వాహనంపై మితిమీరిన వేగం ప్రమాదానికి కారణం

Car Crash
'వేగం కన్నా ప్రాణం మిన్న'. వాహనంపై వెళ్తున్నప్పుడు పాటించాల్సిన వేగం గురించి ఎంత చెప్పినా, ఎన్నిసార్లు హెచ్చరించినా ప్రస్తుత యువతకు ఇవేమీ పట్టవు. వారికి ఇదొక పాతకాలపు సామెతలా అనిపిస్తుంది. "తరం మారింది బాస్.. మాది ఫాస్ట్ జనరేషన్ అందుకే ఈ ఫాస్ట్..! మనం వేగంగా లేకుంటే జీవితంలో మన గమ్యాన్ని చేరుకోలేం" అంటూ ఆధునిక వేదాంతాలు వల్లిస్తుంటారు.

నిజమే..!! మనం వేగంగా లేకుంటే గమ్యాన్ని త్వరగా చేరుకోలేం. అయితే, వేగం అనేది జీవన ప్రయాణంలో కావాలి కానీ రోడ్డుపై చేసే ప్రయాణంలో కాదు. యువకులు చూపించే అత్యుత్సాహం, ఆత్రుత, అవివేకాల కారణంగా ప్రమాదాల బారిన పడుతుంటారు. ఏదైనా వాహనాన్ని గరిష్ట వేగానికి తీసకువెళ్లడం పెద్ద పనేం కాదు. అయితే, అదే వాహనాన్ని సదరు వేగంలో నియంత్రించడమే క్లిష్టం.

తమని ఎవరో ఓవర్‌టేక్ చేశారనో, స్నేహితులు ప్రోత్సహించారనో వాహనాలను వేగంగా నడిపి వారి ప్రాణాలతో పాటుగా తోటి ప్రయాణికులు, రోడ్డుపై వెళ్లే ఇతరుల ప్రాణాలను కూడా చిక్కుల్లో వారు పెట్టడాన్ని మనం తరచూ గమనిస్తూనే ఉన్నాం. ఈ సందర్భంలో, వారి గురించి, వారిపై ఆధారపడిన వారి గురించి, వారి ఉజ్వల భవిష్యత్తుపై కోటి ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల గురించి ఒక్క క్షణం ఆలోచించగలిగినట్లయితే, వారు సురక్షితంగా ఉండటమే కాకుండా వారి చుట్టూ ఉన్న వారిని కూడా సురక్షితంగా ఉంచిన వారు అవుతారు.

More from DriveSpark

Article Published On: Wednesday, December 21, 2011, 14:45 [IST]
English summary
Driving cars at high speeds is an easy task but maintaining full control on the car is more important. Driving at high speeds will always be dangerous. One must always consider the lives of the passengers and other road users as well as the people depending on them before attempting go in high speeds.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+