ఇంజన్‌ను ఐడిల్‌గా ఉంచకండి.. ఇంధనం ఆదా చేసుకోండి..

Car Breakdown
కారును కొనగానే సరిపోదు, దాన్ని సరైన విధానంలో ఉపయోగించడం కూడా తెలుసుకోవాలి. అలాకాకుండా.. ఇష్టం వచ్చినట్లు ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఎలా పడితే అలా ఉపయోగిస్తే, సర్వీసింగ్‌ల కోసం వేలకు వేలు డబ్బులు వదిలించుకోక తప్పదు. సరే ఇదంతా అటుంచితే, కారు ఇంజన్ లైఫ్‌ను పెంచుకోవడాని, అలాగే ఇంధనాన్ని ఆదా చేసుకోవడాని ఉపయోగపడే కొన్ని చిట్కాలను ఈ కథనంలో తెలుసుకుందాం..!!!

వాస్తవానికి కారును రోజులో మొదటి సారి (ఫస్ట్ టైమ్) స్టార్ట్ చేసినప్పుడు కనీసం 30 సెకండ్ల పాటు ఐడిల్‌ (ఇంజన్‌ను రన్నింగ్‌లో ఉంచడం)గా ఉంచాలి. అలాగే స్టాప్ చేయడానికి ముందు కూడా ఇదే విధంగా 30 సెకండ్ల పాటు ఐడిల్‌గా ఉంచడం అవసరం. ఇలా చేయడం ద్వారా కారు ఇంజన్‌లో ఆయిల్ ప్రవహించి స్మూత్ రన్నింగ్‌కు సహకరిస్తుంది.

* అయితే, ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు లేదా కారును ఎక్కడైనా పక్కగా కొద్ది సమయం పాటు నిలపాల్సి వచ్చినప్పుడు దానిని అలాగే ఎక్కువసేపు ఐడిల్‌గా ఉంచకూడదు. అంటే.. ఇంజన్‌ను రన్నింగ్‌లో ఉంచకుండా స్విఫ్ చేయాలి అన్నమాట.

* ట్రాఫిక్‌‌లో కానీ లేదా మరేచోటైనా కానీ కారును 20 సెకండ్ల కన్నా ఎక్కువగా నిలపాల్సి వచ్చినప్పుడు, దాన్ని అలానే ఐడిల్‌లో ఉంచే కన్నా స్విఫ్ చేయడం మంచిది.

* కారును 10 సెకండ్ల కన్నా ఎక్కువగా ఐడిల్‌గా ఉంచడం వలన అయ్యే ఇంధన ఖర్చు, కారును స్టార్ట్ చేయడానికి కావలసిన ఇంధన ఖర్చు కన్నా ఎక్కువగా ఉంటుంది.

* అలాగే, రెండు నిమిషాలు కారు ఇంజన్ ఆన్‌లో ఉంటే (ఐడిల్‌గా ఉంటే) అయ్యే ఇంధన ఖర్చుతో సుమారు ఒక మైలు దూరం ప్రయాణించవచ్చు.

* తాజా పరిశోధనల ప్రకారం, సగటున ప్రతి వ్యక్తి తన కారును 5-10 నిమిషాల పాటు ఐడిల్‌గా ఉంచుతున్నారని చెబుతున్నాయి. అంటే.. ఈ లెక్కన ఎంత ఇంధనం వృధా అవుంతో ఊహించండి.

* కారును ఇలా ఎక్కువ సేపు ఐడిల్‌గా ఉంచడం వలన, ఇంజన్‌లోని విడిభాగాలు దెబ్బతినడం, సిలిండర్లు, స్పార్క్ ప్లగ్‌లు, ఎగ్జాస్ట్ సిస్టమ్ (సైలెన్సర్)లలో సమస్యలు తలెత్తడం జరుగుతాయి.

ఒక్కమాటలో చెప్పాలంటే.. కారు గమనంలో లేకుండా ఉండి, ఇంజన్ 10 సెకండ్ల కన్నా ఎక్కువ సేపు రన్నింగ్‌లో ఉంచాల్సి వచ్చినప్పుడు, ఇంజన్‌ను అలానే రన్నింగ్‌లో ఉంచడం కన్నా స్విచ్ ఆఫ్ చేయడం ఎంతో ఉత్తమం. ఇలా చేయడం వలన ఇంజన్ లైఫ్ టైమ్ పెరగడమే కాకుండా ఇంధనం కూడా ఆదా అవుతుంది. అసలే పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్న ప్రస్తుత రోజుల్లో ఈ చిట్కాలను పాటించడం ఎంతో ముఖ్యం.. మరి మీరేమంటారు...?

More from DriveSpark

Article Published On: Thursday, February 2, 2012, 16:26 [IST]
English summary
You can save lots of fuel by stopping your car engine instead of idling it at traffic signals. Research suggests you can travel as much as a mile with the fuel saved by not idling the engine for two minutes. Further, modern engines do not require idling to warm them.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+