డ్రైవింగ్ చేస్తున్నప్పు భూకంపం వస్తే పరిస్థితి ఏంటి..?

Cars In Tsunami
తాజాగా ఈరోజు మధ్యాహ్నం ఇండోనేషియాలో సంభవించిన భూకంపం దేశంలో కొత్త ప్రకంపనలను సృష్టిస్తోంది. ఇప్పటికే దేశంలోని కొన్ని తీరప్రాంతాలకు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేయటం జరిగింది. ఇటువంటి భయానక పరిస్థితులలో మిమ్మల్ని మీరు రక్షించుకోవడమే కాకుండా మీ వాహనాన్ని సురక్షితంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం..!!

1. ముందుగా మీరు భూకంప పరిస్థితుల్లో ఉన్నారని గుర్తుంచుకోండి. ఎందుకంటే, కొన్నిసారి కారులో రోడ్డుపై ప్రయాణిస్తున్న కారు కదలాడినప్పుడు (షేకింగ్) కారులో ఏమైన లోపం ఉందేమోనని మీరు సందేహపడి సాధారణంగానే ముందుకు సాగిపోయే ఆస్కారం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మీ జ్ఞానాన్ని ఉపయోగించి, చట్టు పక్కల వాతారవణాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. భూమి కంపించడం, రోడ్డుపై పగుళ్లు (క్రాక్స్) ఏర్పడటం వంటి అసాధారణ పరిస్థితులను పరిశీలించండి.

2. మీరు భూకంప పరిస్థితుల్లో ఉన్నారని నిర్ధారించుకున్న తక్షణమే రోడ్డుకు వీలైనంత పక్కగా మీ వాహనాన్ని తీసుకువెళ్లండి. ఈ పనిని వీలైనంత త్వరగా చేస్తూనే, మీ భద్రతపై ఓ కన్నేసి ఉంచండి. ఇటువంటి పరిస్థితుల్లో కంగారు పడి రోడ్డుపై ఇష్టం వచ్చినట్లు డ్రైవ్ చేయకండి. ఎందుకంటే రోడ్డుపై కేవలం మీరు మాత్రమే ప్రయాణిస్తుండరు కాబట్టి చుట్టపక్కల వచ్చే రద్దీని కూడా గమనించండి.

3. వీలైనంత వరకూ అండర్‌బ్రిడ్జ్‌లు, వంతెనలు, ఓవర్‌పాస్‌లు, భారీ సైన్ బోర్డులు, విద్యుత్ స్థంబాలు, పెద్ద పెద్ద వృక్షాలు వంటి వాటికి వీలైనంత దూరంగా ఉండండి. అలాగే, భవనాలు, ఇళ్లకు పక్కగా మీ వాహనాన్ని పార్క్ చేయకండి.

4. రోడ్డు చుట్ట ప్రక్కల మీ కారుపై పడే పెద్ద పెద్ద వస్తువులు ఏవీ లేవని నిర్ధారించుకున్న తర్వాత, వాహనాన్ని ఓ ప్రక్కగా నిలిపి ఇంజన్ ఆఫ్ చేసి హ్యాండ్‌బ్రేక్‌ను ఆన్ చేయండి.

5. మీ కారులోని రేడియో వంటి సమాచార ప్రసార సాధానాలను ఆన్ చేసి ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండండి.

6. భూమి కంపించడం (వణకడం) ఆగిపోయే వరకూ మీ వాహనంలోనే ఉండండి.

7. భూకంపం వచ్చి ఆగిపోయిన తర్వాత, కంగారు పడకుండా గుండె నిబ్బరంతో వ్యవరహించి, కారులో మీతో పాటుగా ప్రయాణిస్తున్న వారికి కూడా ధైర్యం చెప్పండి. భూమి కంపించడం నిలిచిపోయిన తర్వాత కారు లోనుండి క్రిందకు చుట్టూ ఉన్న పరిస్థితులను ఒక్కసారి పరిశీలించండి. ఎవరికైనా గాయాలు తగినట్లు అనిపిస్తే ప్రధమ చికిత్స చేయండి.

8. భూకంపం పూర్తిగా నిలిచిపోయిందని అధికారింగా ప్రకటించే వరకూ సురక్షితమైన ప్రదేశం దాటి వేరే చోటుకు వెళ్లకండి. భూకంపం నిలిచిపోయిన తర్వాత రోడ్లు పగళ్లు ఇచ్చి ఉంటాయి కాబట్టి ఇటువంటి రోడ్లపై అత్యంత జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. మీరు ఉన్న చోటు సురక్షితంగా ఉందనిపిస్తే అక్కడే మరికొంత సేపు ఉండటం ఉత్తమం. ఈలోపుగా మీ బంధమిత్రులకు ఫోన్ చేసి మీరు సురక్షితంగానే ఉన్నారని తెలియజేసి, అక్కడి పరిస్థితి గురించి వాకబు చేయండి.

9. వరదలు, నీరు అధికంగా ప్రవహించే ప్రాంతాలలో డ్రైవ్ చేయకండి.

10. ఎక్కువగా పగుళ్లు ఇచ్చిన రోడ్లపై డ్రైవ్ చేయకండి, ఎందుకంటే రోడ్డుపై ఏర్పడ్డ గుంతలలో మీ వాహన చక్రాలు ఇరుక్కు పోయే ఆస్కారం ఉంది.

11. పురాతన అండర్‌బ్రిడ్జ్‌లు లేదా భూకంపం వలన పగుళ్లు ఇచ్చిన బ్రిడ్జ్‌లపైన కానీ క్రింద కానీ డ్రైవ్ చేయకపోవటమే ఉత్తమం.

12. మట్టి పెళ్లలు విరిగిపడే కొండ ప్రాంతాల్లో డ్రైవ్ చేసేటప్పుడు ఆచి తూచి డ్రైవ్ చేయండి.

13. మరీ ముఖ్యంగా తీరప్రాంతపు రహదారులపై ప్రయాణించేటప్పుడు కూడా అప్రమత్తతో వ్యవహరించి వీలైనంత త్వరగా ఆ ప్రదేశాన్ని దాటివెళ్లేలా చూసుకోండి (భూకంపాలు సునామీలుగా మారే అవకాశం ఉంటుంది).

కాబట్టి, భూకంపాలు సంభవించేటప్పుడు పైన తెలిపిన విధంగా మన జాగ్రత్తలో మనం ఉండటం వలన మన ప్రాణాలను రక్షించుకోవటమే కాకుండా, మనం ఎంతో ఇష్టంగా చూసుకునే వాహనాలను కూడా సురక్షితంగా ఉంచున్న వాళ్లమవుతాం.

More from DriveSpark

Article Published On: Wednesday, April 11, 2012, 18:15 [IST]
English summary
Imagine you are struck by a earth quake while driving a car, what would you do to survive? Read on to learn a few steps to be safe while traveling in a vehicle if a tremor hits.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+