vida V1 Pro యజమానుల కోసం రూ. 27,000 విలువైన అడ్వాంటేజ్ ప్యాక్‌ను ఉచితంగా అందజేస్తామని సంస్థ ప్రకటించింది. హీరో కంపెనీ ఈ ఆఫర్‌ను ఏప్రిల్ 30, 2024 వరకు అందుబాటులో ఉంచుతుంది.
Vida V1 Pro అడ్వాంటేజ్ ప్లాన్ ద్వారా యజమానులకు పొడిగించిన బ్యాటరీ వారంటీ వ్యవధి (5 సంవత్సరాలు లేదా 60,000 కి.మీ వారంటీ), ఉచిత సర్వీసింగ్ మరియు ఉచిత ఛార్జింగ్ సౌకర్యాన్ని అందిస్తున్నట్లు తెలిపింది. వీటితో పాటు 24X7 రోడ్ సైడ్ అసిస్టెన్స్ మరియు సెల్ ఫోన్ కనెక్టివిటీని ఉచితంగా అందిస్తుంది. సంస్థ యొక్క వర్క్‌షాప్‌ల ద్వారా ఐదేళ్ల పాటు ఉచిత సర్వీసులను కూడా సద్వినియోగం చేసుకోవచ్చు.

Vida V1 Pro ఇ స్కూటర్ విషయానికొస్తే.. పూర్తి ఛార్జ్‌పై 110 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. ఇందులో 3.94 kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. గరిష్ఠంగా గంటకు 80 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఇది ఎకో, రైడ్, స్పోర్ట్ మరియు కస్టమ్ రైడింగ్ మోడ్‌లతో రైడర్ ఫ్రెండ్లీగా ఉంటుంది.
ఫీచర్ల విషయానికొస్తే.. Vida V1 ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 7-అంగుళాల TFT స్క్రీన్, LED లైట్లు, ముందు భాగంలో డిస్క్ మరియు వెనుకవైపు డ్రమ్ బ్రేక్ రెండు వేరియంట్‌లను కలిగి ఉంది. టాప్ స్పెక్ ఫీచర్లతో అందుబాటులో ఉన్న ఈ స్కూటర్‌పై కస్టమర్ల కోసం రూ. 27,000 విలువైన అడ్వాంటేజ్ ప్లాన్‌ను హీరో ఉచితంగా అందిస్తోంది.

ఇక హీరో Vida బేస్ వేరియంట్ V1 Plusలో 3.44 kWh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. పూర్తి ఛార్జ్‌పై 100 కి.మీ వరకు రేంజ్‌ను అందిస్తుంది. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 5 గంటల 15 నిమిషాల సమయం పడుతుంది. ఇది రెండు బ్యాటరీ ప్యాక్‌లతో అందుబాటులో ఉంటుంది.
హీరో Vida V1 Plus వేరియంట్ గరిష్ఠంగా గంటకు 80 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. కేవలం 3.4 సెకన్లలో సున్నా నుంచి 40 కి.మీల వేగాన్ని అందుకుంటుంది. రైడర్ల కోసం ఎకో, రైడ్ మరియు స్పోర్ట్ రైడింగ్ మోడ్‌లను కూడా అందిస్తోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








