డార్క్ కలర్ కార్ల కన్నా బ్రైట్ కలర్ కార్లే బెస్ట్: స్టడీ
మీరు ఎంచుకునే కలర్ పైనే మీ కారు భద్రత అలాగే, మీ భద్రత ఆధారపడి ఉంటుంది. తాజాగా జరిపిన పరిశోధనల ప్రకారం, డార్క్ కలర్ (నలుపు, గ్రే మొదలైన రంగులు) కార్ల కన్నా బ్రైట్ కలర్ (ఎరుపు, పసుపు మొదలైనవి) కార్లే ఎక్కువ సురక్షితమైనవి తేలింది.
ఆస్ట్రేలియాలో జరిపినో ఓ పరిశోధనలో, రాత్రివేళల్లో బ్రైట్ కలర్ కార్ల కన్నా డార్క్ కలర్ కార్లే ఎక్కువగా ప్రమాదాలకు (యాక్సిడెంట్లకు) గురవుతున్నట్లు తేలింది. ఈ పరిశోధనలో భాంగగా, పరిశోధకులు 1987 నుండి 2004 మధ్య కాలంలో అన్ని రోడ్డు ప్రమాదాలకు సంబంధించి సేకరించిన దత్తాశం ప్రకారం, ఇతర రంగుల కార్ల కన్నా నలుపు రంగు కార్లు 12 శాతం అధికంగా ప్రమాదానికి గురయ్యే ఆస్కారం ఉన్నట్లు తేలింది.
చీకట్లో నలుపు వంటి డార్క్ కలర్ కార్ల కన్నా బ్రైట్ కలర్ కార్లు స్పష్టంగా కనిపిస్తాయి కాబట్టి, ఎదురుగా లేదా వెనుకగా వస్తున్న వాహనాలు బ్రైట్ కలర్ కార్లను సులువుగా గుర్తించడానికి వీలవుతుంది. తెలుపు, పసుపు, ఆకుపచ్చ, నారింజ వంటి రంగు కార్లు సురక్షితమైనవి వారు గుర్తించారు. సాధారణంగా కస్టమర్లు తెలుపు రంగు కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తుండటం మనం గమనిస్తుంటాం.
అలాగే, నలుపు రంగు కార్లను కూడా ఎక్కువగానే కొనుగోలు చేయటం జరుగుతుంది. (మన లాంటి చారిత్ర్మాక, సాంప్రదాయ దేశాల్లో నలుపు రంగును అశుభానికి సూచకంగా భావిస్తాం, అయినప్పటికీ మన దేశంలో కూడా ఈ రంగు కార్లను కొనేవారు అధికంగానే ఉన్నారు). ఒకవేళ చీకట్లో రోడ్డుకు పక్కగా నలపు రంగు కార్లను పార్క్ చేసినప్పుడు తెలుపు రంగు కార్లతో పోల్చుకుంటే వాటి విజిబిలిటీ తక్కువగా ఉంటుంది. ఇది కూడా ప్రమాదానికి ఓ పెద్ద కారణంగా చెప్పవచ్చు.
కాబట్టి, మనస్సుకు నచ్చిన డార్క్ కలర్ కారును కొనుగోలు చేసే కన్నా మనుషుల్ని సురక్షితంగా ఉంచే బ్రైట్ కలర్ కారును కొనుగోలు చేయటం ఉత్తమం.


Click it and Unblock the Notifications









