సురక్షితంగా ఓవర్‌టేక్ చేయడం ఎలా - చిట్కాలు
* భద్రత గురించి మీరు ఖచ్చితంగా, పూర్తిగా సురక్షితమని ధృవీకరించుకున్న తర్వాత మాత్రమే ఓవర్‌టేక్ చేయాలి.
* అధిక వేగంలో వాహనాన్ని నడుపుతున్నప్పుడు, ఎదురుగా వెళ్తున్న వాహనం ఎంత వేగంతో వెళ్తుంది, ఎంత దూరంలో ఉంది అనే విషయాన్ని గ్రహించగలగాలి.
* నేరుగా ఉన్న (స్ట్రైట్) రోడ్లపై వెళ్తున్నప్పుడు, ఎల్లప్పుడూ కుడి వైపు (రైట్ సైడ్) నుండి మాత్రమే ఓవర్‌టేక్ చేయాలనే విషయాన్ని గుర్తుంచుకోండి.
* మీరు ఓవర్‌టేక్ చేస్తున్నట్లు, మీ ఎదురుగా వెళ్తున్న వాహనపు డ్రైవర్ గుర్తించేందుకు గానూ.. హారన్ మ్రోగించడం లేదా హెడ్‌లైట్లను ఫ్లాష్ (ఆన్ అండ్ ఆఫ్) చేయటం, సైడ్ ఇండికేటర్‌ను ఆన్ చేయడం వంటి సంజ్ఞలు ఇవ్వాలి.
* ప్రత్యేకించి బస్ స్టాప్‌లలో ఆగి ఉన్న బస్సులను ఓవర్‌టేక్ చేసేటప్పుడు మరింత అప్రమత్తంగా ఓవర్‌టేక్ చేయండి.
* మీ ముందుగా వెళ్తున్న ఏదైనా వాహనాన్ని ఓవర్‌టేక్ చేసిన తర్వాత ఆ వాహనం కన్నా కాస్తంత వేగంగా ముందుకు వెళ్లాలి.
* ముందుగా వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేసేటప్పుడు దానికి మరీ అత్యంత సమీపంలో ఓవర్‌టేక్ చేయరాదు. ఇది చాలా ప్రమాదకరమైనది.
* ఒకవేళ మీ వాహనాన్ని ఎవరైనా ఓవర్‌టేక్ చేస్తున్నట్లు గుర్తించినట్లయినా, లేదా సిగ్నల్ ఇచ్చినా మీ వాహన వేగాన్ని తగ్గించి వారికి దారి ఇవ్వండి.


Click it and Unblock the Notifications









